Pages

Tuesday 18 March 2014

మూలాల లోతుల్లోకి ...,

    


   మూలాల  లోతుల్లోకి ...,

    అన్యాయాన్ని పోషించే వ్యవస్థకు,
    అన్నం  పెట్టటం ఎలాతెలుస్తుంది?

    అవినీతి మురికి మడుగులో,
    పడ్డ పందుల మురికి 
    కడిగే చేయి ఎక్కడుంది? 

    గల్లీ నుండి డిల్లీ వరకు,
    చెత్త చెదారమూ  నిండితే,
    ఊడిచే చీపురు ఎక్కడుందీ?

    పార్ట్ టైమో,ప్రైవేటిజమో,
    రెండూ, రెండు చక్రాలై,
    సైకిల్లా సర్రున దూసుకోస్తుంటే..,

    కళ్ళలో కారం కొట్టి,
    కడుపులో చిచ్చుపెట్టి,
    కాళ్ళకు మాత్రం చెప్పులు తొడుగుతుంటే..,

    మాటల మాయగాళ్లనో,
    ఎంగిలి ఫలాలను మింగే కేటుగాళ్ళనో,
    నమ్మి మోసపోయే సమయాన,

    మేధావి వర్గాలు, 
    ఎవరి స్వార్ధపు ముసుగుల్లో వారు దూరి,
    మాటల తూటాలు పేలుస్తూ,
    రోగిష్టి బిడ్డని లాలించే అమ్మలా ఫోజులిస్తుంటారు. 





12 comments:

  1. పార్ట్ టైమో, ప్రైవేటిజమో, రెండూ, రెండు చక్రాలై, సైకిల్లా సర్రున దూసుకోస్తుంటే.., కళ్ళలో కారం కొట్టి, కడుపులో చిచ్చుపెట్టి, కాళ్ళకు మాత్రం చెప్పులు తొడుగుతుంటే.., మాటల మాయగాళ్లనో, ఎంగిలి ఫలాలను మింగే కేటుగాళ్ళనో, నమ్మి మోసపోయే సమయాన, మేధావి వర్గాలు, ఎవరి స్వార్ధపు ముసుగుల్లో వారు దూరి, మాటల తూటాలు పేలుస్తూ, రోగిష్టి బిడ్డని లాలించే అమ్మలా ఫోజులిస్తుంటారు.
    ప్రస్తుత రాజకీయ అస్తవ్యస్తతను స్వార్ధ భావనల విశ్లేషణను మీ కవితలో చూస్తున్నాను. మీ సాహసానికి అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు. శుభసుప్రభాతం!!

    ReplyDelete
    Replies
    1. సర్, ఈ రాజకీయ విదానాలలో సమాజం ఎప్పుడో నలిగిపోయింది.
      మార్పు అనివార్యమే కానీ మనిషిని బ్రతికించలేని మార్పు ఎందుకు.

      Delete
  2. మేడం, నమస్తే, రాజకీయాల్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది,
    కుళ్ళూ,కుతంత్రాలూ ఉన్న కంపు గుంటలు అవి,
    సామాజిక స్పృహ కలిగిన మీ రాతలు చైతన్యాన్ని నింపుతాయి,
    (చూశారా్ మీ దగ్గర పాఠాలు నేర్చుకొని మీకే అప్పజెప్పేస్తున్నాను,)

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ, మీరు నా స్కూల్లో టీచరే అయినా, నాకో మంచి స్నేహితురాలు అనుకుంటాను.
      ఇకపోతే నేను నిత్య విద్యార్దినే. కనుక మీ పాఠాలు తప్పకుండా వింటాను :-))

      Delete

  3. నడుస్తున్న కాల తీరు గుండెకు హత్తుకునేలా చెప్పారు .

    "కళ్ళలో కారం కొట్టి,
    కడుపులో చిచ్చుపెట్టి,
    కాళ్ళకు మాత్రం చెప్పులు తొడుగుతుంటే..,"

    మాటల గారడీల యుగంలో మనిషి మనుగడ ఎంత హృదయవిదారకమో చాలా గొప్పగా చెప్పారు.
    ఇలా చెప్పడంలో మీరు 'నిష్ణాతులు'.

    *** శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాద గారూ, నా కవిత కంటే మీ వివరణ బాగుంటుంది,
      మీ అభిమానానికి నా కృతజ్ఞతలు.

      Delete
  4. ఓటు వేసిన సామాన్య పౌరుడు గొంగళిలో కూర్చుని భోంచేస్తూ వెంట్రుకలు ఏరుకుంటున్నాడు మీరజ్.....

    ReplyDelete
    Replies
    1. నిజమే దేవీ, కానీ ఓటుకు ముందే కొన్ని లెక్కెట్టుకుంటున్నాడు,
      రాజకీయానికీ తన జీవితానికీ ముడిపడి ఉందని తెలీటం లేదు.
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  5. Akshara jyothi.19 March 2014 at 07:25

    Bagundi Medam garu.

    ReplyDelete