Pages

Saturday 28 September 2013

నన్నోమారు బ్రతికించు.






     నన్నోమారు బ్రతికించు.

   
   ఆప్తుల నుండి  రాలిపడే నవ్వులను 
   నేను ఏరుకోవాలి.

   ఆరని  ఆత్మీయుల పాదముద్రలను 
   నేను ముద్దాడాలి.

   పిడికెడు గింజలకై వలస వచ్చే పిట్టల  చిట్టి కథలు 
   నేను వినాలి.

   అద్దాల కిటికీకి నా ముక్కునద్ది అందరినీ వెక్కిరిస్తూ ఇష్టంగా
   నేను ఆడుకోవాలి.

   అర్దాంతరంగా ఆపేసిన అమ్మమ్మ కథలో ముగింపేమిటో
   నేను తెలుసుకోవాలి 

   ఇంటివెనుక  జిల్లేడు మొగ్గలను  చిదిమి
   టప,టప్ లాడించాలి.

   పచ్చగడ్డిమోసే పల్లె పడచుల వెనుక కులుకుతూ నడిచి  
   వారిని వెక్కిరించాలి.

   ధాన్యపు గాదెల వెనుక నక్కిన నా దొంగ నేస్తాలను
   పోలీసునై  పట్టుకోవాలి.

   అర్దాంతరంగా నా శ్వాసను ఆపేశావు దయచేసి, ఒక్కసారి వెనక్కి  పంపు
   మదురమైన  ముత్యపు మూటలతో తిరిగివస్తా....
   







5 comments:

  1. నన్నోమారు బ్రతికిస్తే .... ఓ ప్రకృతీ! ....
    ఆప్తుల నవ్వులను ఏరి, ఆత్మీయుల పాదముద్రలను ముద్దాడి, అర్దాంతరంగా ఆపేసిన అమ్మమ్మ కథలో ముగింపు తెలుసుకొని, ఇంటెనుక జిల్లేడు మొగ్గలను చిదిమి టప,టప్ అనిపించి, ధాన్యపు గాదెల వెనుక నక్కిన నేస్తాలను పోలీసునై పట్టుకొని, ముత్యపు మూటలతో తిరిగివస్తా ....
    ఆపిన నా శ్వాస ను సరిదిద్ది నన్నో మారు బ్రతికిస్తే అన్నీ నీకే ఇస్తా!
    మంచి ముచ్చట, పసి మనసు నిర్మలత్వం .... కవిత ఆద్యంతమూ ....
    అభినందనలు మీరజ్ ఫాతిమా జీ!

    ReplyDelete
    Replies
    1. చంద్ర గారు కవిత చదివాక నా స్పందన తెలియజేయాలని చూసినంతన మీరు అదే వాక్యములతో ముందు వరసలో నిలుచొనియున్నారు .... కాపీ కొట్టాను అనిపించుకోలేక మీ ప్రక్కన కొంచం చోటు తీసుకుంటున్నాను......

      ఫాతిమా గారు... చంద్రగారి ప్రతి భావనతో పూర్తిగా ఏకీభవిస్తూ ఇలా అనిపించింది ....
      చాలా అద్భుతముగా ఉందండి సరళమైన పదాలతో హ్రుదయాంతరాలలోకి జొప్పించారు ......

      వావ్.....

      Delete
  2. చంద్ర,సాగర్ గార్లకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete