Pages

Friday 1 August 2014

రెప్పలు మూయని కల

   





   రెప్పలు  మూయని  కల 

    నిదురించే లోకాన్ని 
    నిషేదిస్తూ..,

    సగం రాసిన రాతల 
    కళ్ళును  కడిగి మేల్కొలుపుతూ ..,

    పదాలను కూర్చి 
    బొమ్మచేస్తూ ..,

    దాని పేరును 
    పెదాలతో  పలుకుతూ ..,

    ప్రేమో,స్పర్శో ...
    దేన్నో వెతుకతూ ...,

    శిరశ్చేదిత   దేహాన్నై..,

    ఈ కిటికీ  కటకటాలకు  
    తలవాల్చి ,

    కనులనుండి 
    రాలిన కలలను,

    తిరిగి రెప్పలపై 
    అద్దుకుంటూ  ...,

    తిరణాలలో తప్పిపోయిన  
    పసి పిల్లాడిలా...,

    అల్లాడే గుండెను  
    ఆశల తల్లినై  హత్తుకుంటూ..,

    నీవు తెచ్చే వసంతానికై ..
    దోసిలొడ్డుతూ ...,

    నేనిక్కడ  శిశిరాన్నై.., 
    నిరీక్షిస్తున్నా ...,  

7 comments:

  1. విశ్రాంతి కోరని అక్షరాలు రెప్పలు మూయని కలను విశదీకరిస్తున్నాయి

    ReplyDelete
    Replies
    1. నరసింహ గారూ, ధన్యవాదాలు.

      Delete
  2. అంతులేని వసంతాన్ని మదినిండా నింపుకుని నిరీక్షణపు వలయాల్ని తెరల్లా పర్చి వీ క్షణాల తీరాల్ని
    రాని వసంతానికి రాణివి నువ్వు మనో జ్ఞ్యానివి నువ్వు 

    ReplyDelete
    Replies
    1. జానీ..., చాలాకాలానికి బ్లాగ్ కి వచ్చావ్, సంతోషం.
      స్పందన చాలా బాగుంది, నిజమే మనో....భావాలకు దగ్గర కావాలనే నా ఆకాంక్ష కూడా.

      Delete
  3. అహ్మద్ గారూ, ధన్యవాదాలు.

    ReplyDelete
  4. రెప్పలు మూయని కల ఉంటుందా అనిపించి,
    రెప్పలు మూయకనే కలా కూడా అనిపించింది .
    బాగుంది .

    కొన్ని కొన్ని మార్పులు అవసరమనిపించింది .
    అవసరమనిపిస్తే మార్చవచ్చు . లేకుంటే లేదు .


    ప్రేమనో,స్పర్శనో ...
    మఱి దేన్నో వెతుకతూ ...,

    శిరశ్ఛేదిత దేహాన్నై..,
    ఈ కిటికీ కటకటాలకు తలవాల్చి ,

    తిరిగి రెప్పల సాయాన్ని
    అర్ధిస్తూ ...,

    ఆ అల్లాడే గుండెను
    ఆశల తల్లినై హత్తుకుంటూ..,

    ReplyDelete
  5. మీ అభిమానాన్ని సదా ఆశిస్తూ..., మీ బెహన్‌

    ReplyDelete