Pages

Sunday 20 October 2013

మూగ(వేదన) రోదన .




   మూగ(వేదన) రోదన . 

   మరణించిన మూగ జీవుల 
   మరణ వాగ్మూలం  సాక్షిగా. 
   నెత్తురోడుతున్న,
   రహదారుల  సాక్షిగా. 

   ముక్కలై చెల్లాచెదురైన,
   దేహ శకలాల సాక్షిగా. 

   మత్తులో జోగుతూ  నడిపిన  కారు 
   కింద నలిగి  చిద్రమైన  
   దేహ చిద్రాల సాక్షిగా. 

   ఆకలి పేగులను చల్లబరిచేందుకు 
   రోడ్డుపక్క కాకా హోటళ్ళ ముందు 
   కాట్లాడుకొనే కుక్కలపై 
   ఎక్కిన లారీ చక్రాల సాక్షిగా. 

   మూతి కంటిన పాలింకా ఆరలేదు 
   ముడుచుకున్న దీహమింకా సాగలేదు 
   అమ్మ ఆర్తనాదం విన్న ఆ పసికూనల సాక్షిగా. 

   పేగు పంచుకుపుట్టిన 
   వాటి బిడ్డల  పేగుల్ని
   రోడ్ దండే నికి  ఆరేసిన 
   నీ  నిర్దయకు  సాక్షిగా

   చంపటంలో నీకున్న 
   సరదాయే వేరు,
   వహ..వా నీకు  నీవెసాటి,
   నీ నిర్లక్ష్యానికి ఆ మూగ రోదనే సాక్షి. 



   కళ్ళు కానరాకుండా  కారు నడుపుతావ్,
   ఒక్క సారి వాటి కళ్ళలోకి చూడగలవా... 
   అక్కడి ప్రశ్నలకు జవాబివ్వగలవా..? 

9 comments:

  1. మరణించిన మూగ జీవుల మరణ వాగ్మూలం అది
    నెత్తురోడుతూ, ముక్కలై చెల్లాచెదురైన, దేహ శకలాల రహదారుల సాక్ష్యం అది
    పేగు పంచుకు పుట్టిన బిడ్డల పేగుల్ని రోడ్ దండే నికి ఆరేసిన నీ నిర్దయను, కళ్ళు కానరాని నీ కారు నడకను ప్రశ్నిస్తున్న మాతృ హృదయాల ప్రశ్నలివి .... ఒక్క సారి వాటి కళ్ళలోకి చూసి, బదులివ్వు .... వాటి ప్రశ్నలకు జవాబివ్వు....? ఆ మూగ రోదనలను చల్లార్చగలవా .... నీవు?
    సమాధానాలు లేని ప్రశ్నలు. ప్రభుత్వం రహదారి యాక్సిడెంట్స్ లో కుక్కల మరణాన్ని నేరంగా తీసుకోవడం లేదు. కనుక ఈ నేరాలకు కొంతవరకూ ప్రభుత్వమూ బాధ్యత వహించాలి.
    ఒక సామాజిక అవసరాన్ని గుర్తుచేసినందుకు అభినందనలు ఫాతిమా గారు.

    ReplyDelete
  2. మత్తులో మూగ జీవులనే కాదు మనుషులనూ పట్టుకుపోతున్న కార్లు, కాలం, ఏమో ఏమవునో దేశం

    ReplyDelete
  3. ఫోటో, మీ వాక్యాలు మూగ వ్యధాభరితం

    ReplyDelete
  4. అటువంటి దౄశ్యాలు కనిపించినప్పుడు, అయ్యో పాపం కదా అనుకుంటాము
    మా లాంటి వాళ్ళం.
    మరి మీరు స్పందించి ఎందరి హౄదయాలనో కదిలించే కవిత రాసారు.
    కరుణ రస పూరితమైన కవిత.

    ReplyDelete
    Replies
    1. ఇలాంటి భావాలకు విలువనిచ్చిన మీరు సున్నిత హృదయులని తెలుస్తుంది.

      Delete
  5. స్పందించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

    ReplyDelete