అను నిత్యం నన్ను వెన్నంటి ఉండే నా చెలి హటాత్తుగా అదృశ్యమైంది. తన అంతరంగ బందీఖానా నుండి నన్ను విముక్తుణ్ణి చేసింది. తన మాటల స్పర్శతో లాలిస్తూ, నా అనాలోచిత పలుకులనే అమృతగుళికలుగా, స్వీకరించేది. అడుగడుగునా అక్షర సుగంధమై, భావ సోపానమై నా పాదాల కింద, తన అరచేతులుంచేది. తనో అనుభవ వటవృక్షమైననూ , నా ముందు నేల తంగేడులా, తలవంచేది . ఎన్నోసార్లు అనుకోని ఒప్పందాలూ , మరెన్నోసార్లు నిశ్శబ్ద సంకేతాలూ, పలితంగా..,కమ్ముకొనే కారుమేఘాలూ . నా చుట్టూ ఆమె కట్టే సాలీడు దారాలను సైతం, భరించలేని సున్నితుడనై , భావోద్రేకుడనై ..., మన:చంచిలుతుడనై , మౌనరోదితుడనై,..హోరెత్తే కడలి తరంగాన్నై, ఆమె కాలికింది భూమిని లాగేసుకున్నాను. ఆ సమయాన అలిగిన నా అభిసారిక, నన్ను పరాదీనుని చేసి , పయనమై సాగిపోయింది. అర్దంలేని అపోహలతో, అపార్దాలతో, అదృశ్యమై పోయింది. ఆమె నీడ మాత్రమే నాకు మిగిలింది.
నా రాతలు. దోసెడు అక్షరాలను , ఎప్పుడొ బడి కొమ్మ నుండి ఒడిలోకి రాల్చుకున్నా..., అను నిత్యం ఆ ముత్యాలను, మెరుగు పెడుతూ, మురిసిపోతున్నా.., అప్పుడప్పుడూ అవి నక్షత్రాలై, మినుకు,మినుకు మని వెలిగి, నన్ను గగనాన నిలుపుతుంటాయి. అక్కడక్కడా వేదనలై.., జ్వాలలా ఎగసి, నన్ను కాలుస్తుంటాయి. కొన్నిసార్లు నీటిమీద రాతలై, చెరిగి పోతూ, కనుమరుగవుతుంటాయి. చాలా సార్లు విలువలేని, ప్రేమ సందేశాలై.., వెక్కిరిస్తుంటాయి. ఎక్కువసార్లు ఆకలి కేకల నినాదాలై, అంగలార్చుతుంటాయి. ఇహానికీ,పరానికీ..., నిజానికీ,ఇజానికీ, మద్య నలుగుతూ, మరణానికి సమీపాన,......... ఊపిరి సంతకాలై ఉరితీస్తుంటాయి .
మనో...విన్నపం నిన్ను నువ్వు కాదేమో అన్నానో ..,కోపం నీకు. కానీ... నువ్వు నువ్వు కాదనే నమ్మకం నాకు. నిన్ను వెతికే నెపంతో నన్ను నేను, జారవిడుచుకుంటుంటాను. వ్యక్తిగతం నుండి నిన్ను గతం గానే , స్వీకరిస్తాను నేను . వ్యక్తిగా నీవు శక్తివే కావొచ్చు, చలనానివే కావచ్చు, కానీ, నా మనోదారిలో ఎదురైన .., పసిపాపవే నాకు. నీకు తెలుసా...? నిను నెలవంకను చేసి , వేల తారకలు నీ చుట్టూ బ్రమించే వేళ, విరిగిపడిన వెన్నెల కిరణ్ణాన్నై .., నేలరాలుతుంటాను. కానీ ,సమూహాన్ని వీడి, నా నెత్తుడి అడుగుల వెంట చూపు సారించి, నను అందుకొనే వరకూ విశ్రమించని నెలరేడువు నీవు. నా శిరస్సుపై మోసే నమ్మకాన్ని అతి పదిలంగా చూసుకుంటూ.., అలుపెరుగని అభిసారికలా...., అను నిత్యం నిరీక్షిస్తుంటాను. ఓ వెన్నెల సంతకమా.., ఓ అరవిరిసిన వసంతమా.., అలుపెరుగని సమీరమా..., నా అపురూప వరమా.., ఏ కొనలో విరిసినా..,పరిమళమై కదలి రావా...?
నా గదిలో... సమాదినై. రోజంతా పరుగెత్తిన జీవితం, రాత్రికి గదిలో బంధీ అవుతుంది. విశాలమైన గదియైనా.., ఏదో ఇరుకు భావన. గది వారగా మేజాపై సగం రాసిన, కాగితాల వెక్కిరింతలు, తలుపులు బిగించుకున్నా.., వెంటాడుతున్నట్లున్న , చింపిరి లేత దేహాలు. నేను రోజంతా లిఖించినా, అక్షర రూపం లేని సిరామరకలు. ఓ పసిదాని ప్రశ్న , నన్నింకా నిలదీసి, ఉరికొయ్యకు బిగదీసినట్లుంది. మేడమ్ ఇక్కడ అన్నం పెడతారా? అక్షరాల అగాధాలమద్య, కూరుకుపోయిన నేను, అర్దంలేని ప్రశ్నేంటి అన్నట్లు , స్వార్ధపు నవ్వు నవ్వాను. అక్షరమే తప్ప ఆకలి ఎరుగను, గొంతు నొక్కిన ఆకటి అరుపులను, ఎలా వినగలను? శవపేటిక వంటి ఈ గదిలో, స్వయంకృత బంధీనై , గుండెను నిప్పుల నినాదాలలో, కవాతు చేయిస్తున్నా, ఆ ..పసిదానికి ఆకలి తర్వాతే అక్షరం నేర్పాలని, తెలుసుకున్న విద్యార్ధినై.., మదిలో రేగే జ్వాలల్లో, అసమర్ధపు సమాదినై...,