Pages

Wednesday 5 March 2014

ఇప్పుడు చేయాల్సిన పని.

    






   ఇప్పుడు  చేయాల్సిన  పని. 

    సంఘాన్ని  నిద్రలేపి,
    సమరశంఖాన్ని పూరించాలిప్పుడు. 

    అనైతిక  ముళ్ళకంచె నుండి,
    యువతను బైటికి  లాగాలిప్పుడు. 

    కుక్కలెక్కకుండా  గద్దెకు,
    కాపలా కాయాలిప్పుడు. 

    వాగ్దానాల  సుడిగుండంలో  చిక్కుకోకుండా,
    ఓటు సునామీతో పోటెత్తాలిప్పుడు. 

    పంటంతా తిన్న పందికోక్కులను,  
    కలుగులోకి తరమాలిప్పుడు. 

    ఊళ్లనూ,వాడలనూ, రక్తపింజర్లకు అప్పగించి,
    అహింసా వాదపు అత్తరు పూసుకుంటే.....,

    యుద్ధం చేయనని  నిద్రకుపక్రమిస్తే,
    అందుని  చేతికిచ్చిన  దీపమే భవిత ఎప్పుడూ...., 





4 comments:

  1. సంఘం నిద్రలేచి సమరశంఖం పూరించే
    మార్గాలను అన్వేషించాలిప్పుడు .....
    అనైతికత్వం ముళ్ళకంచెలో ఇరుక్కునున్న యువతను బైటికి లాగి
    కుక్కలెక్కకుండా గద్దెను కాపాడి, వాగ్దానాల వరదలో కొట్టుకుపోకుండా
    పంట పందికోక్కుల బారి కాకుండా పురోగమించేందుకు
    మార్గాలను అన్వేషించాలిప్పుడు .....
    చాలా చాలా బాగుంది సందర్భోచితం గా
    అభినందనలు కవయిత్రి గారు! శుభారుణోదయం!!

    ReplyDelete
  2. చేతిలో డబ్బులు,గ్లాసులో సారా పడగానే వాళ్ళేంచేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి మీరజ్.పల్లెటూర్లో నాలుగు రోజుల్లో ఇక వాసనలే వాసనలు ,మేము పీల్చలేక....చూడలేక,మీరన్నట్లు అంధుడి చేతిలో దీపమే అయితే మిగిలేది వేదన ,రోదనే.

    ReplyDelete
  3. "అనైతిక ముళ్ళకంచె నుండి,
    యువతను బైటికి లాగాలిప్పుడు. "

    ఇదే కదా మనం చూడాలనుకున్న నిజం.
    భహుశా అప్పుడైనా ఓ నవలోకాన్ని చూడగలమేమో .
    మరో నూతన శకాన్ని చెక్కగలం అనే నమ్మకం స్తిరపడుతుంది.
    చాలా బాగా చెప్పారు మీలో సుడులు తిరుగుతున్న ఆశాభావాలని.
    అభినందనీయులు మీరు ఫాతిమా గారూ .
    *** శ్రీపాద

    ReplyDelete