Pages

Friday, 7 March 2014

రక్తాక్షరాలతో...,

   రక్తాక్షరాలతో...,

    కళ్ళు మూసుకున్నా..,కనిపిస్తూ ,
    కళ్ళు తెరిస్తే ...వికటిస్తూ ,
    ఎన్నో చేదు భయాలు ఎదురవుతూ, 

    దారి పొడవునా...ఇకిలిస్తూ,
    ఒళ్ళంతా చూపులతో... తడిమేస్తూ,
    ఎన్నో లైంగిక వేదింపులు వెన్నాడుతూ,

    మొగ్గలనైనా....  చిదిమేస్తూ,
    తోడేళ్ళై... వెంటాడుతూ,
    ఎన్నో మలపుల్లో...  కాటేస్తూ,

    గుండెపగిలినా...,కడుపు మండినా ,
    నిప్పుతాళ్ళకు  బందీలై.... మాడిపోతూ,
    గాయపడిన.... గేయాలవుతూ,

    అత్యాచారాలకు,అవమానాలకు,
    అడుగడుగునా  ఆడతనం గాయపడితే,

    వికసించని మొగ్గలు సైతం,
    కసుక్కున కుత్తుకలు తెగి నేలరాలుతుంటే, 

    జీవించటానికి మాకు హక్కులేదా?
    అని ప్రశ్నించే  ఎందరో  వంచిత సోదరీమణుల చెక్కిళపై జారే,
    కన్నీటి బొట్టు   తుడవలేని  అసమర్దతతో..,
    సానుభూతి ప్రకటించి వారి ఆత్మ శాంతికై, 
    ఈ రక్తాక్షరాలతో  మోకరిల్లుతున్నాను.    
    (మూర్చరోగి మెడలోమాదిరిగా 
     ఈ "Happy woman's day" ఇనుప బిళ్ళ మా మెడలో వేయొద్దు) 

  

11 comments:

 1. అన్నీ విషాదాలే .... ఎన్నో చేదు భయాలు .... దారి పొడవునా .... చూపులతో... తడిమేస్తూ, వెన్నాడే లైంగిక వేదింపులు, .... మొగ్గగానే చిదిమేసి, .... వెంటాడి, .... కాటేస్తూ,
  పరిణామం
  గుండెపగిలి....,కడుపు మండి, బందీలై .... మాడి, గాయపడి .... కుత్తుకలు తెగి నేలరాలే జీవితాలు
  జీవించటానికి .... హక్కులేదా? అన్న ప్రశ్నల్లా .... వంచిత సోదరీమణుల చెక్కిళపై జారే, కన్నీటి బొట్టు తుడవలేని అసమర్దతతో.., వారి ఆత్మ శాంతికే, ఈ రక్తాక్షరాలు
  అర్ధవంతమైన ఆవేశాన్ని మార్పును ఆశించే మనస్థితిని చూస్తున్నాను.
  అశృవుల స్థానే చిరునవ్వుల్ని ఆకాంక్షిస్తూ,
  మహిళా దినోత్సవ శుభ సందర్భం గా .... శుభాకాంక్షలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

  ReplyDelete
  Replies
  1. సర్, నా ఆవేశం అర్దవంతం అన్నారు అంతే చాలు,
   ధన్యవాదాలు మీకు మరొసారి.

   Delete
 2. మహిళాదినోత్సవం నిజానికి ఆడవాళ్ళూ మనుష్యులే,వారికీ కొన్ని ఇష్టాఇష్టాలు ఉంటాయి ,వారిని మాటలతోనో...చూపులతోనో...చేష్టలతోనో...అసమానతతోనో...కిరోసిన్ తోనో...అగ్గిపుల్లతోనో...పెట్రోల్ తోనో...యాసిడ్ తోనో...కత్తులతోనో...ఉన్మాదంతోనో...హింసించనినాడే జరుపుకోవాలి...ఇలాగయితే మనం అసలు జరుపుకుంటామని నాకు నమ్మకం లేదు మీరజ్ ,ఎందుకంటే మంచి అనేది ఎవరికీ నచ్చదు కాబట్టి.

  ReplyDelete
  Replies
  1. దేవీ,చూసే చూపులోనే బేధం ఉంటుంది, మనకు ఈ జన్మకు మహిళాదినోత్సవం రాదు.
   ఆశిద్దాం ఎదురుచూద్దాం.
   మీ స్పందంకు నా ధన్యవాదాలు.

   Delete
 3. సృష్టిలో స్త్రీకే ఎందుకిన్ని ఆవేధనలు ?
  జన్మనిచ్చిన మాతృమూర్తి ఎంతో గొప్పది కదా ! మరి ఏమిటీ వైపరీత్యం.
  మహిళా దినోత్సవం నాడు చదివాను - కళ్ళు చెమ్మగిల్లాయి .

  "గుండెపగిలినా...,కడుపు మండినా ,
  నిప్పుతాళ్ళకు బందీలై.... మాడిపోతూ,
  గాయపడిన.... గేయాలవుతూ,"

  ఇంత గొప్పగా మీ కలం నుండి జాలువారిన మీ ఆవేదనా భావాలు అమూల్యం.
  సమాజంలోని కొంత మందైనా అవగాన చేసుకో గలిగితే ఆరోజు సుదినమే.
  *** శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనను స్పూర్తిగా భావిస్తాను నేను,
   నా కవితలను ప్రొత్సహించే మీకు నా ధన్యవాదాలు శ్రీపాద గారు.

   Delete
 4. Akshara Jyothi8 March 2014 at 18:51

  మేడం,మీ కవితలు ఆవేశంగా ఉంటాయి, అప్పుడప్పుడూ నవ్వించండి.

  ReplyDelete
  Replies
  1. అక్షర గారూ, నా బ్లాగ్ కి స్వాగతం
   నవ్విద్దామనే ఉంది నాకు కూడా,
   కానీ నా కలం వినటం లేదు,
   మీ కోసం ప్రయత్నిస్తాను:-))

   Delete
 5. chaalaa baagundi madam

  ReplyDelete
  Replies
  1. లక్మీ, చాలా సంతొషం,మీ స్పందనకు.

   Delete
  2. లక్మీ, చాలా సంతొషం,మీ స్పందనకు.

   Delete