నిదురపోని గాయం
చికిత్సకు నోచుకోని గాయం,
శరీరాన్ని తొల్చుకుంటూ గుండెను తాకిన గేయం.
చిగురించాలని ఏ మోడుకుండదూ..,
వసంతాన్ని హత్తుకోవాలని ఏ పువ్వుకుండదూ..,
కరకు చెరలను చేదించే కరవాలమై,
కన్నీటి కడలిని దాటిన తీరమై,
కంటి నుండి దాటిపోయిన సుదూర చిత్రమై,
అపాయమనే బరిణలో ఆరుద్ర పురుగై,
కళ్ళుమూసుకొని కలలు కలబోసుకుంటే,
హృదయంలో ఊడలై పాతుకున్న జ్ఞాపకాలు.
ఉర్రూతలూపే ఉదయ కిరణాలూ,
దు:ఖాన్ని చుట్టుకుపోయే సాయంసంద్యలూ,
హృదయంలో అక్షర గాయాన్ని రేపి,
వెంటాడే స్వప్నమై నిదురను ఖూనీ చేస్తే..,
పంజరం లో దేహాన్ని వదలి,
మనస్సుకు రెక్కలు కట్టుకొని విహరిస్తూ.... ,
(ఎందుకో ఈ అనుబంధాలూ,ఎందుకో ఈ అభిమానాలూ... ,
ఎక్కడ ఉన్నా... , ఏమైనా...సుఖమే కోరుకొనే దీవెనలూ....,
మృత్యువులోకి జారిపోతూ ఒకరూ.... ,
దు:ఖంలోమునిగిపోతూ మరొకరూ...,
మానని గాయాలకు మమతల మందుకై తపిస్తూ..., )
చిగురించాలని ఏ మోడుకుండదూ..,
ReplyDeleteవసంతాన్ని హత్తుకోవాలని ఏ పువ్వుకుండదూ..,avunu.prathee manishi manasulo unde korika..
chaalaa baagundi fathima gaaroo..
కార్తిక్ గారూ, ధన్యవాదాలు.
Deleteప్రేమలూ, అనురాగాలూ ,
ReplyDeleteమమతలూ , మానవతలూ,
అనుభూతులూ , ఆనందాలూ,
అనుబంధాలూ , ఆత్మీయతలూ ,
సహజం , మానవులం కాబట్టే !
హృదయం రాయైతే , అవి లేనట్టే !
హృదయం రాయి కాకూడదనే ఈ అక్షరాలతో వైద్యం.
Deleteధన్యవాదాలు సర్.
ఎందుకో ఈ అనుబంధాలూ,ఎందుకో ఈ అభిమానాలూ.
ReplyDeleteఎక్కడ ఉన్నా. ఏమైనా సుఖమే కోరుకొనే దీవెనలూ
మృత్యువులోకి జారిపోతూ ఒకరూ
దు:ఖంలోమునిగిపోతూ మరొకరూ
మానని గాయాలకు మమతల మందుకై తపిస్తూ..., మనసు కదిలించేల వుంది.ఫాతిమాగారు.
హిమజా,మనస్సును కదిలించేదే.... సాహిత్యం,
Deleteమీ ప్రశంస నాకు బలం. ధన్యవాదాలు.
అనుబంధం,ఆత్మీయత అంతా ఒక భూటకం
ReplyDeleteఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం
వింత నాటకం.......కవులు అంతా విశ్లేషించి
రాస్తారు కనుకనే ఆనాడే రాసేసారు ఇలా.
మీరజ్ కొన్ని గాయాలకు మందులుండవు
కాబట్టి అవి( మానవు) నిదుర పోవు,మనల్ని నిదుర పోనివ్వవు.
నిజమే,అక్షర గంధం రాద్దాం.
Deleteచివరి రెండు లైన్లు హృద్యంగా ఉన్నాయి.. మెరాజ్ గారు. కలంతో రాశారా... కన్నీటితో రాశారా. జ్ఞాపకాలు ఎంత మంచివో అంతే చెడ్డవండి. ఇలా అక్షరాలతో బయటపడుతుంటాయి గానీ.. లేకుంటే... పిడిబాకులై గుచ్చినచోటే పదే పదే గుచ్చుతూ.. చిత్రవధ చేస్తుంటాయి. యదార్ధంగా ఉంది మీ భావన...
ReplyDeleteసతీష్ గారూ, మీ స్పందనకు నా హృదయపూర్వక వందనాలు.
Deleteమెరాజ్ ఫాతిమా గారూ, చాలా మంచిగ రాసిన్రు.
ReplyDeleteషుక్రియా..,
Delete"కరకు చెరలను చేదించే కరవాలమై,
ReplyDeleteకన్నీటి కడలిని దాటిన తీరమై,"
..... అర్ధవంత మైన మాటలివి.
మీ ప్రతి కవితా ఏదో ఒక నూతనత్వాన్ని అందిస్తుంది .
అందుకే మీ కవితలంటే చాలా ఇష్టం . ఇలాగే కొనసాగనీయండి ఫాతిమా గారూ .
*** శ్రీపాద
మీ అభిమానానికి మరోమారు ధన్యవాదాలు.
Delete