ఎప్పుడో కలసిన వైనం
తలపుల తలుపు తెరిస్తే నీవే ప్రత్యక్షం
గతం గనులు తవ్వితే నీవే నిధిలా నిక్షిప్తం
గుండె లోతుల్లో నీ తలపు మధురిమ
హృదయ తంత్రుల్లో నీ వలపు సరిగమ
నా ఊహల్లో విహరిస్తున్తావు
నా ఊపిరిలో సంచరిస్తుంటావు
తలపుల తలుపు తడతావు
గుండె గుడిగంటలు కోడతావు
చెలికాడనే అంటావు చెంత చేరవు
జతకాడనే అంటావు జాడ చూపవు
మరిచిపోఇనవే గుర్తు చేస్తావు
మరుగున పడినవి చర్చిస్తావు
విలుకానిలా వేటాడతావు
చెలికానిలా మాటాడతావు
ఎదలోనే ఉన్నాను వెతుకు అన్నావు
మదిలోనే ఉన్నాను బ్రతుకు అన్నావు
పగలంతా నా అడుగులకు తడబాటువై
రేయంతా నా పలవరింతల అలవాటువై
దోసిట్లో నీళ్ళలా జారిపోతావు
వాకిట్లో నీడలా పారిపోతావు
కోకిలా అన్నావా అనే ఉంటావు
కోవెలలో వున్నావా వుండే ఉంటావు
వీడని నా పెదవినీ ముడివడిన నా భ్రుకుటినీ
కరువడిన నా భాషనీ మరుగడిన నా ధ్యాసనీ పరిహసిస్తావు
జ్ఞాపకాల దొంతరలు కదులుతున్నై
కొన్ని కలలా కొన్ని కన్నీళ్ళలా
ఎద సోదలలో సన్నని మెలిక
మది కథలలో చీకటి కదలిక
తెలిసింది.
నీవు గత జన్మస్మృతివి
మరోజన్మకు శ్రుతివి
ఈ జన్మకు మదినిండిన "మరీచికవి".
చాలా అందమైన స్మృతి
ReplyDeleteదీదీ
థాంక్స్ జానీ,
Deleteమేడం గారూ...
ReplyDeleteమీరు కూడా మా సెగ్మెంట్ లోకి వచ్చేస్తే
ఇక మేం తట్టా బుట్టా సర్డుకోవాల్సిందే...
ఇంత అద్భుతంగా ప్రేమ కవిత్వం కూడా
మీరు రాయగలరని ఊహిస్తే ఒట్టు.
నచ్చని లైన్లు ఒక్కటి కూడా లేకపోయినా...
మరింత గా నచ్చిన...
దోసిట్లో నీళ్ళలా జారిపోతావు
వాకిట్లో నీడలా పారిపోతావు...
కోకిలా అన్నావా అనే ఉంటావు
కోవెలలో వున్నావా వుండే ఉంటావు...
మనఃపూర్వక అభినందనలతో...
This comment has been removed by the author.
Deleteసర్, మీకు నా కవిత నచ్చినందుకు చాలా సంతోషం,
Deleteమీరు కూడా చాలా బాగా రాస్తారు.
ఇది రెండేళ్ళక్రితం ఆంద్రభూమి వీక్లీ లో అచ్చయింది.
మనస్పూర్తిగా ప్రశంసించిన మీకు నా క్రుతజ్ఞతలు.
ReplyDeleteభావ పరంపర,పద గుంఫన బాగున్నవి .అభినందనలు.
సర్, నమస్తే,మీ అభినందనలకు నా ధన్యవాదాలు.
Deletecan't hold enjoying the magical...
ReplyDelete... కోకిలా అన్నావా అనే ఉంటావు...
... కోవెలలో వున్నావా వుండే ఉంటావు...
just pure magic...
kudos again ma'm...
అందమైన పదాలూ, అందమైన ఉపమానాలూ,
ReplyDeleteకవిత చాలా బాగుంది మేడం.
లక్ష్మీ, థాంక్స్.
Deleteశృతి లయలతో సొంపుగా ఉంది , మీ కవితా స్మృతి !
ReplyDeleteశత హొయల తో అవుతూంది మీ కవిత , విస్తృతి !
ఒత్తులు , దీర్ఘాల ను కూడా సరిచేస్తూ ,
హత్తుకునే లా రాశారు , కవితా హృదయానికి !
సుదాకర్ గారికి, నమస్తే,
Deleteకవితా హృదయాన్ని హత్తుకున్న నా కవిత ధన్యమైంది.
మీ స్పందనకు ధన్యవాదాలు.
Wowww..super gaa undi fathimaa gaaru:):)
ReplyDeleteఎక్కడో ఎప్పుడో చూసినట్లుంది
ReplyDeleteగుండె లోతుల్లో, హృదయ తంత్రుల్లో ....
ఊహల్లో విహరిస్తూ ఊపిరిలో సంచరిస్తూ ....
చెలికాడనే జతకాడనే అంటావు ....
విలుకానిలా, చెలికానిలా ....
పగలంతా అడుగుల తడబాటువై రేయంతా పలవరింతల అలవాటువై ....
కదులుతున్న జ్ఞాపకాల దొంతరలు ....
కొన్ని కలలా, కొన్ని కన్నీళ్ళలా ....
ఎద సోదలలో మెలికలా మది కథలలో చీకటి కదలికలా ....
ఈ జన్మకు మదినిండిన "మరీచికవి" .... మరీచిక లా
ఎండమావుల్ని వేటాడుతున్నట్లుంది భావాల లోతుల్ని చూడాలనే
సాహసం చెయ్యలేక .... అభినందనలు కవయిత్రి గారికి అని సరిపెట్టుకుంటున్నాను.
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!
మాటలు రానంత బాగా రాశారు మీరజ్ ,భావుకత చాలా బాగుంది .
ReplyDeleteఫాతీమా గారూ !
ReplyDeleteనిజం చెప్పాలంటే ఈ పది రోజులు సాహిత్యానికి దూరమయి,
చాలా 'మిస్' అయ్యాననిపిస్తుంది. అలా కళ్ళు మూసుకుని తెరిచేలోగా ......
ఎన్ని కవితలు మీ కలం నుండి. ఏమిటీ అనూహ్యమైన కవితా ధార.
"తలపుల తలుపు తెరిస్తే నీవే ప్రత్యక్షం
గతం గనులు తవ్వితే నీవే నిధిలా నిక్షిప్తం"
మనసు ప్రశాంతంగా ఉంది మీ మాటలు చదివాక
మీ భావనల పరంపరనే మీకు "అల్లా" ఇచ్చిన నిధి.
"గుండె లోతుల్లో నీ తలపు మధురిమ
హృదయ తంత్రుల్లో నీ వలపు సరిగమ"
వలపు సరిగమలను రాగ మాలికలుగా అల్లి ,
అందాన్ని జత చేసారు రాసిన ప్రతి పంక్తికి.
అందుకోండి నా అభినందనల చందనాలు.
* శ్రీపాద