Pages

Wednesday 7 May 2014

విధి







   విధి

   నా ఏకాంత  గానాన్ని  నీకు  వినిపించాలని,
   నిశిరాత్రి  గొంతు  సవరించుకుంటాను.

   ఎముకలు  కొరికే  చలిలో నీ వెచ్హని స్పర్శ,
   నన్ను అంటుకొనే ఉందని  భావిస్తుంటాను.

   అంతలో కర్తవ్యం గుర్తొచ్హి  శత్రువుకోసం,

    నిశ్శబ్ద   నడిరేయిలో కళ్ళు విప్పార్చి చూస్తుంటాను.

   నా గుండెలపై  ఆనించిన  నీ తల గుర్తొస్తుంది,

   భాతమ్మకు సవాల్ విసిరే  చొరబాటుదారుడు గుర్తొస్తాడు.

   మన ప్రేమ  మొలక చిట్టి తల్లి  ఇప్పుడెలా ఉందో అనుకుంటాను,

   మన దేశ హద్దు దుష్మన్‌  దాటేశారేమో అని కలవర పడతాను.

   నా  చిన్ని ప్రపంచం  నువ్వూ,నా చిట్టి తల్లీ, అనుకుంటాను,

   మరు క్షణం  కాదు, కాదు, విశాల భారతం నా  కుటుంబం   అనుకుంటా..

   నా జీవన  సహచరీ.. మనసంతా నువ్వే అనుకుంటాను,

   నా భారత మాతా, గుండె నిండా నువ్వే, అని ఎప్పటికీ అంటాను.

   ఓ అమ్మకు ముద్దు బిడ్డ నే, ఓ ఇల్లాలికి వీర పతినే,

   కానీ, భారతమ్మ నమ్మిన  సిఫాయిని. 
   విధినిర్వహణలో ఉన్న  వీర జవాన్‌ని. 
   

10 comments:

  1. జై జవాన్.
    అతని ఆలోచన ఎంత ఉన్నతం, కావలది అందరికి ఆదర్శం

    ReplyDelete

  2. " ఓ అమ్మకు ముద్దు బిడ్డ నే, ఓ ఇల్లాలికి వీర పతినే,
    కానీ, భారతమ్మ నమ్మిన సిఫాయిని.
    విధినిర్వహణలో ఉన్న వీర జవాన్‌ని. "
    ఓ వీర జవాను కు మీరిచ్చే అమూల్య కానుక ఇది . "

    అందురు రాస్తారు కవితలు .
    కొందరు చంద్రుని మీద ,
    మరి కొందరు పూలూ - వనాల మీద ....
    మరికొందరైతే నాగా నట్రా మీద
    ఇలా ఎన్నెన్నో .
    అయితే సరిహద్దుల్లో నిలిచి,
    తన ప్రాణాలను సైతం ఒడ్డి...
    దేశ రక్షణలో నిమగ్నుడైన ఓ 'జవాన్ ' గురించి
    ఓ కవితనల్లిన మీకు అభినందనలు ... కృతజ్ఞతలు కూడానూ.

    కవిత చదివాక ఇంకాస్తా గురుతర
    గౌరవభావం పెరిగింది మీ మీద.
    ఫాతిమా గారూ. ధన్యులు మీరు.

    *** శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాద గారూ, మీకు గురువునయ్యానో లేదో కానీ,
      ఇంకా బాగారాయాలని అభ్యసించటములొ మాత్రం నిత్య విధ్యార్దినే నేను.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  3. ఫాతిమాజి ,

    ఆ సరిహద్దులోని జవానులు వాళ్ళు పొందవలసిన సుఖాలను మనం పొందేలా చేయటం వల్లనే , మనమిలా అప్పుడప్పుడైనా ఆనందాన్ని పొందగలుగుతున్నాము , హాయిగా ఆదమఱచి నిద్ర పోగలుగుతున్నాము రాత్రుళ్ళే కాదు , అప్పుడప్పుడు పగళ్ళు కూడా అన్నది ఈ కవిత ద్వారా మననం చేసుకోవచ్చు . .

    ReplyDelete
    Replies
    1. నిజమే నిర్భయంగా ఉండగలుగుతున్నాం అంటే వారి పుణ్యమే.

      Delete
  4. సైనికుడు అవసరం లేని ఒకే సమాజం (ప్రపంచం) వచ్చేంతవరకూ వీర జవాన్లకు ఈ బాధలు తప్పవు. కవిత బాగుందండీ.

    ReplyDelete
  5. ధన్యవాదాలు సర్.

    ReplyDelete
  6. నిశిరాత్రి గానకోకిలలా .... ఎముకలు కొరికే చలిలో వెచ్చని స్పర్శ సాహచర్యాన్ని తలచుకుని, అంతలోనే కర్తవ్యం గుర్తొచ్చి శత్రువు కదలికలను గమనిస్తుండటము.
    గుండెలపై ఆన్ చిన భాగస్వామి తల, భారతమ్మకు సవాల్ విసిరే చొరబాటుదారుడు మారి మారి గుర్తుకురావడము.
    ఒకవైపు ప్రేమ, మరొకవైపు సరిహద్దు పోరాటము ను చక్కగా ఆవిష్కరించి
    మానసిక సంఘర్షణను విధి కవిత లో చక్కగా ఆవిష్కరించారు కవయిత్రి గారు.
    చాలా బాగుంది కవిత
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete