Pages

Saturday 16 November 2013

షరా... 2





షరా... 2 


  ఈ రోజెందుకో   పొద్దుటి   బెడ్ కాఫీలూ  లేవు, శ్రీమతి గారి   గాజుల గలగలలూ  వినిపించటమూ  లేదు.

వాకింగ్ నుండి వస్తూనే...  వంటింటి ఘుమ,ఘుమలను  ఓ సారి ఆస్వాదించి, స్నానానికి వెళ్ళటం  శేఖర్ కి అలవాటు కానీ, ఇల్లంతా  నిశ్శబ్దం గా  ఉంది. 

కూతురు  చిట్టి తల్లి  మాత్రం, జుట్టు విరబోసుకొని  రిబ్బన్లు  చేత బట్టుకొని ఈ భవసాగరం ఈదటం ఎలాగా  అన్నట్లు దిగాలుగా కోర్చునిఉంది. 

"ఎరా చిట్టితల్లీ, అమ్మ  జడలు వెయ్యలేదా?"  అనునయంగా అడిగాడు శేఖర్.  కోతుర్ని. 

" లేదు నాన్నా అమ్మ లేవలేదు  ". దిగులుగా జవాబిచ్చింది పాప. 
అరె,రే  అనుకొంటూ బెడ్ రూం దగ్గరికెళ్ళాడు. 

" సరూ .."  ముసుగు తన్ని పడుకున్న ఆమెని మెల్లగా లేపాడు. 

" ఊ.. ఏంటో చెప్పండీ, పొద్దున్నే బాత్ రూం  పడి  నడుం కాస్తా విరిగినట్లుంది   నేను లేవలేను, ఆ కాఫీ ఏదో మీరే పెట్టుకోండి "  
అనేసి మరికొంచం బిగుసుకు పడుకొన్నది  సరోజ.  

" అయ్యో కాఫీ కోసం కాదురా , పాప కి జడా అదీ, ఎలా.." మాట పూర్తీ కాక ముందే  దుప్పటి విసిరేసి లేచి కూర్చుని,

" ఇదిగో చూడండీ, అలవాటు లేకపోతే ఎలాగో తిప్పలు పడుతుంది,"  "నేనూ  మనిషినేగా ఎంత చాకిరీ అని చేయాలి" 
అంటూ శివాలెత్తి పోయిన్ది. 

ఏమైంది  తనకి, ఎప్పుడూ  ఇలా పడుకున్నది లేదు.  అనుకుంటూ  మెల్లగా బ్రష్  చేసుకొనేందుకు వెళ్ళాడు. 

పాపని దగ్గరికి పిలిచి  జడ వెయ్యటం మొదలు పెట్టింది. 

"ఏమి బతుకో పాపిష్టి బతుకు, ఒక అచ్చటా లేదూ  ముచ్చటా లేదూ"  ఎప్పుడూ  ఇంటి చాకిరీతోనే సరిపోయింది,"

"ఇప్పుడేమయిందే , ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా చెప్పూ  తీసుకెళ్తాను" చాలా కూల్ గా  అన్నాడు  శేఖర్,

" ఆ అదొక్కటే తక్కువ నా బతుక్కి," విసుగ్గా అంటూ పిల్ల తలలో రిబ్బను  గట్టిగా ముడిపెట్టి  పిల్లని ఒక్క తోపు తోసింది  ముందుకి. 

"ఇంతకీ ఏమంటావ్  సరూ "

" ఏమంటే  ఏముందీ, ఆరుస్తారా, తీరుస్తారా?"

"అడగవోయ్ ", నవ్వుతూ అన్నాడు  శేఖర్. 

"ఆ  మా అమ్మ అడిగి, అడిగి అలసి పోయింది, ఇక నా వంతు  కాబోలు ... " వెటకారం ధ్వనించింది  ఆమె గొంతులో. 

" ఏంటిరా అది , నాకు గుర్తు లేదు మళ్ళీ  అడుగు  తీర్చకుంటే చూడు."   అభయం  ఇచ్చే వానిలా అనేశాడు. 

" ఇదిగో కాదన కూడదు"  కొంటెగా అడిగింది. 

" అబ్బే మాట తప్పేదే లేదు. "  గొప్పగా అనేశాడు. 

"ఏమీ లేదండీ...  అమ్మా , చెల్లీ దాని పిల్లలూ, మన పిల్లలూ  కలసి  మహా బలిపురం   వెళ్దాం  అనుకున్నాం కదా.. " (ఎప్పుడబ్బా అనుకున్నాడు మనస్సులో )

" ఆ.అ.. గుర్తొచ్చింది,"    తల ఆడించాడు శేఖర్ . 

" రేపటి నుండి చిట్టి తల్లికి హాలిడేస్, నేనూ  అదీ వెళ్తాము, మీరు లీవ్ వగైరా చూసుకొని రండి, సరేనా " ఒప్పించే పద్దతిలో అడిగింది. ( అడగటం ఏమిటీ ఒప్పించేసింది  కూడా )

                                                                 ***

పొద్దున్నే  శ్రీమతినీ, పాపనీ  ట్రైన్   ఎక్కించే హడావిడిలో  ఉండగా, తన తల్లి నుండి  ఫోన్  వచ్చింది శేఖర్ కి. 

" ఒరే నానా , నిద్ర లేచావా ? "

"ఆ...   అమ్మా చెప్పు", 

" ఏమి లేదురా, అన్నయ్యా వాళ్ళు, టూర్  వెళ్తున్నారు కదా,"

" ఆ  చెప్పినట్టున్నావ్  అయితే ఏంటి?"  కాస్త చిరాకేసింది  ఈ టైంలో  పోన్  చేసి ఇంత  తాపీగా  మాట్లాడుతుంటే. 

" ఏమి లేదురా కన్నా, మరి నేనిక్కడ ఒంటరిగా  ఉండలేను కదా, 
నన్ను తీసుకొని వెళ్ళటానికి వస్తానన్నావు కదరా.. వెర్రి సన్నాసీ..  మరచి పోయావా.. , వదిన నీవు వచ్చే వరకూ వీధి గదిలో ఉండి నీవు వచ్చిన తర్వాత  గదికి తాళం వేసి పక్కింట్లో ఇవ్వమన్నది. "   ఇంకా ఆమె సంభాషణ సాగుతూనే ఉంది, శేఖర్ కి మాత్రం  ఏమీ వినిపించటం లేదు. 

వహ,  వా..  సరోజా  అమ్మ వస్తుంది అనే విషయం  నీకెంత బాగా గుర్తుందీ...., వెర్రి నాగన్నా  అని అమ్మ ఎందుకు అంటుందా  అనుకునే వాడిని.... 

(కోడళ్ళూ ....  మీ తెలివితేటలకు  జోహార్లు.  ఇదే మాట మీ కోడళ్ళ మీ చేత అనిపిస్తారేమో..)   






 



6 comments:

  1. షరామామూలే :)

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా?... చూద్దాం.

      Delete
  2. పాపని దగ్గరికి పిలిచి జడ వెయ్యటం మొదలు పెట్టింది. "ఏమి బతుకో పాపిష్టి బతుకు, ఒక అచ్చటా లేదూ ముచ్చటా లేదూ" ఎప్పుడూ ఇంటి చాకిరీతోనే సరిపోయింది,"
    ......... భార్య రుసరుసలతో కాస్త మెత్తబడ్డాడు శేఖర్.
    అదను చూసుకుని అంది ఆమె. "అమ్మా, చెల్లీ, పిల్లలూ నేనూ మహా బలిపురం వెళ్దాం అనుకున్నాం కదా.. " (ఎప్పుడబ్బా అనుకున్నాడు మనస్సులో)
    " ఆ.అ.. గుర్తొచ్చింది," తల ఆడించాడు శేఖర్ . "మీరు లీవ్ వగైరా చూసుకొని రండి, సరేనా " అంది ఒప్పించే పద్దతిలో.... ( అడగటం ఏమిటీ ఒప్పించేసింది కూడా)
    .............
    వహ, వా.. శేఖర్ అమ్మ వస్తుంది అనే విషయం సరోజకు ఎంత బాగా గుర్తుందీ...., వెర్రి నాగన్నా అని అమ్మ ఎందుకు అంటుందా అనుకునే వాడు.... శేఖర్ ఇన్నాళ్ళూ .... (కోడళ్ళూ .... మీ తెలివితేటలకు జోహార్లు.)
    మధ్య తరగతి కుటుంభం లో గుంజాటనల్ని చక్కగా విడమర్చి రాసారు. చాలా బాగుంది కథ.
    అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete
    Replies
    1. కథ మద్య తరగతి కుటుంబాల సమస్యల మీద రాయాలనే నా ప్రయత్నం నెరవేరింది,
      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు చంద్ర శేఖర్ గారూ,

      Delete
  3. ఇది రచయిత ఒక సంఘటనను యథాతథంగా
    చెప్పడానికి చేసిన ప్రయత్నం.
    బాగుంది. పదండి ముందుకి పదండి తోసుకు.
    బాగా రాస్తున్నారు. కీప్ గోయింగ్.
    నా సీరియల్ నవ్యలో వచ్చేవారం నుంచి రాబోతుంది.

    ReplyDelete
    Replies
    1. సర్, మీరు బాగా రాస్తున్నారు అని పొగిడారనుకోండీ.. కవయత్రి నుండి రచయత్రి అయిపోతాను జాగ్రత్త.:-))
      నవ్య లో మీ సీరియల్ తప్పకుండా చదువుతాను.

      Delete