Pages

Thursday 7 August 2014

చలన శిల.








  
    చలన శిల. 

   ఒక  స్వప్నం  ఊపిరి సలపక 

   సతాయిస్తుంది. 
   చిరునవ్వుకూ,కన్నీళ్లకూ ,
   సమన్వయం  కుదర్చలేకుంది. 

   అసమాన  అభిమానాన్ని,

   మది  మోయలేకుంది. 
   స్పందనకై..క్షణ ,క్షణమూ  
   ప్రాణాన్ని వెతుకుతుంది  

   నిద్రరాని అశాంతి రాత్రుల్లో,

   చలన రహిత  తలపులను,
   తలనుండి  మరల,మరలా,
   తోడి పోసుకుంటుంది. 

   పలాయనమయ్యే ఆత్మ బంధాలను,

   పలకరించి,పలవరించి,
   నిరసన రుచి చూసి,
   నిస్సహాయతతో... నిదురిస్తుంది. 

   భయంతో చీకటి గదిలో 

   ముడుచుకున్న,ముఖాన్ని ,
   అరచేతుల్లో తీసుకున్న ,
   ఆత్మీయ స్పర్శ...,

   అకాల దు:ఖాన్ని పారద్రోలుతూ,

   మనో మందిరాన,
   మత్స్య యంత్రాన్ని  చేదించే,
   మహా వీరుడొస్తాడని ఎదురుచూస్తుంది..  









8 comments:

  1. చలన శిల సంచలనాన్ని కలిగిస్తొంది .

    అసమాన అభిమానాన్ని,
    మది మోయలేకుంది.
    స్పందనకై..క్షణ ,క్షణమూ
    ప్రాణాన్ని వెతుకుతుంది

    నిద్రరాని అశాంతి రాత్రుల్లో,
    చలన రహిత తలపులను,
    తలనుండి మరల,మరలా,
    తోడి పోసుకుంటుంది.

    పలాయనమయ్యే ఆత్మ బంధాలను,
    పలకరించి,పలవరించి,
    నిరసన రుచి చూసి,
    నిస్సహాయతతో నిదురలో జారుకొంటూ .

    ఒక స్వప్నం ఊపిరి సలపక
    సతాయిస్తుంది.
    చిరునవ్వుకూ,కన్నీళ్లకూ ,
    సమన్వయం కుదుర్చుకోలేక .

    భయంతో చీకటి గదిలో
    ముడుచుకున్న ముఖాన్ని ,
    అరచేతుల్లో తీసుకున్న ,
    ఆత్మీయ స్పర్శ....

    అకాల దు:ఖాన్ని పారద్రోలుతూ,
    మనో మందిరాన,
    మత్స్య యంత్రాన్ని ఛేదించే,
    మహా వీరుడి రాకతో .

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. పలాయనమయ్యే ఆత్మ బంధాలను,
    పలకరించి,పలవరించి,
    నిరసన రుచి చూసి, wonderful lines.

    ReplyDelete
    Replies
    1. పద్మా, ధన్యవాదాలు మీకు.

      Delete
  3. Replies
    1. వర్మాజి ,థాంక్స్ మీ స్పందనకు

      Delete
  4. meraj akka,nee padaala allika superb unTundi. E kavitha chaalaa chaalaa bagundi:):)

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ, థాంక్స్

      Delete