Pages

Saturday, 12 April 2014

శ్వాసకై...,


    శ్వాసకై...,

    మాటలు పోగొట్టుకున్న బాష,
    రాతలకే  అంకితమైంది,

    మౌనాన్ని వీడని గుండె ఘోష,
    గొంతులో తచ్చాడుతుంది,

    మది  చేస్తున్న తప్పుల తమాషా,
    విధికి  తాంబూలమవుతుంది,

    ఎటూ  తేల్చుకోలేని బంధం,
    మేఘాల మాటున అరుణ తేజమైంది.  

    నిదురలేని  రాత్రులూ...,
    పనిచేయలేని పగళ్ళూ...,

    కళ్ళుమూసుకున్నా కనిపించే,
    ఆత్మీయ ఆనవాళ్ళూ...,

    అలిగిన అతిధివై సుదూరాన నీవూ...,
    అలసిన కనులతో కాలాన్ని కొలుస్తూ నేనూ...,

    జీవశ్చవాలమై..,శిలాజాలమై...,
    ఒకరినొకరం  మరచిపోవడమనే, 
    మరణాన్ని ఆహ్వానిస్తూ...,


14 comments:

 1. చిన్న విభేదాలు ఒక్కొక్కసారి పెద్దవైపోయి ,ఎవరికివాళ్ళు ఎదుటివాళ్ళే పలకరించాలనే ఆలోచనతో బంగారంలాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటారు.మీరజ్ మీ ప్రతి వాక్యం అద్భుతం.

  ReplyDelete
  Replies
  1. దేవీ, నిజమే చిన్ని చిన్ని పంతాలు ఓక్కోసారి జీవితాన్నే అంతంచేస్తాయి,ఇది చెప్పటమే ఈకవితా ఉద్దేస్యం.
   మీ స్పందనకు నా ధన్యవాదాలు.

   Delete
 2. Akka nuvvu rasina prathi aksharam oka niggantuvuku ankurarpanam

  ReplyDelete
  Replies
  1. సుదా, ఎంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చావ్,
   నువ్వు చదవటం చాలా సంతోషంగా ఉంది.

   Delete

 3. గొంతు మూగబోయినపుడు
  గుండె పలికే భావాలు ఎప్పుడూ
  నిండు నిజాలనే బహిర్గతం చేస్తాయేమో !

  అదేమిటో ఈ మౌనం.......
  అన్ని ఆలోచనలకూ తావిస్తుంది .
  అందుకే అన్ని తీర్పులనూ 'విధివ్రాత' అని సరిపుచ్చుకోవడం అలవాటుతో పాటు ఆనవాయితీ చేసుకున్నాం

  మేఘం ఎంత నల్లని గాంభీర్యాన్ని కనబరిచినా ఎప్పుడో ఒకప్పుడు కరుగక తప్పదు.
  అప్పుడు కురిసే చిరుజల్లులు గుండె తపనను ఓదార్చుతాయని నా భావన.

  " జీవశ్చవాలమై..,శిలాజాలమై...,
  ఒకరినొకరం మరచిపోవడమనే,
  మరణాన్ని ఆహ్వానిస్తూ..., "

  ఎందుకలా గుండెను మరింత బరువుగా చేసారు చివరన .
  అందుకే అంటారు ఫాతిమా గారూ ఆత్మీయత ఆనవాళ్ళు మననెప్పుడు వెన్నంటి ఉంటాయని ... ప్రేమతో వెన్ను తడుతూనే మనతో నడుస్తాయని..

  మందారమాల లాంటి కవితనల్లి అలరించారు అందరినీనూ.
  ఆభినందనలు ఫాతిమా గారూ.

  *** శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. శ్రీపాద గారూ, నా ప్రతి కవిత వెనుకా ఉన్న మీ అభిప్రాయం ఆత్రుతగా చూస్తాను నేను, ఎందుకంటే నావితార్దం అందులో కనిపిస్తుంది.
   ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 4. మేడంగారూ,(సోదరీ) మీ కవితలు చదవటం ఒక వ్యసనం అయిపోయింది నాకు.
  అక్షరాలల్తో అలరించటం, అదిలించటమూ మీకే తెలుసు.
  ఈ కవిత చదివితే ఎందుకో అనాలోచితం గా అలక బూని తేరుకున్నట్లు అనిపిస్తుంది.
  స్త్రీ సమస్యలనే కాదు స్త్రీ హృదయాన్నీ తెల్లకాగితం పై తేటతెల్లం చేయగల దిట్ట మీరు.(పొగడ్త కాదు సుమా)
  తెలుగు బాషమీద మీకున్న పట్టు చాలా గొప్పది.
  నిదురలేని రాత్రులూ...,
  పనిచేయలేని పగళ్ళూ...,
  ఇలాంటి పదాలు మనస్సుకు హత్తుకుంటాయి.
  ఇకపోతే పేరు చెప్ప మన్నారు నా పేరు, ప్రభు

  ReplyDelete
  Replies
  1. ప్రభు గారూ, చదువనే వ్యసనం చాలా మంచిది,
   ఇకపోతే స్త్రీల సంస్యల మీద ఓ పెద్ద గ్రందం రాసినా సరిపోదూ, వేదన తీరదూ, అది స్త్రీగా నా భాద్యత అనుకుంటాను, నా స్పందన అంతే...,
   సదా మీ అభిప్రాయాన్ని ఆహ్వానిస్తూ...సోదరి మెరాజ్

   Delete

 5. మీ కవితలో ప్రతి లైను అత్యద్భుతం .

  " మది చేస్తున్న తప్పుల తమాషా,
  విధికి తాంబూలమవుతుంది,"

  మనిషి తన యిష్టం వచ్చినట్లు తాను చేసుకుపోతూ , అంతు తెలియని ఆ శక్తిమీద ( విధి ) నిందలు వేస్తూ , మిగిలిన ఆ శేష జీవనాన్ని గడిపేస్తుంటాడు , మున్ముందు మంచి రోజులు రాకుండా పోతాయా అన్న ఆశతోనే తన శ్వాసను తీసుకొని వదుల్తుంటాడు .

  ReplyDelete
 6. శర్మ గారూ, బహు కాలదర్శనం ఎలాఉన్నారు?
  మీ స్పందనకు నా ధన్యవాదాలు.

  ReplyDelete
 7. akka nee swasalo niduraleni rathrulu chalaunnai kani panicheyaleni pagallu matram poorthiga levu am i correct kadu nee chinna

  ReplyDelete
 8. చిన్నా,(సుదా) నిజమే పనిచేయని పగళ్ళ్ళు అరుదే..,
  థాంక్స్ చదివినందుకు

  ReplyDelete