Pages

Tuesday 11 March 2014

గమ్యం వైపు...,






   గమ్యం వైపు...,

   ఊరూ,వాడా  అంతటా  నిశ్శబ్దం,
   ప్రజల మద్యనే పాలన నలుగుతుంది,
   మండుతున్న ఆకలికి  ఆర్దికస్థితి సాక్ష్యమైంది.

   బడి నుండి తిరిగొచ్చిన చిట్టి  తల్లి,
   బువ్వ దొరకలేదన్న బుంగమూతితో,
   పేరుపెట్టి  పంపమని ఆర్దికస్థితి ని బలపరచింది.

   రేషన్‌ బియ్యానికి  తెల్లకార్డ్  తెచ్చుకోకుంటే,
   మసి పాతకంటే  హీనంగా తీసిపారేసే,
   డీలర్  ముందు  దిక్కులేక ఆర్దికస్థితి విలపించింది.

   సిరులు విరుల్లా రాలిన నట్టింటనే,
   అధిక దరలు  అటకనెక్కి కూర్చుంటే,
   అన్నం పెట్టలేని  ఆర్ధికస్థితి  వెర్రిదైంది.

   ఆలొచించి  అడుగేస్తే...,

   శ్రమను చరిత్ర చిహ్నంగా  ఎగరేసే,
   మానవీయ మహానదిలో,
   ఆకలి పేగులను తడిపే అమ్మ కావాలి  మన స్థితి.

   వర్గ,వర్ణ,వైషమ్యాల విషక్రీడలను,
   కుల చీడను   చేదించే కరవాలమై,
   దీనులకు పిడికెడు మెతుకులు పెట్టే  
   అక్షయ పాత్ర  కావాలి మన స్థితి.

   ఇరుకు గూటికి కొత్త ప్రాణి రాక ముందే,
   విశాలమైన  ఇంటికి మారే జీవనానికి,
   నాంది పలకాలి మన ఆర్దికస్థితి.మన  ఆశయసిద్ది.




12 comments:

  1. ఆశయసిద్ధికై గమ్యంవైపు పయనించడం కనీస సామాజిక బాధ్యత.మీరజ్ మీ కవిత చాలా లోతైన భావాన్ని కూర్చడంలో ముందుంటుంది ఎప్పుడూ.

    ReplyDelete
    Replies
    1. దేవీ, మీ స్పందన నన్నింకా ముందుకు నడిపిస్తుంది.

      Delete
  2. అంతా నిశ్శబ్దం, ప్రజల మద్య పాలన, మండుతున్న ఆకలికి సాక్ష్యంగా దేశ ఆర్దికస్థితి
    బడి నుండొచ్చిన చిట్టి తల్లికి, బువ్వ దొరకదు. సిరులు రాలిన నట్టింటే, అటకనెక్కి కూర్చున్న అధిక దరలు, అన్నం పెట్టలేని వెర్రి ఆర్ధికస్థితి.
    నిజానికి...,
    మనకు కావల్సింది మానవీయ మహానదిలో, ఆకలి పేగులను తడిపే అమ్మప్రేమ
    వర్గ, వర్ణ, వైషమ్యాల విషక్రీడలు, కుల చీడలను చేదించి దీనులకు పిడికెడు మెతుకులు పెట్టే అక్షయ పాత్ర లాంటి అధికారం కావాలి.
    ఇరుకు గూటిలో కొత్త ప్రాణి ఉదయించక ముందే, విశాలమైన ఇంటికి మారే జీవనానికి, నాంది కావాలి మన జీవసరళి ఆర్దికస్థితి ఆశయసిద్ది.

    చాలా బాగుంది గమ్యాన్ని ఆశయాల్ని ఆవిష్కరించిన విధానం
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. ఆర్దిక స్థితి గూర్చి మద్యతరగతి (మా లాంటి) వారికే బాగా తెలుస్తుంది,
      దాన్ని మెరుగుపరచుకోవటం లోనీ జీవితం అయిపోతుంది,
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Delete
  3. Mee gamyam lo Unna tapana andariloa Unna rojuna..ee aakali kekalu undavu.
    chaalaa baagundi fathima gaaru:):)

    ReplyDelete
    Replies
    1. కార్తిక్ గారూ, మీ స్పందనకు నా ధన్యవాదాలు.

      Delete
  4. 'ఆర్దికస్థితి' ఎలా విలపించింది, ఎలా వెర్రిదైంది అని విశ్లేషిస్తూ . ఇప్పటి 'మనస్తితి' ఏమిటీ అని చెబుతూ..... మనకు కావలసినదేమిటని స్పష్టతను తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్తితిల్లో ఇదీ మన "ఆశయ సిద్ధి" అని కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ .... చాలా బాగా చెప్పారు . ఇంత మంచి కవితను అందించిన మీకు నా అభినందలు ఫాతిమా గారూ .
    *** శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాదగారూ,నా కవితలో ప్రతి అక్షరాన్నీ పరామర్సించే మీకు నా కృతజ్ఞతలు.

      Delete
  5. మేడం ,కవిత చాలా బాగుంది.
    ఆర్దికస్థితి గూర్చి పిల్లలకు చెపుతూ ఉంటారు మీరు
    రోజూ పిల్లలతో పాటు నేనూ వింటూ ఉంటాను, కానీ చదివితే గొప్పగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ, మీరా,నిన్నటి కవితకు మీరిచ్హిన కామెంట్ చూసి ఎవరో అనుకున్నాను.
      నా స్కూల్లో టీచర్ అయినా మీరూ విద్యార్దిలా వింటూ ఉంటారుకదా,
      థాంక్స్ మీ స్పందనకు.

      Delete