Pages

Wednesday, 2 April 2014

స్తబ్దత చిట్లితే...

    
    స్తబ్దత  చిట్లితే...,

    నిశ్శబ్ద  శూన్యం లోనికి చూస్తూ,
    నిలువెత్తు  ధైన్యాన్ని మోస్తూ,

    కనురెప్పల  వెనుక  కొలువైన,
    కన్నీటినే  భాష్యం అడుగుతూ,

    హృదయాన విరిగిన అక్షరాలను,
    అతికించి లిఖించాలని చూస్తూ, 

    అలసిన మనస్సున హత్యగావించబడ్డ,
    నిర్జీవ  జ్ఞాపకాలను  తడుముతూ, 

    ఏదో రూపం.ఏదో మోహం  అంతరాన చేరి,
    దాచుకున్న కలల తుట్టెను రేపుతూ,

    నిన్నలో  నిలచిపోయిన  నన్ను ,
    నేటిలోకి  ఈడుస్తూ కళ్ళతోనే ప్రశ్నిస్తూ,

    తమస్సులో కూరుకున్న నాకళ్ళలో,
    తిరిగి  ఉషస్సును  మొలిపిస్తూ,

    స్తబ్ద  ప్రపంచాన్ని  బద్దలుచేస్తూ,
    శబ్ద భావమై  నీవు ఎదుట నిలిస్తే,

    అనంత ఆకాశాన  విహరించే  నీ కోసం,
    రెక్కలు రాని పక్షికూన విహారాన్నై..... ,14 comments:

 1. స్తబ్ద ప్రపంచాన్ని బద్దలుచేస్తూ,
  శబ్ద భావమై నీవు ఎదుట నిలిస్తే,
  భావం ఎంత బాగుంది,
  కానీ రెక్కలు వచ్చిన పక్షితో రాని పక్షికి పోటీ ఎంత వరకు సాధ్యం..........అందుకేనేమో ఈ స్తబ్ధత.

  ReplyDelete
  Replies
  1. దేవీ,పక్షికూనకు తెలియకనే ఎగరాలని చూస్తుంది,
   ఆ తర్వాత గగనములో ఎగిరే పెద్ద పక్షితో తనకు పోలిక లేదని గ్రహిస్తుంది, అప్పుడే ఈ స్తబ్దత

   Delete
 2. Replies
  1. కార్తిక్ థాంక్స్.

   Delete
 3. Replies
  1. సర్, ధన్యవాదాలు.

   Delete
 4. మేడం, నమస్కారం ,
  దీన్ని ప్రేమ కవిత అంటారో లేదో తెలీదు, ఈ వ్యద నిజమైతే ఆ గుండె ఇంకా మిగిలి ఉండదు.
  నిశబ్దంగా మనమున నాటిన ముళ్ళు తొలగించుకొవాలని,
  అంతరాన ఉన్న కలల్తుట్టెను రేపుతున్న సఖుని దూరంగా ఉంచలేకా, దగ్గరకాలేకా,
  ఆ మూగ గుండెపడే బాద ్ చెప్పలేము.నేను కవిని అయి ఉంటే మంచి జవాబు రాయగలిగే వాడిని.
  ఈ కవిత ఎన్నిసార్లు చదివినా తనివితీరలేదు.ఇంకా,ఇంకా రాయండి ,కానీ ఈ గుండెకు శాంతినిచ్చే కావ్యం ఒకటి రాయండి.
  సారీ, కొంచం అతిగా చెప్పినట్లున్నాను.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండీ

   Delete
 5. వేదనాభరిత ప్రేమకావ్యమాండి....బాగుంది

  ReplyDelete
  Replies
  1. పద్మగారూ,ధన్యవాదాలు.

   Delete


 6. 'నిన్నలో నిలచిపోయిన నన్ను ,
  నేటిలోకి ఈడుస్తూ కళ్ళతోనే ప్రశ్నిస్తూ,'

  విశ్లేషించి చూస్తే ఆ పదాల్లోని అర్ధం .. ఆర్ధ్రత
  అవగాహన చేసుకోగలం . ఆనందించగలం

  "స్తబ్ద ప్రపంచాన్ని బద్దలుచేస్తూ,
  శబ్ద భావమై నీవు ఎదుట నిలిస్తే,"

  మాటలు రాని పరిస్థితే కదా ఫాతిమా జి !
  పొర్లుతున్న మీ భావకతకు నా జోహార్లు.

  అపురూపంగా మలిచారు పదాలను.

  *శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. అపురూపంగా ఉంది నా కవిత అన్నారు,
   ఎదుటివారిని మనస్పూర్తికా ప్రశంసించటానికి ఎంతటి గొప్ప మనస్సు కావాలో నాకు తెలుసు.
   ధన్యవాదాలు శ్రీపాద గారు.

   Delete
 7. నిశ్శబ్దం గా ధైన్యాన్ని మోస్తూ, కొలువైన, కన్నీటిని భాష్యం అడుగుతూ,
  విరిగిన అక్షరాలను, అతికించి నిర్జీవ జ్ఞాపకాలను తడుముతూ, ఏదో రూపం.ఏదో మోహం అంతరాన చేరి, దాచుకున్న కలల తుట్టెను రేపుతుంటే,
  నిన్నలోని అస్తిత్వాన్ని, నేటిలోకి ఈడుస్తూ .... తమస్సులో కూరుకున్న కళ్ళలో, మొలిచిన ఉషస్సులా స్తబ్ద ప్రపంచాన్ని బద్ద లు చేస్తూ, శబ్ద భావమై ఒక ఓదార్పు ఎదురుగా నిలిస్తే, స్తబ్దత చిట్లి...,

  ఎంత బాగుంటుంది మనసుకున్న గొప్ప లక్షణమే అది
  మనిషిని ఎప్పుడూ ఏదో ఒక ఆశ ఏదో ఒక భావనలో ముంచి అందులో పడి శరీరమూ ఆత్మ హృదయము కొట్టుకునేలా చేస్తూ ....
  మీ భావనల్లో భావుకత్వ పరాకాష్టతను చూస్తున్నాను.
  అభినందనలు మెరాజ్ గారు!

  ReplyDelete
  Replies
  1. సర్, మీ స్పందంకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

   Delete