Pages

Monday 23 September 2013

నిన్ను తలచీ...నవ్వుకొంటే...





నిన్ను తలచీ...నవ్వుకొంటే...


ఎవరన్నారు
నువ్వు ఎదగలేదనీ..

ఎవరన్నారు,
కల్లాకపటం  ఎరుగని నిన్ను,
వెర్రివాడని.

ఏదీ తెలీని  పసితనం
మాయలో, మంత్రాలో  ఎరుగని
అమాయకం


చెట్టులా  ఎదిగినా,
పొత్తిళ్ళ నాటిలా,
చీరకుచ్చిళ్ళు వదలని
చిన్నతనం.

తోటి పిల్లలు తూలనాడినా,
గేలిచేసినా,
చప్పట్లు కొట్టే
స్వచ్చదనం.

మీసాలు వస్తున్నా,
ముద్దలు పెట్టమనే
మొండి తనం.

తప్పేదో, ఒప్పేదో తెలీక
ఆశలూ, ఊసులూ  అర్ధంకాని
నా వెనుక నక్కే
కుర్రతనం.

సొల్లు  కారుస్తున్నావని,
చెల్లి  విసుక్కున్నా,
మనసారా నవ్వుకొనే
మంచితనం.

రెక్కలొచ్చి అందరూ,
ఎగిరిపోయినా
అమ్మ కొంగు వదలని
ఆత్మీయం.

నీకై యోచిస్తూ
విలపించే నాకోసం
అపర  భ్రహ్మ  లా,
ఫోజిచ్చిన  అమ్మతనం.

8 comments:

  1. కల్లాకపటం ఎరుగని .... వెర్రివాడు.
    పసితనం మాయ, మంత్రాలు ఎరుగని అమాయకుడు.
    ఎదిగినా, పొత్తిళ్ళ నాటి, చీరకుచ్చిళ్ళు వదలని చిన్నవాడు. అని
    ఎవరన్నారు నువ్వు ఎదగలేదనీ....
    అమ్మలో అపర బ్రహ్మను అనురాగం ప్రేమతత్వం ను ఆవిష్కరించిన విధానం చాలా బాగుంది. మానవత్వం ను ప్రేమించే భావనల కవయిత్రి( ఫాతిమా ) గారికి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. సర్, మానవత్వాన్ని ప్రేమించే కవయత్రి అన్నారు.
      మీ ప్రశంసకు నా వందనాలు.
      ఆ మానవ్త్వమే పనికట్టుకొని మంటకలుపుతున్నారు సమాజములో కొందరు.
      వారి బారినుండి అమాయకులను రక్షించే నిమిత్తములో అక్షరాలను ఆయుదాలను చేసుకుంటున్నాను. ధన్యవాదాలు మరోమారు మీకు.

      Delete
  2. చెట్టులా ఎదిగినా,
    పొత్తిళ్ళ నాటిలా,
    చీరకుచ్చిళ్ళు వదలని
    చిన్నతనం

    ఈ వాక్యం అద్దం పట్టును
    మీ సున్నితమైన మనస్సును
    చూపెను దాగున్న మానవీయతను

    చాలా బాగుంది maadam.... big claps for your great heart and vision..

    ReplyDelete
    Replies
    1. సాగర్ గారూ,
      మానసింకంగా ఎదగలేదని మనం జాలిపడే(గేలిపడే) ఆ బిడ్డలు,
      నిర్మలంగా నవ్వుతూ మన మానవత్వానికి సవాలు విసురుతారు.
      ఓ విదంగా వారు అదృష్టవంతులు ఈ లోకం లోని కుళ్ళూ,కుతంత్రాలను ఎరుగరు.
      మీ ఆత్మీయ స్పందన కు నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

      Delete
  3. బుధ్ధి వికసించి చెడుగులై పోవు సంతు
    దలచి యేడ్వని రోజు లేదనుచు వగచు
    తల్లి కీ బిడ్డ ప్రేమ తత్త్వమ్ము పంచు
    అమ్మ మనసొక్కటే అమృతమ్ము గనుక .
    ----- సుజన-సృజన తాజా టపాలు చూడండి

    ReplyDelete
  4. Heart touching madam!!

    ReplyDelete