Pages

Friday 8 February 2013

బ్రతుకంటే...







బ్రతుకంటే... 


పత్తి  దూదిలా  మెత్తదనం కాదు,
ఇనుపముక్కలా విరగనితనం.

మధువును గ్రోలే భ్రమరం  కాదు,
ఎద్దుపుండుపై  కాకి చలగాటం.

ప్రేమల రంగుల రాట్నం కాదు,
పోకిరీల  వెకిలి ఆరాటం.

మమతల తేనే ఊట  కాదు,
ఉట్టిపై  అందని చద్ది మూట.

అనురాగపు  వలపు బాట కాదు,
తీగపై  ఆడే గారడీ  ఆట.

కడుపు నిండిన పండగ కాదు,
పేగులెండిన  ఆకలి. 




10 comments:

  1. Replies
    1. డేవిడ్ గారూ, ధన్యవాదాలు.

      Delete
  2. మీరు మరీ నిరాశావాదం వైపు మొగ్గుతున్నారేమో!

    ReplyDelete
    Replies
    1. నిజమే అనిపిస్తుంది సర్, ఈ సారి ఆశతో ప్రయత్నిస్తాను.

      Delete
  3. నిజమే, కానీ కొందరికి బ్రతుకు పూలబాటలానే ఉంటుంది. కొందరికే అది ముళ్ళబాట. ముళ్ళబాటలోనూ కడదాకా పూల కోసం వెదుకుతూ సాగేదే బ్రతుకు. అదే బ్రతుకు గొప్పతనం!
    కవితలో రెండు కోణాలూ చూపెట్టారు. కానీ అందరిదీ ఒకకోణమే కాదు.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారూ, మీ వివరణ బాగుంది. మీఎ స్పందనకు నా నమస్సులు.

      Delete
  4. మాటల గారడి అలానే ఉంది.
    కానీ సమయం సరిపోవడం లేదోమో కదా!
    కవితలు పొట్టిగా ఉంటున్నాయి.
    ఆశువుగా చెప్తున్నారేమో ఈ మధ్య!
    కానీ ఆపకండీ. ఝరి సాగాల్సిందే!

    ReplyDelete
    Replies
    1. సర్, మీ అభిమానం నా చేత రాయిస్తుంది. ఈ పాటి కవితలకే బిజీ అయిపొతున్నాను. అంత పెద్ద పొస్ట్ లో ఉండి, అన్ని భాద్యతల నడుమ మీరు మూడు వార పత్రికల్లో యెలా రాయగలుగుతున్నారో.. నా కవిత మీరు చదవటం సంతొషం సర్.

      Delete
  5. శ్రీ ఫాతిమాగారికి, నమస్కారములు.

    పెద్దలు `కష్టెఫలే ' గారు మీరు నిరాశవైపుకి మొగ్గుతున్నారేమోనని అన్నారు. కానీ, నా పరిశీలనలో మీరు చెప్పిన వాక్యాల్లో జీవితాన్ని రెండు విధాలుగా చూపించారు. ఒకటి, మామూలుగా పైకి కనిపించేది; రెండవది శ్రమించి, సాధించేది. ఇనుములాంటి జీవితపు మంచంపై దూదిలాంటి పరుపును వేసుకోగలగాలి;
    మండే పుండుపై మధువును చల్లగలగాలి;
    పోకిరీలనుకూడా ప్రేమించాలి;
    అందని ఉట్టిని అందుకొనే ప్రయత్నం చేస్తే మమతల చద్దిమూట దొరుకుతుంది;
    ఆడే ఆట గారడీ అని తెలుసుకుంటే వలపు బాటే అవుతుంది.
    ---- శ్రమించి సాధించేదే బ్రతుకంటే!!

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  6. సర్, మీ అభిమానానికి చాలా సంతొషం , ఇకపోతే మీ విష్లేషణ గొప్పగా ఉంది, నేను అందుకే రెండు కోనాలూ చెప్పాను, అయితే అక్కడ ఇదే కాదు ఇది కూడా ఉంది అని చెప్పాల్సింది." ఉదా:అనురాగపు వలపు బాటే కాదు, గారడి ఆట కూడా.." మీ ప్రసంశకు నా ధన్యవాదాలు.

    ReplyDelete