Pages

Wednesday 19 September 2012

మాలెక్కల కష్టాలు





మాలెక్కల  కష్టాలు 


ఈ మద్య మహిళలు చాలా అలర్ట్ గా ఉంటున్నారు అనటానికి నాకు జరిగిన సన్మానం (నిజం అనుకున్నారు కదా., కాసేపు అలానే అనుకోండి ) మీకు చెప్పుకుంటాను, నా గోడు మీరు తప్ప ఎవరు వింటారు చెప్పండీ..


పట్ట పగలే దొంగతనాలూ, దోపిడీలూ, జరుగుతున్నాయనీ ఒంటరి మహిళలే టార్గెట్ అవుతున్నారనీ ,, చానెళ్ళు, పత్రికలూ రకరకాలుగా.. ఎక్కడెక్కడ ఎవరు బలియిపోయారో రోజంతా ఊదరగొడుతుంటే, మరీ టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని నిద్రపోతే కలలో కూడా దొంగలు కనిపించటం లేదని పోలీసులు కూడా తమవంతుగా కాలనీల మీద పడి బూరలో(లౌడ్ స్పీకర్ ) అరుస్తూ తిరిగి మహిళలను అప్రమత్తంగా ఉండమని చెప్పేసి తమ ఖాకీకి న్యాయం చేస్తున్నారు.

ఏలికలకు అర్జెంటుగా ఓట్లు అవసరమోచ్చేసికాబోలు ప్రజానీకం గుర్తొచ్చి పనిలేని పంతుళ్ళమైన మమ్ము తోలేశారు ఊరిమీద. ఓ మిట్టమద్యాహ్నం నేను నా సహోద్యోగులు భాస్కర్, శేఖర్, ఉషా ,గార్లతో కలసి ఆరుగురం జనాబా లెక్కలకి బయలుదేరాను. జాతీయ రహదారికి దూరంగా ఉన్న ఓ చిన్ని కాలనీకి వెళ్లాం, ఎండ మండుతూంది, నెత్తిమీద టోపీలు, కళ్ళకు నల్ల కళ్ళజోళ్ళూ , మూతులకు రుమాళ్ళూ, భుజాలకు వేలాడే సంచులూ, చంకన రికార్డ్ బుక్కులూ, విచిత్ర వేషధారణలో మొదటిబహుమతి విజేతల్లా ఉన్న మేము ఇద్దరిద్దరం గా విడిపోయి కాలనీ వీధులు పంచుకున్నాము (మేమంతే లెండి )


నేను ఉషా ఓ ఇంటి తలుపు తట్టాము తెరుచుకోలేదు.. కొంచెం గట్ట్టిగా టక్..టక్.. అంటే తలుపు తెరుచుకొంది, ఆడ ఘటోద్గజుడిలా ఓ ఆవిడ మమ్మలి కొరకొరా చూస్తూ, అబ్బా ప్రశాంతంగా ఉండనివ్వరు కదా, ఆ దిక్కుమాలిన సబ్బులూ, పాచిపోయిన బిస్కట్లూ మాకొద్దు వెళ్ళండి అంటూ మొఖం మీద తలుపు భళ్లుమని వేసింది.

అమ్మో ..చచ్చాను బాబోయ్... మాఉష కేకతో నేను షాక్ నుండి తేరుకున్నాను. పాపం మా ఉషకొంచం అడ్వాన్ అయిపోయి ముఖం లోపల పెట్టినట్లుంది, ముక్కు కాస్తా పచ్చడి అయ్యినంత పనయ్యింది.


ఈసారి తలుపు గట్టిగా కొట్టాను. ఇందాకటి ఇల్లాలే తలుపు తీసి "ఏంటి ఇంకావెళ్ళలేదా మీరు?" హూంకరించింది. లేదండీ, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం " అంటూ కొంచం చనువుగా దూరబోయాను, ఊహు.. ఆమె ఇంచి కూడా కదలకుండా అడ్డుగా నుల్చుంది, ఇక చేసేదేమీ లేక గడప బైటే ఓ కాలు మడతపెట్టి నుల్చుని రికార్డు తీసి వివరాలు రాసుకోనేందుకు సిద్దమై తలెత్తాను. ఆమె తన ఏడేళ్ళ కొడుకు చెవిలో ఏమో చెప్పటం చూసి అబ్బే ఇప్పుడు కూల్ డ్రింకులు లాంటివి ఏమి వద్దండీ... మొఖమాటంగా నవ్వుతూ... మీరు కాసేపు మాతో సహకరించండి చాలు అన్నాను, తలవాకిలి వైపు చూస్తున్న ఆమెను చూసి.

అలాగే కానీ మా ఇంట్లో కొత్తగా ఎవరూ పుట్ట్టలేదు, ఉన్నవారు పోరు కూడానూ అన్నది పక్క గదివైపు చూస్తూ .., అక్కడినుండి సన్నగా దగ్గు వినిపిస్తూనే ఉంది నేను వచ్చినప్పటి నుండి.(ఈమె గారి ఆదరణ వెనుక ఆ గది వేదన నేను అంచనా వేయగలను). నేను వివరాలు రాసుకొవటం పూర్తి కాగానే ఉష కోసం చూసాను, తను లేదు బహుశా ముక్కుపట్టుకొని ఏ చెట్టుకిందో కూర్చుని ఉంటుంది అనుకున్నా, విపరీతంగా దాహం వేస్తుంది. "ఏమండీకాస్త నీళ్ళు ఇస్తారా" అని చనువుగా లోపలికి ఓ అడుగేసాను ఆమె లోపలికెల్లటం చూసి. ఆమె ఎదురొచ్చి"ఆహా.. ఎందుకివ్వనూ! నేను నీళ్ళ కోసం వెళ్తాను ఇదిగో నువ్విలా నా వెనుకే వచ్చి ఏ మందో మాకో చల్లుతావు నాకు తెలీదా "అంటూ తన పిడికిటదాచుకున్న కారాన్ని శపిస్తున్న ఋషిలా నా ముఖాన కొట్టింది.

"అయ్యో బాబో.. చచ్చాన్రో ఏమిటీ అన్యాయం అంటూ మండుతున్న కళ్ళు తెరవటానికి ప్రత్నిస్తూ, ఉషా ఉషా, అంటూ  కేకలు వేస్తున్న నన్ను ఒక్క గుంజు గుంజి బట్టల మూటలా గదిలో ఓ మూలకి విసిరేసి ఓ చిన్ని చున్నీ నా నోట్లో కుక్కింది. అరిచావో చంపుతాను పోలీసులోచ్చే వచ్చేవరకూ లోపల నోరు మూసుక్కూచోని తగలడు అంటూ జాంబవంతిలా బయటికి జంపు చేసిందా ఇల్లాలు. నా చేతిలోని రిజిస్టర్లు, సెల్లు ఫోను అక్కడే పడిపోయాయి.

************
ఇంతలో అలికిడయ్యింది.. కళ్ళు తుడుచుకుని చూసాను, ఆమె కొడుకు హిడింబి లాంటి మరో ఇద్దరు ఆడవాళ్ళను వెంటపెట్టుకొని వచ్చాడు." చూశావా వదినా ఇది ఎంత నంగనాచిలా వచ్చింది అనుకున్నారూ .. జనాబా లెక్కలు దీని కాష్టంలో లెక్కలు అంటూ, నేను తెలివైనదాన్ని కాబట్టి సరిపోయిందిగానీ, లేకుంటే అమ్మో, అమ్మో".. చేతులు కళ్ళూ తిప్పుతూ చెప్తుంది నన్ను పట్టుకున్నావిడ. ఆ వచ్చిన వాళ్ళలో ఒకామె "అయ్యో నువ్వు మీ బాబుని పంపుతూనే వచ్చేవాళ్ళమే తల్లీ..అంటూ చెప్పుకుపోతూఉంది (వాడిని పంపింది కూల్ డ్రింకులకి అనుకున్న నాబుద్ధి  ఎంత గొప్పదో మీకీపాటికి అర్దమై ఉంటుంది ) ఏమైందో తెలుసా? మా గేటు దగ్గర ఓ ఆడమనిషి దీని వయస్సు (ఏంటో బొత్తిగా మర్యాద లేదు వీళ్ళకి, అయినా నేనిప్పుడు పంతులమ్మని కాదు కదా) ఉంటుంది మూతికి బట్ట కట్టుకొని ముఖం గుర్తు పట్టకుండా ఇంట్లో దూరటానికి తచ్చాడుతుంది, దాన్ని పట్టి రూంలో వేసి పోలిసులకి ఫోన్ చేస్తున్నాము మీ వాడు వచ్చాడు." వివరించింది. నా ప్రాణం యెగిరి పోయింది అంటే వాళ్ళు ఉషని కూడా పట్టి లోపలవేశారన్నమాట. కోపంతో నా పళ్ళు కొరికాను నోట్లో చున్నీ ఉంది కదా వారికి వినిపించలేదు. మాతో వచ్చిన ఈ మగ టీచర్లు ఏమయ్యారో? ఏముంది ఏ టీ కొట్టు దగ్గరో బైటాయించి సిగరెట్లు ఊదుతూ ఉంటారు.

ఈ వీర వనితలు నన్ను ఎలా పట్టుకున్నదీ, ఇంకా నాలాంటి దొంగలు (అయ్యో!) ఎక్కడెక్కడ తిరుగు తున్నదీ.. టి.వి.లో ఏచానల్లో ఎప్పుడెప్పుడు చూసారో మాట్లాడుకుంటూ, నేనున్న గది తలుపు బయటినుండి గడియ పెడుతుండగా నా సెల్ మోగింది. నాకు ప్రాణం లేచి వచ్చింది మా స్టాఫ్ చేసి ఉంటారు అనుకోని. తలుపు గడియపెడుతున్నావిడ గభాలున గెంతి నా ఫోను లిఫ్ట్ చేసి రౌద్రరూపంతో. " ఎరా దొంగ రాస్కెల్ ఏ ఇంట్లో ఉన్నావ్ పని అయిపోయిందా అని అడుగుతున్నావా? ఉండు నిన్ను కూడా పట్టుకొని.." ఊగిపోతుందా లావుపాటి శాల్తీ. ఆయాసంతో మాటలు రావట్లేదావిడకి.


ఆముగ్గురిలో ఇంకో ఆవిడ పెద్ద గొంతుతో "అయ్యో, అయ్యో.. అంటే వీళ్ళు పెద్ద గ్యాంగే వచ్చారన్న మాట, చుప్పనాతిది ఎలా చూస్తుందో చూడు దొంగమొఖం వేసుకుని. " అంటూ నా తల గోడకేసి కొట్టింది. ఏంటో మా వారేమో బంగారం నువ్వు బాగుంటావురా బొమ్మలా అంటారు. మా కోలీగ్సేమో ఇంత అమాయయకంగా ఉంటె ఎలా  మేడం అంటారు. మరి వీళ్ళకి దొంగ మొఖం ఎలా అనిపించిందో... అంతా నా రాత లెండి. బిక్కు బిక్కుమంటూ నిల్చున్నాను ఇంకా నా మీద ఏమి ప్రయోగాలు చేస్తారో ఏమో అనుకుంటూ.

******
నా బ్యాగులోని పత్రాలు లాక్కుని చూశారా ఇవి నకిలీవి అంటూ ధ్రువీకరించారు ఆ అతితెలివి మహిళలు. ఈ టి.వి.చానళ్ళు క్రైం గూర్చి ఊదరగొట్టి , అరిచి గీపెట్టి, ఈ మహిళారత్నాలకి సొంత ఆలోచన లేకుండా చేశారు దేవుడా ఇప్పుడేది దారి...నాలో నేను గొణుక్కుంటూ ఉన్నాను. ఇంతలో నా గది (నా గదేంటి నా బొందా ) తెరుచుకుంది . హి..హి ..అంటూ ఇంటి ఇల్లాలు వచ్చింది. కళ్ళు మండుతున్నా ఎలాగో చూసాను ఆమె వెనక మా హెడ్ మాస్టర్ గారు, మాతో వచ్చిన టీచర్లు,ఉష, పోలీసు ఇనస్పెక్టర్ కారం పడ్డ నా కళ్ళకి మసగ్గా కనిపించారు , ప్రాణం లేచి వచ్చింది. మా వాళ్ళను చూస్తూనే.

"మేడం ఆర్ యు ఓకే, " అన్నారు పోలీసు ఇనస్పెక్టర్ . నాట్ ఓకే.... అని అరవాలనిపించి, సభ్యత కాదని ఓ వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నా. ఇంటావిడ వారితో పాటు నాకు కాఫీ ఇస్తూ నా చేతులు (మనసులో కాళ్లు అనుకుందో ఏమో) పట్టుకొని " ఏంటో అందరూ భయపెడుతుంటే అలా చేసాను కానీ ఈ మేడం ముఖం అలా (ఎలా?) అనిపిచలేదు ..హి ..హి ... " అమ్మయ్య నా ఒరిజినల్ కామెంట్ నాకు దొరికిందోచ్ ..

"సారీ మేడం మా కాలనీ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టినట్లున్నారు.. హి హీ . . మీరు కొంచం అలర్ట్ గా ఉండాల్సింది " అన్నారు ఇనస్పెక్టర్.

ఉష గొంతు చించుకున్నట్లు అరిచింది మేము అలర్ట్ గా ఉండటం కాదు మీరు వీళ్ళని మరీ అంత అలర్ట్ గా చేసి నట్లున్నారు అందుకే మీ డ్యూటి కూడా వీళ్ళే చేస్తున్నారు . "

శేఖర్ సార్ ఏరి అడిగాను మిగతా వారిని " వెనక వీదిలో ఓ ఇంటి ఇల్లాలు అతన్నిదొంగా కాదా పరీక్షించేదుకు కుక్కని వదిలిందట. అది అతని పిక్క పీకి హాస్పిటల్ పాలు చేసింది . తనదైన శైలిలో నింపాదిగా చెప్పారు మా హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు.
*****
మొత్తం మీద మేమంతా ఇంటిదారి పట్టాం, జనాబాలో మేము తగ్గనందుకు సంతోషిస్తూ..ఇలాంటి పనులకు ఉపాధ్యాయులనే ఎందుకు నియమిస్తారా అనుకొనేదాన్ని ఇప్పుడు అర్దమైంది. మేము కూడా పాఠాలు నేర్చుకోవాలి కదా జీవిత పాఠాలు ఇలాగే ఉంటాయి మరి.




































40 comments:

  1. లెక్కల కష్టాలు :) :) :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సర్ , కథ చదివిన మీకు.

      Delete
  2. :-))....:-))....
    హాస్యపు జల్లు కురిపించారు.
    చాలా బాగుంది
    మెరాజ్ గారూ!
    కాకపొతే ఈ మధ్య ఇలా ఇంటికి వచ్చి మోసం చేయడంలో
    మహిళా నేరస్తులే ఎక్కువగా ఉంటున్నారని కొన్ని రాష్ట్రాల
    గణాంకాలు చెప్తున్నాయి...
    అందుచేత మహిళలూ! తస్మాత్ జాగ్రత్త...:-)
    శ్రీ

    ReplyDelete
    Replies

    1. శ్రీ గారూ, కథ నచ్చినందుకు సంతోషం.
      నిజమే మహిళా నేరస్తుల సంఖ్య పెరిగింది. అందుకే మహిళల జాగ్రత్త కుడా పెరిగింది.

      Delete
  3. జనాభా లెక్కలు, ఎలక్షన్ విధులు..ఇలాంటి కష్టాలన్నీ టీచర్లకే...మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించే వారి వైఖరి ఒక్కోసారి విపరీతాలకు దారి తీస్తుంది. మీరు సరదాగా వ్రాసినా 'అయ్యో' అనిపించింది. చిత్రం చాలా బావుంది మెరాజ్ గారు..

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారూ, కథ చదివిన మీకు ధన్యవాదాలు. మీరన్నట్లు వాళ్ళది మిడిమిడి జ్ఞానమే అయినా కొన్ని సమస్యలు వచ్చినా అలా జాగ్రత్తగా ఉండటం మంచిదే.
      సమయం వచ్చింది కనుక చెప్తున్నాను.
      ఓ రెండు నెలల క్రితం మా స్కూల్ ముందే ఉదయం పది గంటల సమయంలో నా మెడలో బంగారు గొలుసు లాగేసాడు ఓ దొంగ,
      వాడిని ఐదు నిమిషాలు పట్టుకున్నాను సమయానికి ఎవరూ లేరు.
      కొట్టేందుకు బండ తీసుకున్నాడు విదిలేక వదిలేసాను. కనుక అప్రమత్తంగా ఉండటం మంచిదే, కాకుంటే అతిజాగ్రత్త వల్లా కొన్ని సమస్యలు తప్పవు.

      Delete
  4. మీ మీద మీకు దయ లేదా మెరాజ్ మేమ్‍సాబ్.. కథ కోసం ఐనా అలా చేస్తే ఎలా!! నాకైతే మనసు చివుక్కు మంది.ఇలాంటి జీవిత పాఠాలు ఏం నేర్చుకుంటారు!!

    <<<...నా తల గోడకేసి కొట్టింది.
    తన పిడికిటదాచుకున్న కారాన్ని శపిస్తున్న ఋషిలా నా ముఖాన కొట్టింది.
    నన్ను ఒక్క గుంజు గుంజి బట్టల మూటలా గదిలో ఓ మూలకి విసిరేసి ఓ చిన్ని చున్నీ నా నోట్లో కుక్కింది.
    ఇంకా నాలాంటి దొంగలు (అయ్యో!)....>>>>
    అయ్యో!అయ్యో!అయ్యో!అయ్యో!అయ్యో!అయ్యో!అయ్యో!

    ReplyDelete
    Replies
    1. SKY గారూ, మీరు మరీ ఎంత సున్నిత మనస్కులండీ...
      లోకంలో ఇంకా ఎన్ని సమస్యలో, ఎన్ని అపార్దాలో, మనిషిని మనిషి నమ్మే కాలం పోయింది.
      నా కథ చదివి స్పందించిన, నా బ్లాగ్ కి విచ్చేసిన మీకు కృతజ్ఞతలు.....మెరాజ్

      Delete
  5. మీ లెక్కల కష్టాలు నవ్వు తెప్పించినా,మీ కష్టం చూస్తే బాధ అనిపించిందండీ..
    "జీవిత పాఠాలు" చక్కగా చెప్పారు..

    ReplyDelete
    Replies
    1. రాజీ గారూ కథ చదివిన మీకు ధన్యవాదాలు.
      జీవిత బడిలో మనమంతా విద్యార్దులమే...మెరాజ్.

      Delete
  6. మహిళలతో అందునా టీ.వీ చుసే వాళ్ళతో పెట్టుకుని గృహహింసా అదీ ఇదీ అన్నారుగా మొన్న అందుకేనేమో వాళ్ళు తడాఖా ఇలా చూపించారు:-) జాగ్రత్తండి ఇలాంటి పాఠాలు నేర్చుకోవడంలో!

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ, నిజమేనండీ ఈ అతి ఆడవాళ్ళకు దూరంగానే ఉండాలి.
      జీవితం కదండీ ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు.
      కథ చదివిన మీకు ధన్యవాదాలు.....మెరాజ్

      Delete
  7. nijam ga jariginda madam ? saradaga cheptunnara ?

    ReplyDelete
    Replies
    1. సుజాత గారూ, మీరు అడిగే విదానం ఎంత అమాయకంగా ఉందొ,
      నిజమే అయినా మనం ఏమి చేయలేము కదా,
      నా బ్లాగ్ విచ్చేసిన మీకు కృతజ్ఞతలు....మెరాజ్

      Delete
  8. తిప్పలు పడ్డా జ్ఞానాన్ని పొందారుగా:)

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ , జ్ఞానం ఎలా ఉన్నా జాగ్రత్త వస్తుంది ఇలాంటి సంఘటనల వల్లా.
      కథ చదివిన మీకు ధన్యవాదాలు....మెరాజ్

      Delete
  9. కాని మీరు ఈ సారి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండేం!
    'ఆడ' వాళ్ళు అంత జాగ్రత్తగా ఉంటే మీరాడకెందుకు బోయిండ్రు?!

    ReplyDelete
    Replies
    1. సర్, మీ సలహా తప్పకుండా పాటిస్తాను హెల్మెట్ పెట్టుకొనే వెళ్తాను.:-) :-)
      "ఆడ" వాళ్ళే కదా అనుకున్నాము సజాతి దృవాలు కదా వికర్షించాయి మరి.
      కథ చదివిన మీకు నా ధన్యవాదాలు.

      Delete
  10. /"ఏమండీకాస్త నీళ్ళు ఇస్తారా" అని చనువుగా లోపలికి ఓ అడుగేసాను ఆమె లోపలికెల్లటం చూసి. /
    మరి ఇంటావిడ చనువు తీసుకుంటే అంతలా గోల చేస్తున్నారే!? జనాభా లెక్కలు తీసుకున్నారు, సరే మళ్ళీ ఇంట్లో చొరబడాల్సిన అవసరం ఎందుకండి? :)
    ఇంతకూ కారప్పొడి గుంటూరుదా? వరంగల్‌దా? ఇంటావిడ పెట్టిన ఆవకాయ సాంపిల్ అడగక పోయారా? :))

    ReplyDelete
    Replies
    1. SNKR ఇంత మంది అయ్యో అన్నారు కదా..
      మీరేమో కారం గుంటూరుదా?, వరంగల్లుదా? అంటున్నారు..(ఎద్దు పుండు కాకికి ముద్దా అన్నట్లుంది )
      కథ చదివినందుకు థాంక్స్ మీకు.

      Delete
  11. హహహ.....
    హాస్యపు జల్లు కురిపించారు. ఆ జల్లులో నవ్వి నవ్వి తడిసి ముద్దయ్యాను. ఉపాద్యాయులు నేర్చుకోవాల్సిన జీవితపాఠాలు చాలా ఉన్నాయన్నమాట. బాగుందండి మీ ఈ పోస్ట్.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది.
      టీచర్ నే అయినా నేను నిత్యం విద్యార్దినే అనుకుంటాను.
      మరోమారు థాంక్స్ మీకు......మెరాజ్

      Delete
  12. తెలివి మీరిన ఇల్లాళ్ల తెగువ చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు.బాగుంది మీపోస్టు.

    ReplyDelete
  13. సర్, కథ చదివిన మీకు ధన్యవాదాలు, అయ్యో మీకు తెలియంది ఏముందీ ఇల్లాళ్ళ తెలివి, తెగువా :-) :-).

    ReplyDelete
  14. మేము ఇలాంటి లెక్కలు తీసాము కానీ ఇక్కడ పల్లెటూర్లలో ఇంతగా అనుమానించరండి.మీ అనుభవం చాలా బాధాకరం.

    ReplyDelete
  15. శేఖర్ గారూ, భాగ్యనగరం లో ఇలా ఎన్నో గల్లీ గల్లీకి ఓ కథ.
    ఎవర్ని నమ్మాలో ఎవర్ని కూడదో తెలీదు.
    కాలనీస్ మద్యాహ్నం పిల్లలూ, మగవారూ లేని సమయాల్లో ఎక్కువగా మోసాలు జరిగేందుకు అవకాసం ఎక్కువ.
    కథ చదివినందుకు థాంక్స్........మెరాజ్

    ReplyDelete
  16. ఇదేదో కల్పితమనుకున్నాను, నిజంగానే జరిగిందా? అయ్యో అయ్యో అయ్యో కలికాలం అండీ! మీ ఐ.డి కార్డు లాంటిదేమయినా చూపించాల్సింది :)
    నేను, నా ఫ్రెండ్స్ కొంతమంది డిగ్రీలో ఉండగా జన్యు లోపాల మీద ఒక స్టాటిస్టికల్ డేటా కోసం ఇంటింటికీ వెళ్ళి సంబంధిత వివరాలు కూపీ లాగటం మా పననమాట. కొంతమంది బానే చెప్పారు కానీ కొంతమంది మమ్మల్ని ఎదురు సతాయించేవారు (ప్రశ్నలతో). ఒకసారి ఆ రోజులన్నీ గుర్తోచ్చాయండీ ఇది చదువుతుంటే :) thank god మీరు ఎదుర్కొన్న లాంటి పరిస్థితులు మాకు ఎదురు కాలేదు ;)

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ, మీ స్పందన చూస్తె కళ్ళలో నీళ్ళు తిరిగాయి .
      ఎంత సున్నితమండీ మీరంతా.. సాటి మనిషి కష్టపడ్డారు అని తెలుస్తూనే అయ్యో అనటం దయకు తార్కాణం.
      అందుకే ఇంకా భూఒమి మీద మంచి బ్రతికే ఉంది. పోస్ట్ చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
  17. నవ్వలేక తెగ ఇబ్బంది పడ్డాను. కళ్ళ నీళ్ళు. :) మీ పోస్ట్ పరుగో పరుగు మల్లిక్ గారికి సమానస్థాయి.
    అలాగే మీరు చెప్పిన వాటిలో చాలా వాస్తవాలు ఉంటాయి.
    పాపం ..అని ఎవరిని అనాలో ఏమో..!
    అనుభవాలే జీవిత పాఠాలు.!! నేర్చుకోండి మిస్.:)

    ReplyDelete
    Replies
    1. వనజా, మల్లిక్ గారి హాస్యంతో పోల్చి నన్ను ఇంకా ఉత్సాహ పరిచారు. పరవాలేదు నేనూ నవ్విన్చాగలను.
      అయినా ఏదైనా ప్రమాదం చెప్పిరాదు, ఏమిచేద్దాం కొంచం జాగ్రత్త అవసరం. పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు ...మీ మెరాజ్

      Delete
  18. హ హ హ :):):) మొత్తానికి మీరు ఒక పాథం నేర్చుకోవడమే కాదండోయ్.. మాక్కూడా నేర్పించారు.

    ReplyDelete
  19. subha garu paataalu navvutoo nerchukundaam kastam anipinchavu. katha chadivina meeku thanks medam.

    ReplyDelete
  20. అయ్యయ్యో...సన్మానం అంటే నిజంగానే అనుకుంటూ చదువుతుంటే...
    పాపం చావు తప్పి కన్ను ...అన్నంత పనయ్యింది.
    ఇంత కష్టాన్నీ కామెడీ గా రాశారు, అదే నచ్చింది. ఎప్పటిలా మీ కధనా శైలి లో మీ అనుభవం ఆసక్తిగా రాశారు.

    ReplyDelete
  21. ఏమి చేద్దాం మీ లాంటి మిత్రులు ఆలస్యంగా వస్తారు :):)
    సర్, నా శైలి నచ్చినందుకు ధన్యవాదాలు. మీ కామెంట్ స్పూర్తినిస్తుంది.

    ReplyDelete
  22. ఒక ప్రక్క మీ చేదు అనుభవం నవ్వు తెప్పించినా,
    మరో ప్రక్క బాధగానే వుంది ఫాతిమా గారు!
    మీరు పిల్లలకి పాఠాలు నేర్పితే, మహిళా మణులు
    మీకు జీవిత పాఠాలు నేర్పడం బాగుంది.

    ReplyDelete
  23. నాగేంద్ర గారూ, జీవితం నుండి నేర్చుకోనేవి చాలా కటినంగా ఉంటాయి.
    విలువైనవిగా ఉంటాయి కూడా,మీ స్పందనకు ధన్యవాదాలు....మెరాజ్

    ReplyDelete
  24. This comment has been removed by the author.

    ReplyDelete
  25. అనుభవ పాఠాన్ని అదెంత కాఠిన్యమైనా నవ్వుతూ నవ్విస్తూ భలేగా చెప్పారండీ. మీరూ నవ్వించగలరన్న మాట:) ఏమైనా మీరు నవ్విస్తూ కూడా సమాజం లోని భద్రత-అభద్రత రక్షకభటుల బాధ్యతలను పాఠాలుగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. సర్, టీచర్ని కదా,ఎక్కడైనా పాఠాలు చెప్పటమే పని.:-))

      Delete