Pages

Sunday, 2 March 2014

నిదురపోని గాయం

    
   నిదురపోని  గాయం 

    చికిత్సకు  నోచుకోని  గాయం,
    శరీరాన్ని తొల్చుకుంటూ గుండెను తాకిన గేయం. 

    చిగురించాలని  ఏ మోడుకుండదూ..,

    వసంతాన్ని హత్తుకోవాలని  ఏ పువ్వుకుండదూ..,

    కరకు  చెరలను  చేదించే కరవాలమై,

    కన్నీటి  కడలిని  దాటిన  తీరమై,

    కంటి నుండి  దాటిపోయిన  సుదూర చిత్రమై,

    అపాయమనే  బరిణలో ఆరుద్ర పురుగై,

    కళ్ళుమూసుకొని  కలలు కలబోసుకుంటే,

    హృదయంలో  ఊడలై   పాతుకున్న జ్ఞాపకాలు. 

    ఉర్రూతలూపే   ఉదయ  కిరణాలూ,

    దు:ఖాన్ని  చుట్టుకుపోయే  సాయంసంద్యలూ,

    హృదయంలో అక్షర  గాయాన్ని రేపి,

    వెంటాడే  స్వప్నమై నిదురను ఖూనీ  చేస్తే..,

    పంజరం లో దేహాన్ని వదలి,

    మనస్సుకు రెక్కలు కట్టుకొని  విహరిస్తూ.... ,

    (ఎందుకో ఈ అనుబంధాలూ,ఎందుకో ఈ అభిమానాలూ... ,
    ఎక్కడ ఉన్నా... , ఏమైనా...సుఖమే కోరుకొనే దీవెనలూ....,
    మృత్యువులోకి జారిపోతూ ఒకరూ.... ,
    దు:ఖంలోమునిగిపోతూ మరొకరూ...,
    మానని గాయాలకు మమతల మందుకై  తపిస్తూ..., )


  

14 comments:

 1. చిగురించాలని ఏ మోడుకుండదూ..,
  వసంతాన్ని హత్తుకోవాలని ఏ పువ్వుకుండదూ..,avunu.prathee manishi manasulo unde korika..
  chaalaa baagundi fathima gaaroo..

  ReplyDelete
  Replies
  1. కార్తిక్ గారూ, ధన్యవాదాలు.

   Delete
 2. ప్రేమలూ, అనురాగాలూ ,
  మమతలూ , మానవతలూ,
  అనుభూతులూ , ఆనందాలూ,
  అనుబంధాలూ , ఆత్మీయతలూ ,
  సహజం , మానవులం కాబట్టే !
  హృదయం రాయైతే , అవి లేనట్టే !

  ReplyDelete
  Replies
  1. హృదయం రాయి కాకూడదనే ఈ అక్షరాలతో వైద్యం.
   ధన్యవాదాలు సర్.

   Delete
 3. ఎందుకో ఈ అనుబంధాలూ,ఎందుకో ఈ అభిమానాలూ.
  ఎక్కడ ఉన్నా. ఏమైనా సుఖమే కోరుకొనే దీవెనలూ
  మృత్యువులోకి జారిపోతూ ఒకరూ
  దు:ఖంలోమునిగిపోతూ మరొకరూ
  మానని గాయాలకు మమతల మందుకై తపిస్తూ..., మనసు కదిలించేల వుంది.ఫాతిమాగారు.

  ReplyDelete
  Replies
  1. హిమజా,మనస్సును కదిలించేదే.... సాహిత్యం,
   మీ ప్రశంస నాకు బలం. ధన్యవాదాలు.

   Delete
 4. అనుబంధం,ఆత్మీయత అంతా ఒక భూటకం
  ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం
  వింత నాటకం.......కవులు అంతా విశ్లేషించి
  రాస్తారు కనుకనే ఆనాడే రాసేసారు ఇలా.
  మీరజ్ కొన్ని గాయాలకు మందులుండవు
  కాబట్టి అవి( మానవు) నిదుర పోవు,మనల్ని నిదుర పోనివ్వవు.

  ReplyDelete
  Replies
  1. నిజమే,అక్షర గంధం రాద్దాం.

   Delete
 5. చివరి రెండు లైన్లు హృద్యంగా ఉన్నాయి.. మెరాజ్ గారు. కలంతో రాశారా... కన్నీటితో రాశారా. జ్ఞాపకాలు ఎంత మంచివో అంతే చెడ్డవండి. ఇలా అక్షరాలతో బయటపడుతుంటాయి గానీ.. లేకుంటే... పిడిబాకులై గుచ్చినచోటే పదే పదే గుచ్చుతూ.. చిత్రవధ చేస్తుంటాయి. యదార్ధంగా ఉంది మీ భావన...

  ReplyDelete
  Replies
  1. సతీష్ గారూ, మీ స్పందనకు నా హృదయపూర్వక వందనాలు.

   Delete
 6. మెరాజ్ ఫాతిమా గారూ, చాలా మంచిగ రాసిన్రు.

  ReplyDelete
 7. "కరకు చెరలను చేదించే కరవాలమై,
  కన్నీటి కడలిని దాటిన తీరమై,"

  ..... అర్ధవంత మైన మాటలివి.
  మీ ప్రతి కవితా ఏదో ఒక నూతనత్వాన్ని అందిస్తుంది .
  అందుకే మీ కవితలంటే చాలా ఇష్టం . ఇలాగే కొనసాగనీయండి ఫాతిమా గారూ .
  *** శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానానికి మరోమారు ధన్యవాదాలు.

   Delete