Pages

Friday 15 August 2014

నా రాతలు











    నా  రాతలు.

    

    దోసెడు  అక్షరాలను ,
    ఎప్పుడొ  బడి కొమ్మ నుండి
    ఒడిలోకి రాల్చుకున్నా...,

    అను నిత్యం ఆ ముత్యాలను,
    మెరుగు పెడుతూ,
    మురిసిపోతున్నా..,

    అప్పుడప్పుడూ అవి నక్షత్రాలై,
    మినుకు,మినుకు మని వెలిగి,
    నన్ను గగనాన నిలుపుతుంటాయి.

    అక్కడక్కడా వేదనలై..,
    జ్వాలలా ఎగసి,
    నన్ను కాలుస్తుంటాయి.

    కొన్నిసార్లు  నీటిమీద రాతలై,
    చెరిగి పోతూ,
    కనుమరుగవుతుంటాయి.

    చాలా సార్లు విలువలేని,
    ప్రేమ సందేశాలై..,
    వెక్కిరిస్తుంటాయి.

    ఎక్కువసార్లు
    ఆకలి కేకల నినాదాలై,
    అంగలార్చుతుంటాయి.


    ఇహానికీ,పరానికీ...,
    నిజానికీ,ఇజానికీ, మద్య నలుగుతూ,
    మరణానికి సమీపాన,......... ఊపిరి సంతకాలై  ఉరితీస్తుంటాయి .









6 comments:

  1. ఇవి నీ రాతలే కావు , తెలుపును నలుపును చేసే నీలాంటి వారి ఎందరో రాతలు నిస్సందేహంగా .

    చక్కటి భావం . చాలా చాలా బాగుంది . పదాల కూర్పులో నేర్పు కనపడ్తోంది .

    చిన్న అచ్చు తప్పులు ( అక్షర క్రమంలో ) కరెక్ట్ చేస్తే బాగుంట్దుంఇ .

    దోసెడు అక్షరాలను ,
    ఎప్పుడొ (డో ) ,
    బడి కొమ్మ కంటే (బడి వృక్షం) నుండి
    వ(ఒ)డిలోకి రాల్చుకున్నా...,

    అను నిత్యం ఆ (అక్షర)ముత్యాలను,


    నన్ను (తమ) గగనాన నిలుపుతుంటాయి.

    అక్కడక్కడా (అడపా తడపా) వేదనలై..,

    ఇహానికీ,పరానికీ...,
    నిజానికీ,ఇజానికీ మద్య (నడుమ) నలుగుతూ,
    మరణానికి సమీపాన,......... ,
    ఊపిరి సంతకాలై ఉరి (తీయబడ్తుంటాయి) తీస్తుంటాయి .

    ReplyDelete
  2. అన్నయ్యా.., మీరు సరిచేసిన కొన్ని పదాలు, నా భావాలనే మార్చేసేలా ఉన్నాయి అందుకే సరిచేయలేక పోయాను.
    ఉదా:- వృక్షం నుండి ఒడిలోకి రాల్చుకున్న్నా ...
    ఇది కొమ్మ నుండే సాద్యం అని అలా రాశాను.
    2.ఊపిరి సంతకాలై ఉరి తీయబడటం లేదు, తీస్తున్నాయి.

    ఇకపోతే మీ సవరణలు చాలా సమ్మతమైనవే. ధన్యవాదాలు .

    ReplyDelete
  3. మెరాజ్ గారు,

    బాగున్నారా?

    గతంలో చెప్పిందే మరల చెప్తున్నా.
    మీ పెల్లుబికిన అపూర్వ భావ ప్రకటన ప్రతిగుండెలో ప్రతిధ్వనిస్తుంది. మనస్సును ద్రవింపజేసి మానవత్వమును మేల్కొలిపే ఇంతటి అభ్యుదయ "రాతలు" మీకు మాత్రమే సాధ్యం. చక్కటి భావవెల్లడి.

    ReplyDelete
  4. భారతి గారూ, మీ స్పందన చాలా సంతొషాన్నిచ్చింది. మీ వాఖ్యలకున్న బలం అది.
    మనస్సు బాగా లేకుంటే మీ బ్లాగ్ చదివి మనస్సుకు ప్రశాంతంత తెచ్చుకుంటాను నేను, అంతగా రాసే పవర్ మీకుంది.
    ధన్యవాదాలు మరోమారు.

    ReplyDelete
  5. అక్షరాల వెనక ఆర్తిని వాటిపై ప్రేమను బాగా చెప్పారు ఫాతిమాజీ మీ శైలిలో.. అభినందనలు..

    ReplyDelete
  6. ధన్యవాదాలు మీ స్పందనకు వర్మాజి

    ReplyDelete