Pages

Monday 25 November 2013

మాట తప్పను.








      మాట తప్పను. 

       రెక్కలు తెగిన  పావురం చీకటి గూటిలో,
       శిక్ష కోసం సిద్దపడుతూ..,  
 
       తగలబడ్డ   ఎన్నో స్వప్నాల  నివురులో,
       తనని  తానే వెతుక్కుంటూ..,

       అక్షరాల  అగాధాల  మద్య  ఇరుక్కున్న, 
       భావజలధిలో  స్నానిస్తూ..,

       చిరుజల్లులో  చీరకుచ్చిళ్ళ  జీరాడు ఆటలో..,
       ఆత్మీయ   స్పర్శకై   ఎదురుచూస్తూ ..,

       ఆకాశము నుండి  నేరుగా తన ఒడిలో  
       జారిపడిన మేఘాన్ని ముద్దాడుతూంటే.., 

       ఉరకలెత్తి,ఉద్రేకించే  తడికళ్ళపై  వెచ్చటి ముద్రలా..,
       వెలుగునిచ్చిన   ఇనబింభమై ..,

       మూగ కంఠాన్ని నిమిరి మదుర గానాన్నినేర్పిన,
       కోకిల రాజమై .., 

       మోడువారిన  హృదయాన్ని  చిగురింప జేసే,
       ప్రేమ మంత్రమై .., 

       మనసున్న మంచి  నేస్తమా,నీ పలకరింపుతో,
       నాలో బ్రతాలనే  ఆశను  రానీకు, 
                      
                             ***
       సజీవ జ్ఞాపకాల మీదుగా పయనించే  ప్రాణమా..,
       నిర్దయగా..నిష్క్రమించకు.  

       సహచరునితో   ఓ  చిన్నిమాట  చెప్పివస్తాను,
       అంతరకూ ఆగి చూడు,
       మాట తప్పితే... వేటాడు.  



  



 

 

10 comments:

  1. Beautiful! No more words....
    ఇనబింభమై...అంటే అర్థం తెలీదు....చెప్పగలరా....

    ReplyDelete
    Replies
    1. అనూ, మీ స్పందనకు ధన్యవాదాలు,
      ఇనబింబం అంటే సూర్యబింబం.

      Delete
  2. మరువకు,నీ బ్రతుకు విలువ !
    వేసుకోకు, నీ భవితకు శిలువ !
    దాగకు, భయపడి వెలుగుకు ,
    నిరాశా కలుగులో ఎలుకవై !
    ఛేదించు 'బంధనాలు', ఏనుగు వై !
    సాధించు నీ కలలు , ఎలుగువై ,
    మధించు నీ బ్రతుకు, మనిషివై !


    ReplyDelete
    Replies
    1. మీ సుభాషితాల కవితా కుసుమాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను..
      స్పందించిన మీకు నా ధన్యవాదాలు సుదాకర్జి.

      Delete
  3. "అది ఒక అంతఃపురం. అక్కడ చీకటి గూళ్ళలో రెక్కలు తెగిన పావురాలు
    తగలబడ్డ ఎన్నో స్వప్నాల నివురులు
    అక్షరాల అగాధాల మద్య ఇరుక్కుపోయిన, భావజలధిలు
    చిరుజల్లుల్లో చీరకుచ్చిళ్ళ జీరాడు ఆటలాడుతూ.., ఆత్మీయ స్పర్శకై చూసే ఎదురుచూపులు
    *************
    నేరుగా చేరవచ్చిన మేఘాన్ని ముద్దాడి,
    ఉరకలెత్తి, ఉద్రేకించే తడికళ్ళపై గోరు వెచ్చని ముద్దు ముద్రలేస్తూ...,
    వెలుగుకిరణాలతో ఎదను తాకే ఇనబింభము లా,
    మూగబోయిన కంఠాన్ని నిమిరి మధుర గానం ఆలపించడం నేర్పిన, కోకిల రాజము లా,
    మోడువారిన హృదయాన్ని చిగురింప జేసిన, ప్రేమ మంత్రము లా,
    మనసున్న ఒక మంచి నేస్తం లా,
    నీ పలకరింపు పరామర్శతో, నాలో బ్రతాలనే ఆశను మరింత పెంచకు,
    **************
    సజీవ జ్ఞాపకాల అలలపై పయనించే ఓ ప్రాణమా.., నిర్దయగా..నిష్క్రమించడం న్యాయమా. "

    మీ కవిత చాలా బాగుంది. మీ కవితలో బలమైన భావం ఉంది. కాస్త ఎడిట్ చెయ్యగలరని మనవి. మరింత గొప్పగా ఆవిష్కరించగలరు. నా కామెంట్ను మీరు స్వీకరించక్కర్లేదు. మళ్ళీ కామెంట్ రాస్తాను. శుభాకాంక్షలు మెరాజ్ ఫాతిమా గారు.

    ReplyDelete
    Replies
    1. మొదటగా నా కవితను సున్న్నితముగా సవరించిన మీకు నా కృతజ్ఞతలు,
      ఇకపొతే అంత:పుర విహంగాలకే వేటగాని వేటు పడేది.
      జీవితం పై ఆశను పెంచే అంశాలనే గుర్తుతెచ్చుకుంటూ..,
      బందించిన వలతాళ్ళను తెంచుకొవాలనే తపనతో... ఎన్నాళ్ళో, ఎన్నేళ్ళో...(ఇదే నేను చెప్పే పావురం కథ.)

      Delete
  4. మాట ఇచ్చే ముందు ఆలోచించు, ఇచ్చిన మాట చచ్చినా తప్పద్దు.

    ReplyDelete
    Replies
    1. ఇచ్చిన మాట చచ్చేందుకే అయితే తప్పించుకొనే సమస్యేలేదుగా...మాస్టరూ..మీరు మరీ హాస్యంగా అడుగుతున్నారు.:-))

      Delete
  5. పావురం వేటకాడితో మాట్లాడటం
    గుండెలను పిండేసినట్లుంది.
    కోకిలకు రాజు వసంతుడే కదా, మావిచిగురు
    మందు తాగించి గానం నేర్పిస్తాడు.
    ఒళ్ళో వాలిన మేఘం కళ్ళల్లో వెచ్చటి
    కన్నీరై పొంగింది, ఎంత దిగులో కదా!
    సహచరుడు అంటే కలిసి చరించేవాడు.
    కనుక చేయి వీడడడు.
    వేటగాడు దిగంతాల వరకు వెళ్ళాల్సిందే!

    పి.ఎస్
    చంద్ర గారు అద్భుతంగా ఎడిట్ చేసారు. కానీ ఒరిజినల్ లో
    ఒక పదును ఉంది.
    చంద్ర గారికి శుభాభినందనలు.

    ReplyDelete
    Replies
    1. వసంతుడూ,మేఘుడూ శిశిరములో కనిపించరు.
      చేటు సమయాన చరించేవాడు మాత్రమే చెంతనుంటాడు.
      అందుకే , నేనున్నానని నిండుగ పలికే తోడు ఉండాలి అంటారు.
      సర్, మీ సున్నిత హృదయాన్నీ కదిలించిన నా పావురం కవిత బాగుందనే అనుకుంటున్నాను.

      Delete