Pages

Friday 28 February 2014

చందురూడా... ,







      చందురూడా... ,

      బహురూపుల చందమామవు,
      మదిలో దాగి  కలలకు, 
      మోహపు సంకెళ్ళు వేస్తావు. 

      చెంత  చేరని శశి మామావు,
      నిడురలేని కనులకు  వెన్నెల,
      లేపనాలు రాస్తావు. 
      మేఘాల మాటున నక్కిన జాబిలి మామవు,
      ఎదురుచూసే  వారిని  ఏడిపించి,
      కొంటెగా వెక్కిరిస్తావు. 

      తొలిజామునే వీడ్కోలు పలికి,
      మలి పక్షానికై వేచి ఉండమని,
      చల్లగా జారుకొనే రేరాజువు. 

      చల్లని నీ వెన్నెలతో,
      చక్కని నీ స్నేహంతో,
      శాంతిని పంచే చందమామవు,

      సౌమ్యుడవూ....,సోముడవూ...,సఖుడవూ...,
      అమ్మ తమ్ముడవూ..,అయినవాడవూ..,అందరివాడవూ.., 
      అందనివాడవూ...,













9 comments:

  1. awesome feeling...chaalaa baagundi:-):-)

    ReplyDelete
  2. మొత్తానికి ఓ చల్లని వెన్నెల సమయం చూసుకుని,మెల్లగా పడవ...తెడ్డు తీసుకుని మరీ బయలుదేరేసారుగా... మీరజ్ త్వరగా వెళ్ళి తీసుకురండి.

    ReplyDelete
    Replies
    1. దేవీ, అదే ప్రయత్నం లోనే ఉన్నాను,

      Delete
  3. చందురుడు ఎప్పుడూ చల్లనివాడే. అందుకే అందరివాడయ్యాడు.వెన్నెలతో ఆప్యాయతను పంచుతాడు. అందరిని ఆకర్షిస్తాడు కూడాను. మరి అలాటి చందురుడు కుడా అపనిందల పాలయ్యాడంటే చూడండీ.మరి సమాజంలోని మనం ఎందుకు పొర్ణమి నాటి చండురుడిలా కాక పోయినా అమావాస్య పిమ్మట ఎదిగే చండురుడిలా కాస్తంతా నైన ఆప్యాయతలను పంచలేక పోతున్నాం ఎదుటివాడికి. అందుకేనేమో దూరంగా ఉన్న చండురుడినే ఇష్ట పడతారు అందరూ . మీ కవితలోని కదిలించే పదాలు
    " సౌమ్యుడవూ....,సోముడవూ...,సఖుడవూ...,
    అమ్మ తమ్ముడవూ..,అయినవాడవూ..,అందరివాడవూ..,
    అందనివాడవూ...,"
    చాల బావుందండీ ఫాతిమా గారూ మీ చల్లని వెన్నెల కవిత . *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. నా కవిత చల్లని వెన్నెల అన్నారు ,కదిలించే పదాలు ఉన్నాయీ అన్నారు, ఇంతకంటే ప్రశంస ఇంకేమి కావాలి,
      ధన్యవాదాలు శ్రీపాదగారు,

      Delete
  4. రేరాజా! సౌమ్యుడా ,...., సోముడా ...., సఖుడా ...., అమ్మ తమ్ముడా ..., అయినవాడా ...., అందరివాడా ...., అందనివాడా ....., బహురూపుడా ....., శశి మామా, జాబిలి మామా, ఓ చందురూడా ....,
    ఆవాహన బాగుంది .... పసిడి వయసు పలుకరింపు లా
    మెరాజ్ గారు మీ కవితాపధం లో కొత్త కోణం .... శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. చూశారా, అంతగా పిలిచినా పలకడే...అందాల మామ :-))
      ధన్యవాదాలు సర్

      Delete
  5. మీ కవిత చదువుతూంటే, చిన్న పిల్లలు పాడే పాట గుర్తుకు వస్తుంది !

    ఉన్నారమ్మా ఉన్నారు , నాకిద్దరు మామలు ఉన్నారు !
    ఇంటిపైని మామా, వెన్న ముద్ద లా ఉన్నాడు !
    ఇంటి లోని మామ , ఉత్త మొద్దు లా ఉన్నాడు !
    ఉన్నారమ్మా ఉన్నారు , నాకిద్దరు మామలు ఉన్నారు !

    మరి మీకు ఏ ' మామ ' కావాలో ?!

    ReplyDelete