Pages

Friday 21 March 2014

వీడ్కోలుకు ముందు....,




   వీడ్కోలుకు ముందు....,

    ఒంటరితనం  వేటాడినంత  వేగంగా,
    వ్యాఘ్రం కూడా  వేటాడలేదు.

    ప్రాణం పట్టుతప్పుతున్న సమయాన,
    అయిన వారి చేయి అసలే అందదు.

    ఒకప్పటి విశాల హృదయాలూ,విస్తార స్నేహాలూ,
    నేడు  నిస్సారమై దూరమవుతాయి.

    తొలితరం రూపాలన్నీ ఆరిన దీపాలైతే,
    మలితరం దీపాలన్నీ తప్పించుకు తిరిగే కిరణాలే.

    వారసత్వాలకు  అలివిగాని  వసంతాలిచ్చినా,
    శిశిరాన్ని తలపించే  చిటపటలే. 

    అందలమెక్కివ్వలేదనే   నిందలతో,
    అసహనపు మాటల శూలపు పోట్లే, 

    ముసిరిన రోగాలతో,మూలుగులతో ఉనికిని తెలిపినా,
    ఆత్మీయ స్పర్శ  ఎడారిలో ఎండమావే.

    అణువణువూ దహిస్తున్నా, ఆత్మాభిమానంతో సహిస్తూ,
    అయినవాళ్ళే హత్యచేస్తున్న  చిత్రమైన భావన.

    ఆకరి ప్రయాణానికి ఆయత్తమవుతూ,
    మసకబారిన చూపులతో ...,ఇసుక తత్వాలను చూస్తూ..,






16 comments:

  1. చాలా సహజంగా నేటి సమాజ పరిస్థితులను బాగా విశ్లేషించడం మీకు మాత్రమే సాధ్యం మీరజ్.....

    ReplyDelete
    Replies
    1. దేవీ, మీ ప్రశంస నాకున్న సామాజిక స్పృహను పంచి ముందుకు నడిపిస్తుంది,
      ధన్యవాదాలు.

      Delete
  2. ఒకప్పుడు అవే పెదాలు,
    పాల బుగ్గల పాపలపుడు మురిపాలతో ముద్దు చేస్తుంటే మారాం చేస్తున్నా చిరాకు పడక
    తన చనుబాలతో కడుపారా నింపి
    మురిసిపోయే ఆ తల్లి,,
    ముదిమి ముడతల మధ్య
    చివురుటాకులా
    చివరి ప్రాణాన్నీ
    బిడ్డలపైనే పెట్టుకుంటుంది...

    అల్లరి చేస్తూ ఆటపట్టిస్తూ, అలిసిపోయినా,,
    బిడ్డను బిగియారా,
    వొళ్లో వొదిగించి,,
    జోల పాడుతూంటే జోగిన ఆవొడే
    నేడు జోలె పట్టి జోరీగల మధ్య
    రసి వోడుతోంది...

    కనుచూపు మసకైనా కన్నవాడి కై
    కళ్ళింతలుచేసి కురుస్తున్న కళ్ళు

    బుడిబుడి ఆడుగుల
    తడబడు పాదాలకు
    నడకలు నేర్పిన ఆ చేతివ్రేళ్ళు
    ఇప్పుడైనా తనను పట్టుకుని ఆసరా నిస్తాయేమో అని
    ఇంకా ఆశగా
    ఆఖరి మజిలీకి పయనమయే
    అమాయక తల్లులూ,,
    మీ కన్నీరింకి పోయింది,,
    కాబట్టి సరిపోయింది,,
    లేకుంటే
    ఒక్క కన్నీటి చుక్క సంద్రమై
    లోకాన్ని ముంచేయదా... 

    ReplyDelete
    Replies
    1. జానీ,మీ ఆవేశం సముద్రమై ఎగసి పడుతుంది,
      మీ విష్లేషణ చాలా బాగుంది.
      మీ స్పందంకు నా ధన్యవాదాలు

      Delete
  3. Replies
    1. అక్బర్ గారూ, నా బ్లాగ్ కి స్వాగతం.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  4. తొలితరం రూపాలన్నీ ఆరిన దీపాలైతే,
    మలితరం దీపాలన్నీ తప్పించుకు తిరిగే కిరణాలే.ee expression naaku chaala chaalaa baagaa nachchindi:):)

    ReplyDelete
    Replies
    1. కార్తిక్ గారూ,నా భావాలు నచ్చి మెచ్చినందుకు నా ధన్యవాదాలు.

      Delete
  5. శ్రమించినన్నాళ్ళూ శ్రమించి ప్రాణం పట్టుతప్పుతున్న సమయాన, ముసలితనం ఒంటరితనం లో అందరూ దూరమై
    తప్పించుకు తిరిగే వారసత్వాలు స్నేహాలు
    అయితే
    ముసిరిన రోగాలు, మూలుగులను పరామర్శించే ఆత్మీయ స్పర్శ ఎడబాటైన ఎడారి జీవితాలను
    అద్దం పట్టిన విధానం చాలా బాగుంది
    మరిన్ని అద్భుత ఆవిష్కరణల్ని మీనుంచి ఆకాంక్షిస్తూ .... అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. సర్,ముదుసలుల వేదనాభరిత మాటలు నన్ను కలచి వేసతాయి, అందరినీ కాకున్నా కొందరినైనా ఆదుకోవాలనే ఆకాంక్ష నాది,
      మీ అభిమానం,ఆశీ్స్సు లూ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి.
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  6. మేడం నమస్తే,
    ఇది మీరు కవితగా భావించరు అని నాకు తెలుసు,
    ఎందుకంటే నిత్యం ఈ ముసలివాళ్ళ గూర్చి ఆలోచించి ఎందరికో ఎదో ఒక మార్గం చూపిన గొప్ప మనస్సు మీది,
    మీరు మనకాలనీలో నిరాదరణకు గురైన ముసల్లమ్మకు , చ్హిన్ని షాప్ పెట్టించారు కదా అలాంటి సహాయం చాలు.
    మిమ్మల్ని అభినందించే అంత పెద్దదాన్ని కాను.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ, మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  7. మీరు రాసిన కవితల్లో నాకు బాగా నచ్చిన కవిత ఇది.
    నమ్మండి . కళ్ళు చెమ్మగిల్లేలా చేసారు

    " ఒకప్పటి విశాల హృదయాలూ,విస్తార స్నేహాలూ,
    నేడు నిస్సారమై దూరమవుతాయి."

    ఎంతటి భావుకత మీ పై మాటల్లో.
    చాలా, చాలా, చాలా బావుంది ఫాతిమా గారూ.

    *** శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. వృద్దాప్యం ఎవరికీ శాపం కాకూడదు,
      మనమంతా ఆకరి మజిలీకి చేరాలి ఎప్ప్పటికైనా,
      ఆ విషయాన్ని మరచిపోయి వారిని నిరాదరణకు గురిచేస్తుంటాము.(అందరమూ అలా ఉన్నామని నా ఉద్దేస్యం కాదు)
      మీ అభిమాన వాఖ్యకు నా ధన్యవాదాలు శ్రీపాద గారు.

      Delete