Pages

Wednesday 12 March 2014

జీవిత నా(తో)వ

    





   జీవిత నా(తో)వ 

    జీవన పయోనిదిలో సాగిపోయే,
    నా జీవిత నౌక,

    ఆశల అలలనంటిన,
    కలల విహారమై,

    ఆటుపోట్లకు తట్టుకొని,
    దిక్కుతోచని  వియోగంలో,

    కదిలే కాలపు అంచుపట్టుకొని,
    నీ పిలుపు పులకింతకై,

    సుడిగుండాల తోవలో,
    ఉద్వేగపు ఉప్పెనలో,

    కన్నీరింకిన  ఎదపొంత లో,
    వేడిగా రగిలే దిగులుతో,

    చేజార్చుకున్న స్మృతుల్లో,
    ఏ  ఒక్క క్షణం చిట్లినా...,
    వేయి శిశిరాల  వేదన నాది. 

    కలం సాగదూ,అక్షరం విశ్రమించదూ,
    కలల కడలిలో,నీ తలపులతడిలో,

    నా  జీవితనౌక ,
    మరణానికి కొంచం దూరం లో,
    లంగరేసుకొని  నిరీక్షిస్తుంది.  







12 comments:

  1. జీవిత నావకు ఓ దిక్చూచిలా మంచి తోవను చూపారు ..
    ఆ అన్వేషణలో ఆర్ద్రత ఉంది .
    ఆ నిరీక్షణలో అర్ధం ఉంది
    .. వీటి కలయికలో జీవితసారాన్ని భోధించారు.
    కవిత చిన్నదైనా భావాలు మెండు.
    అభినందనలు ఫాతిమా జీ.
    *** శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ స్పందనకు శ్రీపాద గారు.

      Delete
  2. చేజార్చుకున్న స్మృతుల్లో,
    ఏ ఒక్క క్షణం చిట్లినా...,
    వేయి శిశిరాల వేదన నాది.
    అనిర్వచనీయమైన భావ వ్యక్తీకరణ.మీరజ్ చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. దేవీ, ధన్యవాదాలు భావాన్ని మెచ్చిన మీకు.

      Delete
  3. జీవసాగరం లో సాగిపోతూ, ఆశల అలల, కలల విహారినై, దిక్కుతోచని, ఆటుపోట్లకు తట్టుకోను కాలం అంచుపట్టుకొని, నీ పిలుపు పులకింతకై, సుడిగుండాలలో, ఉద్వేగ ఉప్పెనలలో, చేజార్చుకున్న స్మృతుల ఆసరాతో సాగుతూ .... ఎందుకో ఈ
    కలం ముందుకు సాగడం లేదు, అక్షరం విశ్రమించడమూ లేదు, ఆ కలలలో, ఆ తలపులతడిలో, మరణానికి సమీపంగా .... లంగరేసుకొని నిరీక్షిస్తున్న ఒక జీవిత నౌకలా నేను
    ఎంత బాగా వ్రాసారు
    లోతైన భావన
    అభినందనలు ఫాతిమా గారు!!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సర్.మీ సునిసిత పరిశీలనకు

      Delete
  4. మేడం,నమస్తే,మీ కవితని గూర్చి వివరంగా చెప్పలేను,కానీ ఆకరి పంక్తులు కొంచం కస్హ్టంగా అనిపించాయి.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ,నా ప్రతికవితా చదివే మీకు నా థాంక్స్.
      ఆకరి పంక్తులు తీసేద్దాం సరేనా..:-))

      Delete
  5. సప్త వర్ణాల కలయికే, ఇంద్ర ధనుస్సు !
    సప్తానుభూతుల కలయికే, జీవితం !
    నిరాశే నీ రంగైతే, జీవిత చిత్రం నలుపే !

    ఎందుకు సదా స్మరణం?
    అనివార్యం, ప్రతి జీవికీ మరణం !
    అందుకే , జీవించాలి ప్రతి క్షణం !
    పంచాలి, నీ దయా గుణం !

    విరహం , వియోగం !
    కాకూడదు మరణానికి తీరం !
    అపుడు నీవు మానవత కే దూరం !
    ప్రేమ ఒకరికే దక్కడం, సంకుచితం !
    ప్రేమను పంచడం సదా, సముచితం !

    నిస్తేజమైన నీ స్పూర్తి కుంచె దులుపు !
    ఆనందపు వర్ణాలు కలుపు !
    పరిపూర్ణం అపుడు, నీ జీవిత చిత్రం !
    పరిమళం అపుడు, నీ జీవిత చైత్రం !

    ReplyDelete
    Replies
    1. మీ మీట ఎల్లప్పుడూ అవుతుంది సముచితం.:-))
      సర్, మీ అమూల్యమైన సమయాన్ని నా కవితకోసం వెచ్చించినందుకు నా ధన్యవాదాలు.

      Delete
  6. చేజార్చుకున్న స్మృతుల్లో,
    ఏ ఒక్క క్షణం చిట్లినా...,
    వేయి శిశిరాల వేదన నాది. Chaalaa chaalaa bagundi:):)

    ReplyDelete
    Replies
    1. కార్తిక్ రెడ్డి గారు, ధన్యవాదాలు.

      Delete