Pages

Friday 29 August 2014

నీడనిచ్చిన నా చెలి



    


   నీడనిచ్చిన  నా చెలి 

   
    


   అను నిత్యం  నన్ను వెన్నంటి ఉండే నా చెలి 
    హటాత్తుగా అదృశ్యమైంది. 

    తన  అంతరంగ  బందీఖానా  నుండి

    నన్ను విముక్తుణ్ణి  చేసింది. 

    తన మాటల  స్పర్శతో  లాలిస్తూ,

    నా  అనాలోచిత పలుకులనే 
    అమృతగుళికలుగా,
    స్వీకరించేది. 

    అడుగడుగునా  అక్షర సుగంధమై,

    భావ సోపానమై నా పాదాల కింద,
    తన  అరచేతులుంచేది. 

    తనో   అనుభవ వటవృక్షమైననూ ,

    నా ముందు నేల తంగేడులా,
    తలవంచేది . 

    ఎన్నోసార్లు  అనుకోని ఒప్పందాలూ ,

    మరెన్నోసార్లు నిశ్శబ్ద  సంకేతాలూ,
    పలితంగా..,కమ్ముకొనే కారుమేఘాలూ . 

    నా చుట్టూ  ఆమె కట్టే సాలీడు దారాలను సైతం,

    భరించలేని సున్నితుడనై ,
    భావోద్రేకుడనై ...,
    మన:చంచిలుతుడనై ,
    మౌనరోదితుడనై,..హోరెత్తే కడలి తరంగాన్నై,
    ఆమె కాలికింది భూమిని లాగేసుకున్నాను. 

    ఆ సమయాన  అలిగిన నా అభిసారిక,

    నన్ను  పరాదీనుని చేసి ,
    పయనమై  సాగిపోయింది. 
    అర్దంలేని అపోహలతో, అపార్దాలతో,
    అదృశ్యమై  పోయింది. 
    ఆమె నీడ మాత్రమే నాకు మిగిలింది.  
  


   

13 comments:

  1. కనుక ప్రేయసిని అతి సున్నితంగా ట్యాకిల్ చెయ్యాలని అర్ధం చేసుకోవటం ఎంతైనా మగ మహారాజులకు అవసరం అని చెప్పకనే చెప్పారు .

    నైస్ .

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పారూ అంటే అంతే మరి :-)

      Delete
  2. Ending chaalaa baagundi akka:):)

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ కార్తిక్

      Delete
  3. అడుగడుగునా అక్షర సుగంధమై,
    భావ సోపానమై నా పాదాల కింద,
    తన అరచేతులుంచేది. చాలా బాగారాశారండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మా.

      Delete
  4. ఫాతిమాగారు,
    ------నా చుట్టూ ఆమె కట్టే సాలీడు దారాలను సైతం,
    భరించలేని సున్నితుడనై ,
    భావోద్రేకుడనై ...,
    మన:చంచిలుతుడనై ,
    మౌనరోదితుడనై,..హోరెత్తే కడలి తరంగాన్నై,
    ఆమె కాలికింది భూమిని లాగేసుకున్నాను. -----

    "ఉద్వేగమంతా అక్షరాలలో గుమ్మరించేశారు, భావాలు కవితలుగా మారి అల్లుకుంటున్నాయి."

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ స్పందనకు

      Delete
  5. నాకు ఆమె గుర్తుకొచ్చింది...మేడం. కవిత చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ఆమె గుర్తుకు రావాలనే రాసింది అహ్మద్ గారూ.:-)

      Delete
  6. ఆ సమయాన అలిగిన నా అభిసారిక,
    నన్ను పరాదీనుని చేసి ,
    పయనమై సాగిపోయింది.
    అర్దంలేని అపోహలతో, అపార్దాలతో,
    అదృశ్యమై పోయింది.
    ఆమె నీడ మాత్రమే నాకు మిగిలింది.

    అద్భుతంగా ఉంది!

    ReplyDelete
    Replies
    1. మెచ్చిన మీకు నా ధన్యవాదాలు సర్.

      Delete