Pages

Tuesday 26 November 2013

చూపు














     చూపు 


    నీ వాలు  చూపుల  గాలం 
    నా  గుండె  కవాటానికి,
    చిక్కుకుంది. 

    నీ  ఓరచూపుల  సోయగం,
    నా  మన:మందిరం,
    చేరుకుంది,

    నీ  చిలిపి చూపుల  చక్కదనం,
    నా  వలపు వాకిట,
    విరిసింది. 

    నీ  సోగచూపుల  సౌందర్యం,
    నా  ఎదముంగిట,
    పరచుకుంది. 

    నీ  ఆర్తి చూపుల  కోమలం 
    నా  ఆశల  దోసిట,
    నిలిచింది 

    నీ  కాటుక  చూపుల  కలికితనం,
    నా  మది  భావాలను,
    మీటింది. 

    నీ  మాలిమి  చూపుల  మంచితనం,
    నా  తీపి పలుకులను,
    మాల కడుతుంది. 

    నీ  దొంగ  చూపుల దోపిడితనం
    నా మనసు  మర్మాలను 
    వెతుకుతుంది. 

    నీ  అలక  చూపుల అల్లరితనం,
    నా  దాహార్తిని,
    దాచేస్తుంది. 

    నీ  కరుణ చూపుల కమ్మదనం 
    నా  ఆశయాలకు,
    బాట వేస్తుంది . 

    నీ  స్నేహ  చూపుల  చల్లదనం,
    నా  జీవితాన్ని,
    నీకంకితం  చేస్తుంది
















13 comments:

  1. అమ్మబాబోయ్, చూపుల్లో ఎన్నిరకాలో!

    ReplyDelete
    Replies
    1. ఇంకా ఎన్నో చూపులూ....చెప్పలేని భావాలూ కనిపిస్తాయి నయనాలలో.
      ధన్యవాదాలు మీ స్పందనకు వర్మాజి.

      Delete
  2. ఒక స్త్రీ కళ్ళను ఆమె చూపుల పర్యవసానాన్ని సరళత్వం కోణాలను మాత్రం ఎంతో అందంగా ఆవిష్కరించారు. బావుంది. అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు.




    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ధన్యవాదాలు చంద్రశేఖర్ సర్.

      Delete
  3. వాలుకంటి కడగంటి చూపుతో లోకాన్ని జయించగలదంటారు. మొత్తానికి చూపునో చూపు చూశారు :)

    ReplyDelete
    Replies
    1. రాజ్యాలే కూలిపోయాయి అంటారు పెద్దలు.

      Delete
  4. బాగున్నాయి చూపులు!

    ReplyDelete
  5. ఇలాంటి చూపు లన్నీ " ముందు చూపు " ఉన్నప్పుడే అందగిస్తాయేమో కదా ! మేడమ్ ?

    ReplyDelete
    Replies
    1. మీరు చూడ లేదు అవన్నీ ముందుచూపులే..:-))

      Delete
  6. choopu kavithwam chaala baagundi.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రావ్ గారు.

      Delete