Pages

Thursday 6 December 2012

అశ్రు వేదన










అశ్రు వేదన

ఒక్క అశ్రువు   వర్షించటానికి
గుండె చేసుకున్న గాయపు  మేఘాలెన్నో..

మనస్సు రోదన వినటానికి
వేదనతో  తెగిపోతున్న నరాలెన్నో,

భ్రమల   బతుకు  సాగించటానికి
దేహపు  పొరలకింద  చలనాలెన్నో..

ఘనీభవించిన   కాలాన్ని కరిగించటానికి
బ్రతుకు  బందీఖానాలోని  ఖైదు  క్షణాలెన్నో.

యెదలో  మెదిలే  ఊసులను  దాచటానికి,
పెదవులు  పలకలేని   పదాలెన్నో..

కళ్ళముందే  కలల నావ సాగిపోతుంటే,
దీర్ఘ వియోగాన్ని  మోసే  క్షణాలెన్నో...

అన్వేషిస్తున్న అడుగుజాడలు కనబడకుంటే..
కలత నిద్రలో ఉలిక్కిపడిన గడియలెన్నో  ...

కడుపున  దాచుకోని  కడలి వెడలగోడుతుంటే ..
తీరం వెంబడి  వేసే అడుగులెన్నో...

18 comments:

  1. మనసుని చలింపచేసి, మనిషిని అలోచించేలా చెయ్యడానికి
    మేరాజ్ గారు రాసే కవితా ఆణిముత్యాలెన్నో!

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ, మీ అభిమానం చాలదా ఇట్టే ముందుకు దూసుకుపోవటానికి.
      మీ ప్రోత్సాహం లేకపోతె నేను ఇలా రాయలేనేమో. కృతజ్ఞతలతో...... మీ మెరాజ్

      Delete
  2. ఎన్నో! ఎన్నో!! ఎన్నెన్నో!!!

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానం ఉంటె ఇంకా ఇలా ఎన్నో..
      మీకు నా కృతఙ్ఞతలు ఇలా ఎన్నో..

      Delete
  3. వేదనలో మనసే మూగబోతుంది. మూగబోయిన మనస్సుని స్పర్శిస్తూ ఆ అశ్రు వేదనను అక్షరీకరించడం.......
    ఇంత చక్కగా ఎలా భావవ్యక్తీకరణ చేస్తారో గానీ, ఇది ఎప్పుడూ నాకు ఆశ్చర్యకరమేనండి.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ,
      మీ అభిమానానికి మీ భావ విశ్లేషణకు నా మనస్పూర్తి కృతజ్ఞతలు

      Delete
  4. గుండెని కరిగిస్తేనే ఇలాంటి కవిత్వం పెల్లుబుకుతుంది.

    ReplyDelete
  5. Mee vanti peddala aaseerwaadamto koodaa vastundi.

    ReplyDelete
  6. బాగుంది ఫాతిమా గారు,...

    ReplyDelete
    Replies
    1. బాస్కర్ గారూ, ధన్యవాదాలు.

      Delete
  7. మీ కవిత కొత్త పుంతలు తొక్కుతొంది.
    వేదన నుంచి అద్బుత కవిత్వం పుట్టడం సహజం.
    ఎలాగంటే, శివుడి ఆశ్రువుల నుంచి పవిత్రమైన రుద్రాక్షలు ఉద్భవించినట్లు!
    కొత్త ఉపమానాలు కనిపించాయి.
    గుండెలకు గాయాలు అయితే అవి మేఘాలుగా
    తోచడం, వాటి నుంచి అశ్రు కణాలు వర్షించడం వంటివి.
    చూస్తూ ఉండండి మీ కవితలపై ఎవరో ఒకరు
    పరిశోధించి డాక్టరేట్ సాధించడం నిశ్చయం!
    శుభాభినందనలు!!

    ReplyDelete
  8. నా కవిత కొత్త పుంతలు తొక్కింది అని చెప్పిన మీకంటె యెవరికి తెలుసు నా కవిత్వం యెలాంటిదొ
    గుండెకు గాయాలు మెగాలౌ అవుతాయనీ, అవి వర్షిస్తాయనీ మీరు చెసిన రీసెర్చ్ ఎవరు చెయగలరు.
    కనుక నా కవితల్లొ మెగాలే ఉన్నాయొ,చీకట్లే ఉంటాయొ ఒ పెద్ద కవిగా మీకె తెలుసు.
    సర్ ధన్యవాదాలు మీ అభిమానానికి.

    ReplyDelete
  9. ఎప్పటిలాగే చాలా బాగుంది మీ కవిత్వం ఫాతిమా గారు.

    ReplyDelete
    Replies
    1. డేవిడ్ గారూ ధన్యవాదాలు నా ప్రతి కవితా మీకు

      Delete
    2. డేవిడ్ గారూ ధన్యవాదాలు నా ప్రతి కవితా మీకు

      Delete
  10. అన్వేషిస్తున్న అడుగుజాడలు కనబడకుంటే..
    కలత నిద్రలో ఉలిక్కిపడిన గడియలెన్నో...

    వేదనను అశృవులో బంధిస్తూ పలికిన కవితాధార... అభినందనలు ఫాతిమాజీ..

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ, వేదన అశ్రువు తో స్నేహం చేస్తేనే రోదనగా మారుతుంది
      నచ్చిన ధన్యవాదాలు.

      Delete
  11. ఎన్నో ఎన్నెన్నో... ఆని ఆ చిన్ని హ్రుదయానికి ఉపశమనం .. మరో హృదయం తోనే సాధ్యం .
    కవిత అధ్బుతం మేరాజ్ గారు.

    ReplyDelete