Pages

Saturday 2 August 2014

నా గదిలో... సమాదినై.

    






    నా   గదిలో... సమాదినై. 

     రోజంతా పరుగెత్తిన జీవితం,
     రాత్రికి గదిలో బంధీ అవుతుంది. 

     విశాలమైన  గదియైనా..,
     ఏదో ఇరుకు భావన. 
     గది వారగా మేజాపై  సగం రాసిన, 
     కాగితాల వెక్కిరింతలు,
     తలుపులు  బిగించుకున్నా.., 
     వెంటాడుతున్నట్లున్న ,
     చింపిరి లేత దేహాలు. 
     నేను రోజంతా లిఖించినా,
     అక్షర రూపం లేని 
     సిరామరకలు. 
     

     ఓ పసిదాని  ప్రశ్న ,
     నన్నింకా  నిలదీసి,
     ఉరికొయ్యకు  బిగదీసినట్లుంది. 

     మేడమ్ ఇక్కడ అన్నం పెడతారా? 

     అక్షరాల అగాధాలమద్య, 
     కూరుకుపోయిన నేను,
     అర్దంలేని   ప్రశ్నేంటి అన్నట్లు ,  
     స్వార్ధపు నవ్వు నవ్వాను. 
     అక్షరమే తప్ప ఆకలి ఎరుగను,
     గొంతు నొక్కిన ఆకటి అరుపులను, 
     ఎలా వినగలను?  

     శవపేటిక వంటి ఈ గదిలో,
     స్వయంకృత బంధీనై ,
     గుండెను నిప్పుల నినాదాలలో, 
     కవాతు చేయిస్తున్నా,  
     ఆ ..పసిదానికి  ఆకలి తర్వాతే 
     అక్షరం నేర్పాలని, 
     తెలుసుకున్న విద్యార్ధినై..,
     మదిలో రేగే  జ్వాలల్లో, 
     అసమర్ధపు సమాదినై..., 

      









  

5 comments:

  1. భావన చక్కటిది , చిక్కటిది , ఇంకొకరికి చిక్కనిది , మరొకరికి దక్కనిది .
    " మది గదిలో సమాధినై......."

    రోజంతా పరుగెత్తిన జీవితం,
    రాత్రికి గదిలో బందీ అయిపోయింది .

    గది విశాలమే ఐనా..,
    మదిలో ఏదో ఇరుకు భావన.

    గది వారగా మేజాపై సగం రాసిన,
    కాగితాల వెక్కిరింతలు ,

    తలుపులు బిగించుకున్నా..,
    వెంటాడుతున్నట్లున్న ,
    చింపిరి చింపిరి లేత దేహాలు ,

    నేను రోజంతా లిఖించినా,
    అక్షర రూపం దాల్చలేని
    సిరామరకలు.

    " మేడమ్ ఇక్కడ అన్నం పెడతారా ? "

    ఓ పసిదాని ప్రశ్నకు ,

    నన్నలా ఉరికొయ్యకు బిగదీసినట్లయింది.

    అక్షరాల అగాధాలమద్య ,
    కూరుకుపోయిన నేను ,

    అక్షరమే తప్ప ఆకలెరుగని నేను ,

    అర్దంలేని ఆ ప్రశ్నేంటి అన్నట్లు ,
    ఓ స్వార్ధపు నవ్వు నవ్వాను.

    గొంతు నొక్కేసుకున్న నేను ,
    ఆకటి అరుపులను ,
    ఎలా వినగలను ?

    శవపేటిక వంటి ఈ గదిలో,
    స్వయంకృత బందీనై ,
    గుండెను నిప్పుల నినాదాలలో,
    కవాతు చేయిస్తున్నా,
    మదిలో రేగే జ్వాలల్లో,
    అసమర్ధపు సమాధినై...,

    ఆ ..పసిదానికి ఆకలి తర్వాతే
    అక్షరం నేర్పాలని,
    తెలుసుకున్న విద్యార్ధినై.......


    ReplyDelete
    Replies
    1. శర్మా బాయ్ ..., మీకు నచ్చటమంటే నేను బాగా రాసినట్లే.
      మీరు మెచ్చేలా, సామాజిక భాద్యతనెరిగి రాయాలని ఆ ప్రయత్నం.
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  2. savapetikavanti eegadilo swayamkrutha bandeenai eeokka line chalu naa akka ni thelusukovadaniki hatsoff akka chinna

    ReplyDelete
    Replies
    1. చిన్నా,(సుదా) నీ కామెంట్ చూసి ఎవరో అనుకున్నాను.
      అక్కని పదాలలో గుర్తిస్తున్నావన్నమాట.
      అప్పుడప్ప్పుడూ ఇలా నా బ్లాగింట అడుగెట్టి అక్క ఆతిద్యం తీసుకో.

      Delete
  3. "వెన్నెలకెరటం" సాహిత్య బ్లాగుకు సభ్యత్వనమోదుకు ఆహ్వానం
    http://vennelakeratam.blogspot.in/p/blog-page_4312.html

    ReplyDelete