Pages

Sunday 24 February 2013






నిశి శాంతి 


అప్పుడే  ఎంత దూరం 
వెళ్ళావో   కదా
నేను  నీకోసం  కార్చిన  
కన్నీరింకా  ఇంకనే లెదు. 


ప్రణయ  విహంగాల్లా 
ఎగిరిన  ఆ రోజులు,
ఇంకా  నను విడిచి 
వెళ్ళనే  లేదు. 


నీకై  తపించే   నా మనస్సు,
నీకై  స్పందించే  నా హృదయం,
నీకై  శ్వాసించే  నా శ్వాస
నన్నింకా   వీడనే లెదు. 


వీడలేక  విడిపోయిన  ఆ రోజు,
వణికే  నీ పదవులు  పలికిన
వీడ్కోలు  నాకంటి   పాపాలను 
ఇంకా  వీడి  పొలెదు. 


ఆ మొదటి  ఆలింగనం,
అ మొదటి  ముద్దూ,
ఆ వెచ్చటి  స్పర్శా ,
గువ్వలా ఒదిగిన  నీ మెత్తదనం 
నాకు  దూరంకానే లేదు


మూసిన  నా కనురెప్పల  వెనుక,
నీ చూపులింకా గుచ్చుతూనే 
ఉండటం, నా మెడ  వంపులో,
నీ  వెచ్చటి  శ్వాస  వేడిమి ఇంకా ఆరిపొలేదు.  


ఎవరూ  చూడకుండా,
నీవు  నన్ను కలిసే
సంకేత స్థలాన ,నీ పాద ముద్రలు 
ఇంకా చెరిగి  పోనేలేదు. 


నువ్వు  ఏడ్చి, ఏడ్చి
నన్నేడి పించిన 
ఆ రాత్రి, నిను సాగనంపి, 
సమాదినై  ఈ స్థలాన్ని  వీడనే లేదు   



చూడు, చూడు,  నీ  హృదయంలోనే 
నీకోసం  నేను  దాగి ఉన్నాను 
నిత్య  మల్లియనై  
ఇంక ఎప్పటికీ ఎడబాటే లేదు. 












6 comments:

  1. చాలా బాగుంది అండి

    మీ కవితలకై వేచి చూసే మా మనసులు
    మీ కవితలు చదివి స్పందించే మా హృదయాలు
    మీకు ధన్యవాదములు చెప్పకుంట ఉండలేకపోతున్నాము

    ReplyDelete
  2. Mee abhimaanam sampaadinchukunnaanu adi chaalu PRINCE garu.

    ReplyDelete
  3. చాలా బాగుంది ఫాతిమా గారు.మనసు కదిలించింది.

    ReplyDelete
    Replies
    1. మెచ్హిన మిత్రులు,యుహాంత్ ,అహమద్ గార్లకు ధన్యవాదాలు.

      Delete
  4. .జ్ఞాపకం ఒక్కొసారి వేదన కలిగిస్తుంది, మరో సారి విచ్చుకునే ముళ్ళవుతుంది" మీ కవిత చదివాక ఎందుకో హృదయం భారంగా మారింది.

    ReplyDelete