Pages

Tuesday 12 February 2013












నిప్పుల పాదం 

నిన్ను హక్కున చేర్చుకున్నట్లే 
నటిస్తూ ,
పక్కకి నెట్టేస్తాడు.

నీ ముందు ఇకిలిస్తూనే  
నీ రంగు గూర్చి,
నీ వెనుక సకిలిస్తాడు.

నీ  శవం ముందు చేరి,
నీ  చర్మపు  డప్పే,
మోగిస్తాడు.

నీ తాతలు కుట్టిన  చెప్పులు
తొడుక్కొని,
నిను తొక్కాలని చూస్తాడు.

సమాజం మొండి గోడపై,
నిన్ను విసర్జపు పిడకలా,
ఎండ బెట్టాలని  చూస్తాడు.

నీ దేహంపై " వెలి"  ముద్రలు  వేసి,
దిస  మొలతో,
నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు.

వథ్య శిలపై నిన్ను నిలబెట్టి ,
ఉరితాడుతో ఊపిరి తీసి,
క్షుద్ర తాండవం చేస్తున్నాడు.

"దళిత భుజంగం" నీవు,
బుసకొట్టు, పడగ విప్పు,
కాటువేయి  నీకు చేటు చేసినోడిని.











1 comment:

  1. "దళిత భుజంగం" నీవు,
    బుసకొట్టు, పడగ విప్పు,
    కాటువేయి నీకు చేటు చేసినోడిని.....
    ఎంత చక్కని కవిత...ముగింపు దారి చూపిస్తుంది ఫాతిమ గారు

    ReplyDelete