Pages

Thursday 27 March 2014

కొత్త మలుపుకై

     


    కొత్త మలుపుకై...,

     అంతరాన  ఆలోచనా  అలలు  పోటెత్తితే,
     నేలమీద  నడిచే సముద్రం ఎలా కాగలను,

     సూర్యుడే  పగటిని  మింగే  పన్నాగమెత్తితే,
     ఇక రాత్రి తిమిరాన్ని ఎలా తరమగలను.

     యుద్దాలే  నిషిద్దమనుకొని  వెనక్కి తగ్గితే,
     పద్మవ్యూహాలను  ఎలా చేదించ గలను.

     అంతటా నెత్తురు   రుచిమరిగిన  మృగాలైతే ,
     అత్తరు కమండలాలతో ఎలా అదిలించగలను. 

     రక్త  సంబంధాలన్నీ ముంగాళ్ళ  బంధాలైతే,
     కరకు చెరలను చేదించే కరవాలమెలా కాగలను.

     ఆకలి పేగుల అడుగులతో బడికి చేరిన పిల్లలతో,
     బ్రతుకుపాఠం తప్ప ఇంకేమి వినిపించగలను.  

     అందుకే .... ,

     జిత్తులమారి ఎత్తుగడలేసే  దేశములో,
     ఎవరి ఆయుధాలు వారు ఎక్కుపట్టక తప్పదు. 

     జనం గుండెల్లో జెండా కావాలంటే ,
     ఆర్దిక చైతన్యాన్ని మేల్కొలిపే  దండోరా వేయాలి.  





 







11 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. ఈ కవిత మీద మీ అభిప్రాయం నిష్పక్షపాతంగా రాయాలని మిత్రులను కోరుకుంటున్నాను.

      Delete
  2. అంతరంగంలో ఆలోచనల అలలు పోటెత్తి ....? చీకటి తిమిరాన్ని తరిమే ఆ సూర్యుడే పగటిని మింగేసి ....? పద్మవ్యూహాలను చేదించాల్సిన తరుణంలో యుద్ధాలే నిషిద్దమనుకోల్సొస్తే ....? కరకు చెరలను చేదించే కరవాలాన్ని కావల్సిన క్షణం లో రక్త సంబంధాలే ముంగాళ్ళ బంధాలైతే ....?
    ఆఖలి పేగులు, బ్రతుకుపాఠం తప్ప ఇంకేమి వినిపించకపోతే
    ఎవరి ఆయుధాలపై వారి చేతులు అయాచితంగా వెళ్ళడం
    జనం గుండెల్లో జెండా గా దండోరాలు వేయడం
    ఎక్కడున్నామో? ఎటువెళుతున్నామో .... మనం ....
    ఇన్నిన్ని ఆలోచనలకు ఆదిగా .... పుట్టేదో కదిలినట్లుంది.
    నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. మీ కవిత నా అంతరంగాన్ని చిలికి మరీ బైటికొచ్చింది,
      నాకు ఓ అనుమానం వచ్చింది, ఓ ఆలోచనల పుట్టను కదిలించానేమో అని , నిజమే ఎక్కువగా ఆలోచించి విష్లేషించే మీ స్పందన నా కవితకు అద్దం పట్ట్టీంది ధన్యవాదాలు సర్.

      Delete
  3. విమర్శకు తావేలేదు చాలా బాగుంది.

    ReplyDelete
  4. prati padamulo meeru edurkonna maanasika samgarshana kanipistundi, (nenu mee maatallo koodaa idi gamanistuntaanu) chaalaa bagaa raasaaru Medam.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ, నీకు నేనూ,నా అక్షరమూ తెలుసు, నీ అభిమానానికి థాంక్స్.

      Delete
  5. మీ సుమాహార అల్లికలో ఇతివృత్తాన్ని సున్నితంగా కూర్చారు

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

      Delete
    2. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

      Delete