Pages

Monday, 9 September 2013

కలసి రండి ,

   

   

   కలసి రండి ,

    అందరూ కలసిరండి,
   గొంతుదిగని దు:ఖాన్ని,
   పంచుకుందాం రండి.


   చీకటి కోణాలనుండి,
   మురికి కూపాల నుండి,
   గాయాల గేయాలు విందాం రండి.


   లేతప్రాయపు నగ్నగుండెలపై,
   నర్తించే ఆకలి చూపుల,
   కళ్ళను పొడిచేద్దాం రండి


   రాజదాని నడిబొడ్డు మీద నర్తించే,
   లైంగిక ఆనందాన్ని,

   అందరమూ కలసి అడ్డుకుందాం రండి.


   నడిచే దారిలో నర్తించే,
   అరాచక పిశాచాలను,
   అదిలిద్దాం రండి.


   కాలు కదిపితే కక్షలే,
   కంటినుండి జారేవి లావాదారలే,
   అందుకే అక్షరిద్దాం రండి, చెడును అరికడదాం రండి.
8 comments:

 1. నిజమే! పాలకులకి ఇవి చెవిని పడవు. ప్రజలకి అంత ఓపికలేదు :)

  ReplyDelete
  Replies
  1. పాలకుల చెవిన పడినందువల్లనే ఇలాంటి క్రూరులు తప్పించుకుంటున్నారు. ప్రజల్లో మీరన్నట్లు ఓపికలేదు.

   Delete
 2. కలిసి రమ్మనే ఆ పిలుపు లో నా లాంటి ఎందరినో తట్టి లేపాలనే ఆలోచన సమాజం లో పెరుగుతున్న అరాచకాలను గమనిస్తూ పట్టనట్లుండలేని బాధ కనిపిస్తుంది. అక్షరిద్దాం రండి, చెడును అరికడదాం రండి అనే మీ నినాదానికి జోహార్లు మెరాజ్ జీ!

  ReplyDelete
  Replies
  1. మనందరం కలిసే అక్షర దుక్కి దున్నుతున్నాము. రాబోయే తరాలకు మంచి ఫలాలను ఇవ్వగలగాలి. మీ స్పందనకు ధన్యవాదాలు చద్రశేఖర్ గారు.

   Delete
 3. ఫాతిమా ,

  " లేతప్రాయపు నగ్నగుండెలపై,
  నర్తించే ఆకలి చూపుల,
  కళ్ళను పొడిచేద్దాం రండి "

  హృదయపు లోతుల్లోకి దూసుకు వెళ్ళే పద ప్రయోగం . చాలా బాగుంది .


  " నడిచే దారిలో నర్తించే,
  అరాచక పిశాచాలను,
  అదిలిద్దాం రండి. " అనటం సబబు కాదు . ఎందుకంటే అదిలిస్తే పక్కకెళ్ళే కుక్కల్లా మళ్ళీ మళ్ళి అడుగిడి తిష్ట వేసుకొని స్థిరాసనాన్ని ఏర్పఱచుకొంటాయి .

  ఇలాంటి పని ఆనాడు ( ఆ త్రేతాయుగంలో ) శ్రీరాముడు వసిష్ట మహర్షుల ఆనతితో అడవులలో అపుడప్పుడే ఆవిర్భవిస్తున్న దానవత్వాన్ని ఆ నాటి తపస్సు చేసుకొనే ఋషుల బారినుండి చంపేశారే గాని , వాళ్ళ అంశకు వారసులైన వాళ్ళ వారసులను చంపేశారే గాని ,మొదలంటా వెతికిచంపలేకపోయారు . అలా తప్పించుకుపోయిన వాళ్ళ వారసులే , మళ్ళీ బలగాన్ని పెంచుకొని , తదుపరి యుగమైన ద్వాపర యుగంలో సమాజంలోకి ( కంసుడు , శిశుపాలుడు , పూతన లాంటి వగైరా జీవుల రూపంలో ) చొఱబడ్డారు . ఆ ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు గత యుగంలోని శ్రీరామచంద్రునిలా ఎడుటపడ్డ , అందిన దానవమానవులనే చంపేశాడు .
  మనము అలా చేయకూడదు . నాడు జనాభా అంత లేదు , ఒక్క ఆ శ్రీరామచంద్రుడో / శ్రీకృష్ణుడొ ఈ దుష్ట శక్తులను ఎదుకోవాల్సి రావటంతో , ఆలోచిస్తే అది కొంచెం క్లిష్టతరమైనదే .
  నేడు అలా కాదు , జనాభా అధికం , అందఱిలో ఆ దుష్ట శక్తులను ఎదుర్కోవాలనే తపన ఎక్కువగానే వుంది . అందుకే మనం అలా మన కంటపడ్డ దుష్ట శక్తులనే కాకుండా , వెతికి మొదలంటా సంహరిస్తేనే బాగుంటుంది . కనీసం మఱలా వచ్చే తదుపరి యుగమైనా బాగుంటుంది .
  అందుకని " నడిచే దారిలో నర్తించే,
  అరాచక పిశాచాలను,
  సంహరించేద్దాం రండి. " అనటం అత్యవసరం .

  ReplyDelete
  Replies
  1. శర్మ గారూ, నిజమే మనకోసం మరోమారు యుగపురుషులు జన్మించరు, మీరన్నట్లు అదిలిస్తే మళ్ళీ వస్తాయి పిశాచాలు, ప్రస్తుతం మనప్రభుత్వం అదే చేస్తుంది, ( కేవలం అదిలిస్తుంది) అందుకే సంహరించాలి, పసి ప్రాయాన్ని పలహారంగా తీసుకుంటున్న ఈ పిశాచాలను ఎలా అరికట్టాలో తెలీటం లేదు, విద్యలో నీతి పాటాలు కనుమరుగయ్యాయి, బ్రతకటానికి పనికొచ్హే చదువులు చెప్తున్నారు కానీ ఎలా బ్రతకాలో చెప్పటం లేదు, అస్సలు యుగాలంటే ఏమిటి? అప్పటి జీవన విదానం ఎందుకు మెరుగ్గా ఉండేది? ఇప్పుడు ఏమికోల్పోతున్నాము వారికి తెలీటం లేదు. జీవన విదానమ్లో మార్పురావాలి అప్పుడే ఆలోచనల్లో మాఅర్పు వస్తుంది.

   Delete
 4. కవిత బాగుంది.
  ఇప్పటి దారుణమైన పరిస్థితుల పట్ల కలిగిన బాధాతప్త హృదదయంతో రాసినట్లు ఉంది.
  రాజదాని నడిబొడ్డు మీద నర్తించే,
  లైంగిక ఆనందాన్ని,
  అందరమూ కలసి అడ్డుకుందాం రండి.
  అయితే మీరు ఆనందం అని చెప్తున్న చోట మీ ఉద్దేశం, పైశాచికత్వమో, అకృత్యమో అయి ఉండి ఉంటుందని మీ కవిత ఆసాంతం చదివితే అనిపిస్తోంది.
  అక్కడ అటువంటి పదమేదో రాయబోయి తొందరలో ఈ మాట వాడారనుకుంటున్నా.
  ఇంతకీ మీరు వాడదలచుకున్న మాట ఏమిటో మరి!

  ReplyDelete
  Replies
  1. సర్, నిజమే అక్కడ ఆనందం అన్న పదం సరైనది కాదు, అక్కడ అకృత్యమే సరైన పదం. మీ విష్లేషణకు ధన్యవాదాలు.

   Delete