Pages

Tuesday 19 February 2013

    




      (అ )న్యాయవాది 


      జీవన పోరాటంలో,
      గెలుపు,ఓటమిలను,
      తరాజులో బేరీజు 
       వేసి చూస్తాను.

       ఏళ్ళ తరబడి,
       ఒకే కేసును, 
       వెనక్కినడిపించి,
       నేను ముందుకు నడిచాను.

       రెప్ప కాలంలో,
       కత్తులు దూసుకొనే,
       కారుడు కట్టిన ఫ్యాక్షనిస్టుల
       పక్షాన చేరి నక్కజిత్తుల నాయం 
       నడిపేవాడిని.

       కాఖీలతో  కుమ్ముక్కై ,
       కల్లలనే ఎల్లలు గా చేసుకొని,
       కథను నడిపే,
       కలహ భోజుడిని.

       తెల్ల కోటుతో కలిసి పోయి,
       శవాలకు  సైతం  
       సవాలు విసిరే,
       కలియుగ తాంత్రికుడిని  

       ఉరి వరకూ,తెచ్చిన నిర్దోషిని,
       భుజం తట్టి  తన ఆత్మకి 
       శాంతి కూరే  వరకూ 
       పోరాడతానని బల్లగుద్ది చెప్పిన 
       ల్ల గౌను న్యాయ వాడిని.

       న్యాయవాది పై నేను రాసిన ఈ కవిత ఎవరినీ ఉద్దేశించి  రాసినది కాదు. ఎవరి మనస్సునైనా నొప్పించి ఉంటె మన్నించగలరు....మెరాజ్ 

11 comments:

  1. న్యాయాన్యాయాలను బేరీజువేసారుగా....బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ, ధన్యవాదాలు.

      Delete
  2. 'ఆ న్యాయ'వాది వెన్నంటి చాటాడు 'అన్యాయం' మాదని...

    న్యాయవాది మీద బాగా హర్ట్ అయినట్టున్నారు, బాగా చెప్పారు...

    ReplyDelete
    Replies
    1. అందరూ అలా ఉంటారని కాదు, కానీ తప్పదు మదిలోని ఘర్షణ. బ్లాగ్ కు స్వాగతం విద్యాసాగర్ గారూ.

      Delete
  3. మీరూ సీరియస్సయిపోయారు, ఈ మధ్య. లోకమండీ లోకం

    ReplyDelete
    Replies
    1. సర్, వందనాలు.,యమా...సీరియస్సు అయిపోయాను చూసారా పెద్ద రైటర్ లక్షణాలు రావాలంటే ఇలాగే రాఅయాలి మరి:-)

      Delete
  4. అందరితోటే నేనూ అంటున్న సమాజం కదండీ అందుకే ఇలా (అ )న్యాయవాది కూడా ...
    మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం..
    ఎవరూ హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను..

    ReplyDelete
    Replies
    1. నిజమేనా.., యెమో రాజీ గారూ, నాకు కొంత భయం వెసింది కూడా.మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete
  5. న్యాయవాది పై నేను రాసిన ఈ కవిత ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు. ఎవరి మనస్సునైనా నొప్పించి ఉంటె మన్నించగలరు....మెరాజ్

    evverini meeru "manninchamani" adagavalasina avasaramu ledu meraj gaaru, yidi 'jagamerigina satyam' andukane lawyers tho mariyu polece latho pettukokoodadantaaru.because-lawyers are licenceated liers ani naa uddeshyam.

    ReplyDelete
  6. న్యాయవాదిని గురించి మీరు రాసింది.కరెక్ట్! న్యాయవాదంటే న్యాయాన్ని పరిరక్షించాలి.అన్యాయాన్ని కాదు.

    ReplyDelete
  7. బాగుంది ఫాతిమ గారు

    ReplyDelete