Pages

Wednesday 5 February 2014

ఎలా...?

     


    ఎలా...?

     కళ్ళుమూసుకున్నా..కనిపిస్తున్నాయి. 
     చెవులు మూసుకున్న..  వినిపిస్తున్నాయి. 

     ఊరు వదిలేసినా..  వెంటాడుతున్నాయి. 
     ఊరుకుందామన్నా.. కదిలిస్తున్నాయి. 

     రాత్రంతా  వేటాడిన  పులిపంజాలు  సిరామరకలై, 
     పొద్దున్నే కళ్ళల్లో వార్తలై  గుచ్చుకుంటున్నాయి .

     హెడ్డింగులన్నీ..కదం తొక్కే సివంగుల్లా  ఉన్నాయి.  
     కర్తవ్యాన్ని  గుర్తుచేస్తూ...కవాతు చేస్తున్నాయి,

     పట్టించుకోకుండా  పేపరు గిరాటేద్దామంటే..,
     కర్తవ్యం  గుర్తుచేసే కొలువు  ఒప్పుకోనంది . 

     నా  బడి గుడిలో  కొలువైన  పసి దేవుళ్ళు,
     ఆత్మ స్తైర్యాన్నిచ్చే.. హారతి కోసం ఎదురుచూస్తూ....,

     మనిషిగా బ్రతికే వరాన్నిస్తూ...,
     మానవత్వాన్ని ప్రసాదిస్తూ...,  








10 comments:

  1. నా బడి గుడిలో కొలువైన పసి దేవుళ్ళు,
    ఆత్మ స్తైర్యాన్నిచ్చే.. హారతి కోసం ఎదురుచూస్తూ....,
    మీ ఉద్దేశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి మీరజ్ . పిక్ ఎవరిది?చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. దేవీ,మీ స్పందనకు చాలా సంతొషంగా ఉంది.
      నా భావాలను పంచుకొనే నెచ్చలి దొరికినందుకు ఆనందంగా ఉంది.(పిక్ గూగుల్ అమ్మాయి)

      Delete
  2. కొన్ని నిజాలు కొన్ని క్రూరకృత్యాల గతం .... కళ్ళుమూసుకున్నా కనిపిస్తూ, చెవులు మూసుకున్న వినిపిస్తూ, నీడలా వెంటాడుతూ ఆవేశం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా .... పసి హృదయాలు కొన్ని, ఆత్మ స్తైర్యాన్నిస్తూ ..., మనిషిగా బ్రతికే వరాన్నిస్తూ..., మానవత్వాన్ని ప్రసాదిస్తూ...,
    ఒక చక్కని భావన, జీవితావిష్కరణ కవితై
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. సర్, నా ప్రతి కవిత వెనుకా మీ ప్రోత్సాహం ఉంటుంది,
      నా ప్రతి ఆలోచన వెనుకా మీ సమర్దింపూ ఉంటుంది.
      నా కవితల్లో తప్పులుంటే నిర్మొహమాటంగా చెప్పండి

      Delete
  3. బాగుందండీ ..బాగా రాసారు ! బడి గుడి లో కొలువైన పసి దేవుళ్ళు , చాలా బాగుంది

    ReplyDelete
    Replies
    1. వంశీగారూ, నా బ్లాగ్ కి స్వాగతం,
      మెచ్చిన మీకు నా ధన్యవాదాలు.

      Delete
  4. ఫాతిమా జీ - మీ కలం ఎప్పుడూ కొత్త దానాన్ని వెదుకుతూనే ఉంటుందని నా మనస్సు చెబుతూంది !
    "నా బడి గుడిలో కొలువైన పసి దేవుళ్ళు,
    ఆత్మ స్తైర్యాన్నిచ్చే.. హారతి కోసం ఎదురుచూస్తూ....,"

    ఎంత భావుకత మీ ఈ పలుకుల్లో. చూడలేనివి ఎన్నో చూస్తున్నట్లుగా తోస్తుంది మీ భావాలను ఆకళింపు చేసుకుంటుంటే. 'భేష్' అనేంత వరకు ఎదగలేదు కాని - మంచి కవితను అందించి నందుకు అభినదనలు.
    -శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీ్పాద గారూ, మీరిచ్చే అభిమాన వ్యాఖ్యలు నన్ను ముందుకు నడిపిస్తాయి.
      నిజమే నా కలం కొత్తదన్నాన్ని వెతుకుతుంది, ఎన్నో సమస్యలు, కలతలూ, కన్నీళ్ళూ కురిపిస్తుంది.

      Delete
  5. పట్టించుకోకుండా పేపరు గిరాటేద్దామంటే..,
    కర్తవ్యం గుర్తుచేసే కొలువు ఒప్పుకోనంది . కర్తవ్యాన్ని మీరెంత బాధ్యతగా తీసుకున్నరో అర్ధమవుతోంది.

    ReplyDelete
    Replies
    1. హిమజ గారూ, నా రాతలను కొంతైనా చేతలు చేయాలని చూస్తాను నేను.
      మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete