Pages

Tuesday, 10 February 2015

అనిశ్చతాక్షరాలు

 

అనిశ్చతాక్షరాలు మది ధరణిలో మొలకెత్తే 
విత్తనమే అక్షరం,
మనల్ని  మంచి బాటన  నడిపించే,
మల్లెల బాటలే  మన రాతలు  


బతుకు పూదోటలో,
ముల్లులా గుచ్చుకున్నా, పువ్వులా విచ్చుకున్నా,
తరతరాలుగా నీడనిచ్చే తరువు   కావాలి . 


హృదయ   సంద్రాన   ఉవ్వెత్తున ఎగసిపడే
భావకెరటం   కావాలి,
మూతులెల్లబెట్టే   పీత పిల్లలు కాకూడదు. 


తప్పుడు  తలపులను తెచ్చే ,
చప్పుడు చేయని  రహస్య  రాగం  కాకూడదు,
తర్కం   కొలిమిలో  కాగి,సాగి ,
నిర్మాణకారికో, విప్లవకారికో  రహదారి కావాలి.    

లక్ష్యంలేని  పిచ్చికుక్కల్లా,
చివుళ్ళుమేసే  గొంగళ్ళులా ,
చేటు చేసే  చాటు  రాతలై ,
అసాంఘిక సమస్యలై  విస్తరించకూడదు. 


గుండెలో చిటికెడు ఆత్మా విశ్వాసం  లేకున్నా,
అనైతికపు అంగబలం తో ,
మెచ్చుకోలు  ఉచ్చులకై  చీకటి చెట్లు ,
అక్షరాలను  గబ్బిలాల్లా   వేలాడదీయకూడదు. 

చేతకాని, చేవలేని, మార్పులేని, 
విలువలేని, మంచిలేని, వంచన రాతలు ,
వ్యవస్థను  శాశ్వత  వికలాంగనగా మార్చి , 
నిఘాలేని  దగాకోరు  రాతలే అవుతాయి .

  6 comments:

 1. మది ధరణిలో మొలకెత్తిన విత్తనమే అక్షరం,
  మనిషిని మంచి బాటలో మల్లెల బాటలో నడిపించే భావనలే మన రాతలు.
  చక్కని విశ్లేషణ ఈ అనిశ్చతాక్షరాలు
  అభినందనలు మెరాజ్ గారు!

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు నా ధన్యవాదాలు సర్.

   Delete
 2. నిశ్చితాక్షరాలే ఈ కవిత .

  ReplyDelete