Pages

Wednesday 27 November 2013

ఆతని రాకకై...

      



     ఆతని రాకకై... 

      ప్రతిరాత్రీ  కన్నీటి జ్ఞాపకాలతో, 
      కన్నీటి కడలిని  దాటే యత్నం  చేస్తుంది. 

      కలువభామ  సాక్షిగా ఆతని వీక్షణాలకై..,
      నీటిబిందువై   ఎదురుచూస్తుంది.

      దిగంతాల ఆవలున్న  ఆతని  కరచాలనానికై..,
      ఆర్తిగా తన  చేయి చాస్తుంది. 

      నీడ  సైతం   వెన్నంటిరాని  ఏకాకితనంలో..,
      పలకరింపుకై   పలవరిస్తుంది. 

      అందుకోలేని  ఆ అపురూప   పెన్నిదితో  సన్నిదిని..,
      సశేషంగానే   సరిపెట్టుకుంటుంది. 

      ఆకాశమే అవనికి  దిగివచ్చి  అభయమిస్తుంటే..,
      తనకు తోడుండమని  వేడుకుంది. 

      చీకటి హృదయాన వెలుగు నింపిన దినకరుని..,
      ఆగిపోమ్మని  ఆశగా  అర్ధించింది.

      కానీ..,

      జగత్సంచారిని   బంధించటం  సాద్యం కాదని...,
      బాదగానే  వీడ్కోలు పలికింది. 

      ప్రతి ఉదయం  పలకరించే  ఉదయుని  స్పూర్తితో,
      పరుల  సేవకై   శ్రీకారం  చుట్టింది.

      చీకటి చిట్టిచేతుల్లో  చిరుదివ్వెనైనా  కావాలని..,
      అక్షరకిరణమై  అంకితమయ్యింది.      





 


8 comments:

  1. రాత్రి నుంచి పగటి వైపు ప్రయాణం.
    తమసోమా జ్యోతిర్గమయ

    ReplyDelete
  2. తాకితే , ఒక్క రవి కిరణం !
    అదే ,కమలం వికసించే తరుణం !
    ఒకే ఒక్క ఆశ !
    కావాలి , జీవితేచ్చ కు ప్రేరణం !
    అదే , కోటి కిరణాల ఉదయం !
    అదే ప్రతి జీవితానికీ , ఉత్తేజం
    కన్నీటి సింధువూ ,
    ఒక 'బిందువే' అపుడు !

    ReplyDelete
  3. కన్నీటి జ్ఞాపకాల కడలి నీటిబిందువై,
    కరచాలనం పలకరింపుకై పలవరిస్తూ,
    సన్నిది, అభయం కాని తోడు ఆశించి,
    ఆ జగత్ సంచారిని బంధించలేక ....
    స్పూర్తితో, పరుల సేవకు,
    చీకటి పసిచేతుల్లో చిరు వెలుతురయ్యేందుకు,
    అక్షరకిరణమై ....
    ఆతని రాకకోసం ఎదురుచూస్తూ,
    గొప్ప అంకిత భావన,
    సమాజము, బడుగు వర్గాల బాల బాలికల పట్ల ఉదాత్తమైన మీ జీవనాదర్శం.
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

    ReplyDelete
  4. సేవ చేయడంలోని సంతృప్తికి ఏది సాటి. ఆ స్ఫూర్తితో సేవ చేయగలిగిన మనసే ఇది రాయగలడు....
    ఎల్లప్పుడూ మీ మనసిలాగే ఉండాలని ఆశిస్తూ.....

    ReplyDelete
    Replies
    1. అనూ, మీ అభిమానం ఉంటే చాలు నేనిలాగే ఉంటాను.

      Delete