Pages

Saturday, 7 September 2013

పుస్తకం


పుస్తకం

నేను  చదివే పుస్తకం     " జీవితం "

ఇందులో ప్రతి  పేజీ  ఆసక్తికరంగానే ఉంది.

"కుటుంబం "...... కుదించ బడింది.

"అనుబంధం"...అబద్దం అయింది.

"ప్రేమ".........పాదరసంలా  జారుతుంది.

"ఆర్ధికం"......అర్బకంగా  ఉంది.

" దానం"........దారితప్పురుంది.

"ధనం ".........దొరక్కుండా ఉంది.

"ఆకలి ".........వదలకుండా ఉంది.

"రోగం".......కుంగదీస్తుంది.

"బలం ".......లొంగదీసుకొంటుంది.

"అనుమానం"........పెనుబూతమైంది.

"స్నేహం"........అదృశ్యం అవుతుంది.

"నాగరికత "..........పరిగెడుతుంది.

"సంస్కృతీ"...........వీడ్కోలు చెప్తుంది.

"కులం"...........అంటురోగంలా  ఉంది.

ఇంకా కొన్ని పేజీలు   ఉన్నాయి, చదివి చెప్తాను,

13 comments:

 1. మిగిలిన పేజీల్లో ఏముందో కనపడకుండా ఉంది.మొత్తానికి బతుకు అయోమయంగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. సర్, నిజమే కదా బ్రతుకు పుస్తకమే బరువైనది దాన్ని చదవటానికి చాలా బలం కావాలి. అర్దమయ్యీ.. కానట్లు అయోమయంగా ఉంటుంది.

   Delete
 2. chaalaabaagundi andi

  "కుటుంబం "...... కుదించ బడింది.
  "అనుబంధం"...అబద్దం అయింది.
  "బలం ".......లొంగదీసుకొంటుంది.
  "స్నేహం"........అదృశ్యం అవుతుంది.
  chaalaa beautiful gaa cheppaarandi
  ఇంకా కొన్ని పేజీలు ఉన్నాయి, చదివి చెప్తాను,

  inkaa konni pejeelunnaayaa- an excellent idea
  fatmima gaaru adhbhutam ani

  ReplyDelete
  Replies
  1. హరిగారూ, జీవిత పుస్తక పేజీలు చదివిన తర్వాత మనమేమి చేయలేమా (మీ బ్లాగ్ లా) అని ఆలోచించాల్సి వస్తుంది, మనల్ని అలా సందిగ్దమ్లో పడవేసేదే జీవితం.

   Delete
 3. జీవితమనే పుస్తకం అందరికీ పుట్టుకతోనే లభిస్తుంది వెంటనే చదవలేరు . ఆ పుస్తకం తన వద్దనే వున్నదన్న విషయం కూడా తెలియదు . తెలియటానికి సమయం అందరికీ ఒకే విధంగా వుండదు . చదవటానికి కొంత సమయం పడ్తుంది . చదవటం ఆరంభించేసరికి అనుభవాలు వేరవుతుంటాయి , ఎవరి స్వానుభవం వారిదే అవుతుంది . పుస్తకాలలో అమోఘంగా వుండే ఆ బంధాలు , అనుబంధాలు వాస్తవదూరమే . ఇవి లెక్కలు కాదు ఎవరు చేసినా ఒకటే జవాబు రావటానికి , ఎవరి జీవితం వారిదే .

  బాగా వ్రాశావు .

  రోగం కుంగదీస్తుంది ,
  బలం లొంగదీస్తుంది .

  ఇది ఈనాటి సమాజ దౌర్భాగ్యం .

  ReplyDelete
  Replies
  1. శర్మ గారూ, మీ విష్లేషణలో నేనో కొత్త పేజీ చేర్చుకున్నాను, నిజమే జీవితం లెక్కలు కావు ఒకే జవాబు రావటానికి. జీవితాన్ని చదవటానికి జీవిత కాలం సరిపోవటం లేదు, ఆకరి పేజీలు చదవకుండానే, వదిలే్స్తామేమో... మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

   Delete
 4. వెతల పుటల పఠనం ,
  తిమిరం లో పయనం ! ,
  ధనం ఇంధనం అవుతే,
  అనుబంధం, యాంత్రికం !
  జీవితం, అంధకార బంధురం !
  సొంత లాభం కొంత మానుకుంటే ,
  ధన్యులం, అందరం !
  కలిసేగా, ఒక్కో కిరణం,
  కలిగేది, కాంతి జననం !
  నీ జీవిత పుస్తకం లో ప్రతి పుటకూ,
  చేయాలి, నీవే నిర్వచనం !


  ReplyDelete
  Replies
  1. సుధాకర్ గారూ, జీవితం పై మీ నిర్వచనం నిష్పక్ష పాతంగా ఉంది, ఇలాంటి కొత్త పేజీలు చేర్చుకోవాలనే నా ప్రయత్నం. బరువైన ఈ పుస్తకం, బాల్యం నుండే మోయటం నేర్చుకుంటాము, కానీ చదివే వయస్సు వచ్హేసరికి కొన్ని పేజీలను తిరగరాస్తే బాగుండు అనిపిస్తుంది. మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 5. " జీవితం " పుస్తకం ఎంత ఆసక్తికరమో ....
  కుదించ బడిన "కుటుంబం" .... పాదరసంలా జారే "ప్రేమ" .... అస్తవ్యస్త "ఆర్ధిక స్థితి" .... దారితప్పిన "దాన గుణం" .... క్రుంగదీస్తూ "రోగాలు" .... "అనుమానం" .... పెనుబూతాలు "స్నేహరాహిత్యం" "కులం" .... అంటురోగం .... ఇలానే ఎన్నో .... చదువేకొద్దీ పేజీలు
  చదువుతూనే సాగేది జీవితం. ఎన్ని అనుభవాల్ని చదివినా తరగని గ్రందబాండాగారం జీవితం పుస్తకం.
  జీవితం లో ఎంతో అనుభవం పండిన ఆవిష్కరణ ఈ వాఖ్యాలు.
  ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు.

  ReplyDelete
  Replies
  1. చంద్రశేఖర్ గారూ, మీ అభిప్రాయం సరైనదే...ఇది ఓ అనుభవాల భాండాగారం. మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 6. మెరాజ్ గారూ జీవిత పుటలు అనుభవంతో చదివితేనే ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పటిదాకా చదివిన పుస్తకం పేజీలు అన్నీ గందరగోళంలా ఉన్నాయి. చివరి పేజీ ఎలా ఉంటుందో ఊహించటం తేలికే.
  చాలా బాగా వ్రాశారు.

  ReplyDelete
  Replies
  1. చిన్నిఆశ గారూ, చివరి పేజీ చాలా అపురూపమైనది, (వీడ్కోలు పలికేది కనుక). మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete