Pages

Thursday 5 December 2013

కొన్ని సందర్బాలు

     





     కొన్ని  సందర్బాలు 


     బ్రతుకు  పోరాటములో..., 
     ముక్కలైన  చీకటి ప్రతిమలెన్నో. 

     విశ్వామిత్రుల  విశ్వ సృష్టిలో..,

     వెలుగుచూసిన వీరోచితాలెన్నో. 

     గంజాయి వన దహనాన..,  

     కాలిపోయే గంధపు చెక్కలెన్నో. 

     అదికార  దాహానికి  బలవుతున్న..,

     గొంతు  పెగలని  పెనుకేకలెన్నో. 

     పవిత్ర  కుటుంబాలను  వీధికి లాగితే..,

     వెలువడే శాపనార్దాలెన్నో.

     బతుకు  బాగాహారాల  భోగాతాల్లో...,

     చేయికలిపే  అదృశ్య  హస్తాలెన్నో. 

     మారణహోమాల  మరణ  శాసనాలపై...,

     రంగులు మారిన జెండాలెన్నో.

     అర్దాంతర  మరణాల శవయాత్రలో..,
     నెత్తుటి  జ్ఞాపకాలెన్నో. 




10 comments:

  1. బ్రతుకు పోరాటం లో, ఆ త్రిశంఖువులో కాలిపోయే గంధపు చెక్కలెన్నో! దురహంకారుల అదికారదాహానికి బలైన పెనుకేకలు, అక్కడక్కడా ప్రాతివత్య శాపనార్దాలు. బ్రతుకు బాగాహారాల భోగాతాల్లో..., చేయికలిపే అదృశ్య హస్తాలు, మారణహోమాల మరణ శాసనాలపై..., రంగులు మారిన జెండాలు ఎన్నో .... అర్దాంతర మరణాల శవయాత్రలో నెత్తుటి జ్ఞాపకాలుగ
    కొన్ని కొన్ని సందర్బాల్లో
    నిజమే! కొన్ని కొన్ని సమీకరణాలు అంతే! ఊహించని విధంగా ఏర్పడి ఎందరి బ్రతుకుల మీదో ప్రభావాన్ని చూపిస్తాయి. .... ఇది మనం చూస్తున్న నేడు జరుగుతున్న నిజం!
    సూటిగా వాస్తవానికి అక్షర రూపాన్నిచ్చిన మీ కవితా యానానికి అభివందనాలు మెరాజ్ గారు!

    ReplyDelete
    Replies
    1. ఎన్నో సంఘటనలు జీవితాలను తారుమారు చేస్త్తున్నాయి,
      వాటిలొ ఇవి కొన్నే.
      మీ స్పందన స్పూర్తిదాయం

      Delete
  2. మీరజ్ గారి " కొన్ని సందర్భాలు " లో వాస్తవాలెన్నో ........ !కవిత చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. దేవిగారి, వ్యాఖ్యలో అభిమానమెంతో...
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete

  3. కాల చక్రం లో,
    పోరాటాలూ,
    ప్రమాదాలూ ,
    ప్రళయాలూ ,
    హింసలూ ,
    మోసాలూ,
    విషాదాలూ ,
    మరణాలూ ,
    మారణ హోమాలూ,
    శ తృ త్వాలూ ,
    స్నేహాలూ ,
    అందాలూ ,
    ఆనందాలూ,
    ప్రమోదాలూ,
    వినోదాలూ !
    మానవ 'ముద్ర' లు,అనేకం !
    ఏ ముద్రలు చెరప గలమో ,
    ఏ ముద్రలు వేయ గలమో ,
    తెలుసు కోగలగడమే, వివేకం !




    ReplyDelete
    Replies
    1. నిజమే.. జీవితములో ఇవన్నీ ఎదురయ్యేవే.. కానీ
      కొన్ని సమయాలలో వివేకం నశిస్తుంది అప్పుడు పడిన ముద్రల గుర్తులు చెరుపుకోవటముతోనే జీవితం సగం అయిపోతుంది.
      (డాక్టర్ గారి ప్రిష్కిప్షన్ లో అన్నీ జబ్బులకీ ఒకే మందు "వివేకం " ఉంది.:-)) )
      సర్, మీ స్పందనకు నా ధన్యవాదాలు.

      Delete
  4. అష్ట పది అనొచ్చా దీన్ని?
    బాగుంది.
    కొన్ని పాజిటివ్, కొన్ని నెగటివ్
    వెరసి జీవితం.
    భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
    బాగుంది.

    ReplyDelete
  5. అవును, అష్టపదులే... వాటిలో కొన్ని " కష్టపదులు ", కొన్ని "నష్టపదులు".
    వెరసి దుష్టపదులు.:-)
    ధన్యవాదాలు సర్, నా భావాలు నచ్చినందుకు.

    ReplyDelete
  6. ఇక్కడ ఈ లైన్లు చదువుతుంటే... దాశరథి కృష్ణమాచార్య గీతంలోని చరణాలు గుర్తుకొస్తున్నాయి.
    భూగోళం పుట్టుకకోసం... రాలిన సురగోళాలెన్నో
    ఈ మానవ రూపం కోసం... జరిగిన పరిణామాలెన్నో
    ఒక రాజును గెలిపించుటలో... ఒరిగిన నరకంఠాలెన్నో
    కులమతాల సుడిగుండాలకు... బలిఅయిన పవిత్రులెందరో
    ‘‘ఆ చల్లని సముద్ర గర్భం‘‘- గీతం మీరు వినే ఉంటారు. బాగుందండి!

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారూ, ఓ మహా కవిగారితో నా కవిత్వాన్ని పోల్చారు ధన్యురాలిని.
      మీ స్పందన నాకెంతో స్పూర్తినిచ్చింది, ధన్యవాదాలు.

      Delete