Pages

Monday 3 February 2014

ఎటు దారి ?

     





     ఎటు దారి ?

      బూట్లు తొడిగీ, బుగ్గలు నిమిరీ,
      బువ్వతినబెట్టీ.., జుట్టుదువ్వీ,
      భుజానెత్తుకొనీ  బడిలో దింపే అమ్మా,

      ఒడిలో పెట్టుకొని హోంవర్క్  చేయించీ,
      సంకనెత్తుకొని  సరదాగా తిప్పి,
      గోరుముద్దలు  తినిపించి జోలపాడే...అక్కా

      ఎదిగినకూతుర్ని కూలికి పంపి,
      ఎదిగొచ్చే కొడుకు భవిత కొసం,
      చదివించే శక్తి లేకున్నా,
      రెక్కలు ముక్కలు చేసుకొన్న నాన్న.

      పదవ తరగతే పెద్ద చదువనీ,
      ఆ పైన చదివించే శక్తి తమకు లేదనీ,
      చేతులెత్తేసిన ఇంటి సభ్యులు  

      ఇక ఇప్పుడు,

     కాలేజీ చదువూ లేదూ,
     కూలిపని చేసే అలవాటూ లేదూ,
     కూడుపెట్టే కొలువూ రాదు, 

     ముద్దుగ చూసిన ఆ ముగ్గరే,
     సోమరిగాడివని చీదరించుకుంటే,
     ఆవారాగాడివని  అదిలిస్తుంటే,

    కూలీగా మారాలంటే నామోషీ ..,
    ఖాళీ  జేబు చూసుకుంటే  పెరిగే కసీ
    తనపై తనకే పెరిగే సానుబూతీ,

    (క్రమబద్దీకరణ లేని కాలం నిరుద్యోగ రక్తపింజరి ఇంగితాన్ని 
    తాగేస్తుంది ,సామాజిక ముప్పు తెస్తుంది )  






9 comments:

  1. చదువుతో పాటే వృత్తి విద్యను అనుబంధంగా ఉంచాలని ఎంతగా చెప్పినా అమలుకాదు కదా,చదువు ఎక్కువ చదువుకోలేరు,తద్వార ఉద్యోగం రాదు,పని రాదు,పగ...కసి....మాత్రం వస్తాయి....ఈ పగ,కసికి వెచ్చించే సమయం మరో పని మీద నిలపగలిగితే కొంతవరకూ బాగుపడినట్లే ...మీరజ్ కవిత నేటి సమాజ పరిస్థితులకు దర్పణంగా నిలచింది.

    ReplyDelete
    Replies
    1. నిజమే కదా దేవీ, మనకంటే చిన్న దేశాలు వృత్తి విద్యల్లో పిల్లలకి పాఠశాలదశ నుండే శిక్షణ నిచ్చి ప్రగతి పథం లొ ముందుకు దూసుకెళ్తున్నాయి.

      Delete
  2. బూట్లు తొడిగీ, జుట్టుదువ్వీ .... బడిలో దింపిన అమ్మ, హోంవర్క్ చేయించి, గోరుముద్దలు తినిపించి జోలపాడిన ...అక్క, కొడుకు భవిత కొసం రెక్కలు ముక్కలు చేసుకొనే నాన్న .... నిన్న
    ఇక ఇప్పుడు,
    లేని చదువు, అలవాటు లేని కూలిపని, రాని కొలువూ, చీదరింపులు అదిరింపులు .... కూలీగా మారలేని నామోషీ ...., ఖాళీ జేబు పై పెరిగే కసి, స్వీయ సానుబూతి సామాజిక ముప్పులా పరిణమిస్తూ

    ఎంత చక్కని భావన వాస్తవ చిత్రణ ఆకలి జీవితాల ఆరాటాల్ని చదువుతున్నట్లుంది.
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. ఆడపిల్ల చదువు ఆపించి కొడుకుని చదివించే తల్లిదండ్రులలో స్వార్దమే కనిపిస్తుంది.
      చేతిలో పని లేని ఎందరో కుర్రాళ్ళు ఎన్నుకొనే తప్పుదారుల వల్లా అమాయక ఆడపిల్లలూ, ప్రజలూ బలవుతున్నారు.
      వారి కోసం ఇంటర్ నెట్లూ..,సినిమా హాళ్ళూ.., ఫాస్ట్ ఫుడ్డు సెంటర్లూ..,యాసిడ్ బాటిళ్ళూ..., వగైరా ఉండనే ఉన్నాయి .
      నైతిక విలువలు తల్ల్లితండ్రులు నేరపరని నేను అన్లేను కానీ సామాజిక పోకడలు, అతి స్వేచ్చా యువతను అధోగతి పాలు చేస్తున్నాయి.

      Delete
  3. ప్రభుత్వాలు కాదండి. నా ఉద్దేశంలో.. పెంపక లోపం చాలా తీవ్రంగా ఉంది. పిల్లలను శ్రుతి మించి అల్లారు ముద్దు చేస్తున్నారు.. అర్థరాత్రి వరకు తిరుగుళ్లూ, టెన్త్ కే సిగరెట్లు, బైకులు, మొబైళ్లు, అందులో ఇంటర్ నెట్లు.. ఇక బూతు బొమ్మలు... వీటిపై పర్యవేక్షణని తల్లిదండ్రులు వదిలేశారు. చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి. సున్నా మార్కులొచ్చినోడికీ ఇంజనీరింగ్ సీటొస్తోంది.
    వాడా ఆ కాలేజికెళ్లి.. ఏ అమ్మాయిని పటాయిద్దామా అనే పనిలో ఉంటాడే తప్ప.. చదువుకోడు. నిబద్ధతగా చదివే, భవిష్యత్తుని నిర్మించుకుంటున్న విద్యార్థులు చుట్టూ ఉన్నా... వీళ్లలో మార్పు రాదు. చదువంతా అయిపోయాక.. కనీసం పది సబ్జెక్టులు ఫెయిలైనా.. తండ్రి పోషిస్తున్నాడే తప్ప... పిల్లలకు గైడ్ చేయడం లేదు. ఇంత కచ్చితంగా నేనేందుకు చెప్తున్నానంటే.. మేం చాలా మంది సైకాలజిస్టులతో మాటాడుతుంటాం.. వాళ్లకొచ్చే కేసులివే. ముందు తల్లిదండ్రులు.. పిల్లలకు గైడ్ చేయాల్సిన, వాళ్లని సమాజానికి పనికొచ్చే విధంగా చిన్నప్పటి నుంచే పరిజ్ఞానం పెంచాల్సిన అవసరం ఉంది. అత్యాచారాలు చేసే కుర్రాళ్లలో చాలా మంది తల్లిదండ్రులంటే లక్ష్యం లేనివారే, కుటుంబం విలువ తెలియని వారే. ముందు అవి నేర్పాలి. ఆ ఆటోమేటిక్ గా పిల్లలో బాధ్యతలు పెరుగుతాయి. కళాశాలలల్లో మానవ విలువలు, వ్యక్తిత్వ వికాసాల కోసం ఓ ట్రైనర్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కచ్చితంగా కనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. మీరన్నది అక్షర సత్యం, అతి గారాబం పిల్లల్ని వారి బాద్యతలనుండి దూరం చేస్తుంది.
      ఇకపోతే నైతిక విలువలున్న పాఠ్యాం శాలకు విలువ లేదు,లెక్కలూ,కంప్యూటరూ్ నేర్చుకుంటే చాలను కొనే చదువుల బడులు మనవి. ఈ నాడు ఒక్క బిడ్డకైనా శ్రవణుడు ఎవరో తెలుసా, ఆతని పిత్రు భక్తి తెలుసా, సిభి తెలుసా? ఆతని త్యాగం తెలుసా?,
      అత్యాచారాలు చేసిన కుర్రాళ్ళంతా కుటుంభ విలువలు లేని వాళ్ళే..
      సతీష్ గారూ ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  4. నిష్టురమైన నిజం

    ReplyDelete

  5. " కూలీగా మారాలంటే నామోషీ ..,
    ఖాళీ జేబు చూసుకుంటే పెరిగే కసీ
    తనపై తనకే పెరిగే సానుబూతీ, "

    పట్టున్న మాటలివి.
    అప్పటి , ఇప్పటి అంతరాలను ఎంత బాగా చూపించారో మీ ఈ కవితలో .
    చాలా బాగుందండీ ఫాతిమా గారూ.

    ReplyDelete