Pages

Wednesday 16 October 2013

నీ (ని) వాళ్ళు

  





   నీ (ని) వాళ్ళు 


   బ్రతుకంతా బంధాల చట్రములో తిరిగే...బొంగరాలు.

   ప్రేమ  కుసుమాలతో  అల్లిన హారములో దాగిన.....దారాలు.


   చిటికినవేలు  పట్టుకొని  నమ్మినదారిలో నడిచే.......బాటసారులు.


   అయినవాళ్ళను  అనునిత్యం   కాపాడాలనుకొనే......కనురెప్పలు.


   ఆశల కుటీరాలనుండి  అంభరాన్ని  అందుకొనే....మింటిదీపాలు 


   పుట్టింటీ,మెట్టింటీ కంఠాలకు  రక్షణ కల్పించే....రుద్రాక్షలు.


   నేడు....

   చీకటి గబ్బిలాల పాల్పడి  నిర్భాగ్యపు బంధీలై  ఉన్నారు,

   వరకట్న ఆకటి  కొరలలో  చిక్కి  ఉరికొయ్యకు ఊగుతున్నారు.


   కపట  ప్రేమలో  పడి  కాటికి  పయనమవుతున్నారు.


   అనుమానపు  రంపాల కొతకు  బలై ఆత్మహత్యల పాలవుతున్నారు.

   
   కదిలే శవాల్లా కాలం వెళ్ళబుచ్చుతున్నారు     
   
   అమ్మగా,ఆలిగా,చెల్లిగా,చెలిగా,తనయగా, వదినగా,ఉపాద్యాయనిగా.....

   ఏదో మలుపు వద్ద నిన్ను  మనిషిగా  చెక్కిన శిల్పులే....వీళ్ళు.


  నేడు...
   
   నిస్సహాయంగా,  ప్రతి  మలపువద్దా నీకు  దర్సనమిస్తారు,

   నిర్దయగా ఉండకు, మంచి శిల్పివై....వివేకపు  ఉలి చేత పట్టు,


   సృష్టి  కి , ప్రతి సృష్టి  అయిన  ఈ  రాతి బొమ్మలను 


   తిరిగి   నాతి బొమ్మలు   చేయి.










7 comments:

  1. ఫాతిమాజీ!
    నిప్పులు చెరిగేరు, నిజం చెప్పేరు
    మీటపా చూశాను. చాలా బాగుంది. కొన్ని మాటలను టైపు చేయడం లో పొరపాటు పడినట్టున్నారు, ప్రతి టపాలోనూ ఇది కనపడుతోంది, కొద్దిగా శ్రద్ధ చేయండి.నేటి టపాలో,
    అంభరాన్ని కాదు అంబరాన్ని
    బందీలై వున్నారు,
    ఎక్కువ చొరవ చూపానుకుంటే మన్నించండి.నా కామెంట్ పబ్లిష్ చెయ్యద్దు.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. సర్, మన్నించమనటం చాలా పెద్దమాట.
      నా అక్షరాలను సరిచేసే చనువు మీకుంది.
      ఇకపోతే, సమయం సరిపోకపోవటమూ, కొంత నిర్లక్ష్యమూ కలసి తప్పులు దొర్లటానికి దోహదపడుతున్నాయి.
      ఆవేదనా,ఆవేశమూ కలసి నిప్పురవ్వలని రువ్వు తున్నాయి.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. "బంధాల చట్రంలో బొంగరాలు, హారంలో దారాల బ్రతుకులు. కాపాడే కనురెప్పలు .... నిన్ను మనిషిగా చెక్కిన ఒక అమ్మ, ఒక ఆలి, ఒక శిల్పి, ఒక గురువే .... వీళ్ళు.
    నేడు,
    చీకటి గబ్బిలాల పాలు పడి బంధీలుగానో, ఉరికొయ్యకు ఊగుతూనో, కపట ప్రేమను నమ్మి కాటికి వెళుతునో .... కదిలే శవాల్లా కళ్ళముందు"

    అక్షరాలు ఆవేశాన్ని రగిలిస్తూ నా బాధను మనోభావన గా వ్యక్త పరచడం మినహా ఏమీ చెయ్యలేని అశక్తత. ఆలోచనలు రెకెత్తిస్తూ ఒక గొప్ప సామాజిక వచన కవిత .... _/\_లు ఫాతిమా గారు.

    ReplyDelete
    Replies
    1. సర్, సమాజాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేకపోవచ్చు ,
      ఎందుకంటే మనమూ నిర్జీవ సామాజిక నిస్సారములైన జీవులమే.
      మన మనోవేదనలకు ఇదో వేదిక. మీ స్పందన నాకు స్పూర్తిదాయకం.

      Delete
  3. బ్రతుకంతా బంధాల చట్రములో తిరిగే...బొంగరాలు.
    ప్రేమ కుసుమాలతో అల్లిన హారములో దాగిన.....దారాలు.
    చక్కని పోలిక......నచ్చిందండి

    ReplyDelete
  4. ప్రేరణా, మీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు.

    ReplyDelete