Pages

Thursday, 3 April 2014

నాతో ప్రవహిస్తూ..,

       నాతో ప్రవహిస్తూ..,

    ఆలోచనలు ఆవిరై  దు:ఖాన్ని గుర్తించని వాడినై,
    ఎడారిప్రస్తానములో ఎండమావులతో  స్నేహిస్తూ,

    స్వప్నారాదికుడనై... ,మౌనరోదితుడనై ఉన్నవేళ,
    సన్నజాజితీగలా...,వెన్నెల వెల్లువలా..,

    నన్ను సృజించిన ఆమె,

    మెల్ల,మెల్లగా నాలోకి చూస్తూ, లాలన ఒంపుతూ,
    పగిలిన జీవితాన్నీ, తెగిన కలలనూ అతికిస్తూ,

    నన్నో వీణియను చేసి  సృతించాలని  చూస్తుంది,
    తన  మదిలో పాకే సజీవ స్పర్శను నా ఎదపై మీటి,

    ఎన్నో జీవితానుభవాలను నా ముందు రాశిగా పోసి, 
    తనను తాను  ఆవిష్కరించుకున్న,

    అద్వైత మంత్రం ఆమె. 

    నా కళ్లలో పత్తి పువ్వులా, నా వడిలో పసిపిల్లలా,
    ఒదిగిపోతూనే, నన్ను బంధించిన వెన్నెల పంజరం,

    హితంగా,సన్నిహితంగా నను చేరదీసిన,
    ప్రేయసీ... ,ప్రియబాంధవీ... ఆమే.   


12 comments:

 1. నా జీవంలో జవం నింపి
  నా కలలనూ కలతలనూ
  తన కళ్ళలో దోపుకుని
  నా కన్నీళ్లు దోచి
  నా దోసిట విరిజల్లుల
  మరు మల్లెల
  మరోలోకానికి సహవాసియై
  ఒదార్పియై
  ఎడారిలో గోదారియై
  నాదారిలో తన పాదాలు
  నన్ను పద పదమని
  ఎద రొదలకిక సెలవని
  కలవని అనుకున్నా
  కలని కాదుకలనని
  కలువ రెక్కలు తొడిగి
  మది చలువ పందిళ్ళు వేసి
  వందేళ్ళూ నాబందీవై
  బంధించిన
  అనురాగ బంధమా
  కలైనా నిజమైనా
  నాకిదే జీవితం సుమా !!

  ReplyDelete
  Replies
  1. తమ్ముడూ, మీ స్పందన చాలా బాగుంది.

   Delete
 2. ఒక స్త్రీ సహజ స్వభావం గూర్చి చాలా బాగా చెప్పారు మీరజ్....

  ReplyDelete
  Replies
  1. దేవీ,ధన్యవాదాలు.

   Delete
 3. మేడం నమస్కారం,
  మీ కవిత ఓ యువకునిలో ప్రేమలో ఉన్న బాల్యదశను(ఇలా చెప్పకూడదో..ఏమో, ముందే చెప్పాను నేను కవిని కానూ అని)
  తెలియజేస్తుంది, తనను గైడ్ చేసిన ఆ స్త్రీ మూర్తిని సృజించిన అంటే సృష్టించిన అని చెప్పటములోనే ఆమె పై ఆయనకి ఉన్న ప్రేమ తెల్స్తుంది. ఇది కల్పితమే కావచ్చు కానీ హృదయాన్ని పలకరిస్తుంది.
  ఓకే బై మరో కవితలో కలుస్తాను. K

  ReplyDelete
  Replies
  1. మీ స్పందన బాగుంది, సాహిత్యం మీద పట్టు ఉంది మీకు,
   మీరు చెప్పి ఉంటే బాగుండేది.

   Delete
 4. అద్వైత మంత్రం ఆమె

  NICE EXPRESSION

  ReplyDelete

 5. "మెల్ల,మెల్లగా నాలోకి చూస్తూ, లాలన ఒంపుతూ,
  పగిలిన జీవితాన్నీ, తెగిన కలలనూ అతికిస్తూ,"

  ఆరాటపడ్డ మనసుకి అపురూపంగా దొరికిందామె

  "హితంగా,సన్నిహితంగా నను చేరదీసిన,
  ప్రేయసీ... ,ప్రియబాంధవీ... ఆమే. "

  అందుకే అయింది ప్రియ బంధవీ ఆమె . చివరివరకూ చదివాక
  ఓ నిండైన శ్వాస తీసుకున్నా...... నమ్మండి !
  బాగా అమిరాయి మీ భావనలు.

  * శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. శ్రీపాద గారూ, నా కవితలన్నిటికీ ఒకేసారి స్పందించారు, చాలా సంతోషం,
   నా శైలి మీకు నచ్చునందుకు ధన్యవాదాలు.

   Delete
 6. ఆవిరైన ఆలోచనలతో ఎడారిప్రస్తానం ఎండమావులతో స్నేహం .... స్వప్నారాదికుడ్నై.... , మౌనరోదితుడ్నై,
  మెల్ల, మెల్లగా నాలోకి చూస్తూ, లాలన ఒంపుతూ, పగిలిన జీవితాన్నీ, తెగిన కలలనూ అతికిస్తూ, నన్నో వీణియను చేసి నా ఎదపై మీటుతూ,
  సన్నజాజితీగలా...,వెన్నెల వెల్లువలా.., నన్ను సృజించి,
  అనుభవాలను రాశిగా పోసి, ఆవిష్కరించుకున్న అద్వైత మంత్రం ....
  కళ్లలో పత్తి పువ్వులా, ఒడిలో పసిపిల్లలా, ఒదిగిపోతూ .... చేరదీసిన, ప్రేయసీ... ,ప్రియబాంధవీ... ఆమే.

  చాలా లోతైన భావన
  మళ్ళీ మళ్ళీ చదివించిపిస్తూ
  చాలా బాగుంది కవిత ..... అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

  ReplyDelete
  Replies
  1. సర్, నా భావాలను మెచ్చి అంతే ఉన్నతముగా స్పందించే మీకు నా ధన్యవాదాలు.

   Delete