Pages

Monday 24 March 2014

ఆమె

    


   ఆమె 

    ఆమె చిన్ని పెదవుల నుండి,
    రాలిపడే  పిలుపుకై  చెవులొగ్గుతున్నా,

    చీకటిని  చీల్చిన ఆ కలం  నుండి,
    జారిపడే వెలుగు  వాఖ్యాలకై  దోసిలొడ్డుతున్నా, 

    సుడిగాలికి  రెప,రెప లాడే ఆ చిరుదీపం నుండి,
    నులివెచ్చని  కిరణాలలో చలికాసుకుంటున్నా,

    ఎప్పటి గాయాలో రేగి ఆమె చూపులనుండి,
    రక్తమోడటం  నేను గమనిస్తూనే ఉన్నా,

    అనుక్షణం అన్వేషించేే ఆమె అక్షరం  నుండి,
    ఓ అమ్మతనపు  కమ్మదనాన్ని చూస్తున్నా,

    ప్రతి సంబంధం వెనుకా, 
    నీడలా కనిపించే  ఓ  అదృశ్య  సంఘటన,

    మానసిక శ్వేచ్చను హత్య చేసిన మౌనం నుండి,
    పుట్టిన మూగ వేదననై  బైటికి రావాలని చూస్తున్నా,

    కంటి తుడుపు సానుభూతి నచ్చని తననుండి,
    ఏదైనా సందేశము  ఉంటుందేమో అని ఎదురుచూస్తున్నా, 
    
    దో వేదన ఒళ్లంతా పాకుతుంటే, 
    తప్పటడుగునై  తడబడుతున్నా..... 



20 comments:

  1. "మానసిక స్వేచ్చను హత్య చేసిన మౌనం నుండి,
    పుట్టిన మూగ వేదననై బైటికి రావాలని చూస్తున్నా ",
    ఇటువంటి భావాలను సామాజిక స్పృహతో మీరు బాగా విశ్లేషించగలరు మీరజ్,మీలోని సహజ సామాజిక కవితా రూపానికి నిజంగా సుమహారాలను వేసి అభినందించాలి.

    ReplyDelete
    Replies
    1. దేవీ, మీ ప్రశంసామాల వేశారు కదా, అంతే చాలు.
      నా ప్రతి కవిత వెనుకా మీ ప్రోత్సాహక స్పందన ఉంటుంది,ధన్యవాదాలు.

      Delete
  2. ఆమె సందేశం కోసం మేము కూడా చూస్తున్నాము .

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారూ,చాలా కాలానికి విచ్చేశారు,
      తప్పకుండా ఆమె సందేశం అందుతుంది.

      Delete
  3. మేడం నమస్తే, ఆమె కవిత చాలా బాగుంది,
    బొమ్మ కూడా చాలా అందంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ, కవిత నచ్చినందుకు నా ధన్యవాదాలు.

      Delete
  4. "మానసిక శ్వేచ్చను హత్య చేసిన మౌనం నుండి,
    పుట్టిన మూగ వేదననై బైటికి రావాలని చూస్తున్నా,"

    మనసు వేదనకు గురి అయినప్పుడు మనో భావాలు తన్నుకు వస్తాయని పెద్దలు ఉరకే అనలేదు. ఎంత బాగా అల్లారు భావనలని. అభినందనలు ఫాతిమా గారూ

    ReplyDelete
    Replies
    1. నా భావనలు నచ్చి,మెచ్చిన మీకు నా ధన్యవాదాలు శ్రీపాద గారు.

      Delete
  5. "కంటి తుడుపు సానుభూతి నచ్చని తననుండి,
    ఏదైనా సందేశము ఉంటుందేమో అని ఎదురుచూస్తున్నా,

    ఏదో వేదన ఒళ్లంతా పాకుతుంటే,
    తప్పటడుగునై తడబడుతున్నా....." ఇందాకే కపిల రాం కుమార్ గారు మీ కవితను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. అక్కడ చూశాకే ఇక్కడికి వచ్చా అక్కా... మీ మనసుకి అద్దంపట్టేలా హృద్యంగా ఉంది. హాట్సాఫ్ టు యూ...

    ReplyDelete
    Replies
    1. శోభా,ఎలా ఉన్నారు?(క్షేమంగా ఉండాలని దీవిస్తూ)
      అవును కపిల్ సర్, నా కవితలు ఫేస్బుక్ లో పెడుతుంటారు,
      కపిల్ గారి, ఆదరణకూ,మీ అభిమానానికీ నోచుకున్న నా కవిత ధన్యమైంది.

      Delete
  6. కవితకు తగ్గ బొమ్మలేలా తీసుకుంటారో గానీ సుపర్బ్!

    ReplyDelete
    Replies
    1. అక్కా, బాగున్నారా?
      బొమ్మల సెలక్షన్‌ నచ్చినందుకు సంతోషం.

      Delete
  7. సహనశీలి ఆమె.
    తన చల్లని చూపుతో
    యెద గాయాల దహన శీలి ఆమె.
    గాయాల గతాన్నితోడేసుకుంటూనే మిణుకు మిణుకు మనే
    మది దీపాన్ని వెలిగించి
    కొన ఊపిరులకీ తన ఊపిరిలూదే
    సంజీవని సహజీవని ఆమె..
    మది తలుపులు మనో నేత్రాల్ని మూసేస్తున్నా వేదన స్వేదమై దేహాన్నే కమ్మేస్తున్నా,,,
    అమ్మతనమే కమ్మగా
    అందిస్తుంది ఆమె...
    

    ReplyDelete
    Replies
    1. జానీ,(తమ్ముడూ) మీ వాఖ్య కవితలా చాలా బాగుంది.
      స్పందనకు థాంక్స్.

      Delete
  8. Good poem Madam.

    ReplyDelete
    Replies
    1. అక్షరా,ధన్యవాదాలు.

      Delete
  9. ఎదురుచూపులలో దాగిన ఆశ వమ్ము కాదెప్పుడు..
    తడబడుతున్న అడుగులకి చేవకల్గి స్థిరమైన నడక రానున్నదిప్పుడు..

    one of best poem Meraj.. (y)

    ReplyDelete
    Replies
    1. ఆశాభావమెప్పుడూ నిరాశపరచదు, ఈ ప్రేరణ మీ నుండి చాలాసార్లు నా కవితలకు లబించింది,
      స్నేహితురాలి ఆగమనాన్ని హర్షిస్తూ...మెరాజ్.

      Delete
  10. ఏ చిన్న పిలుపైనా ఆ చిరు పెదవుల నుండి రాలిపడొచ్చని, జారిపడే చీకటిని చీల్చిన వెలుగు వాఖ్యాలకోసం దోసిలొడ్డి,
    రెప, రెప లాడే ఆ చిరుదీపపు, నులివెచ్చని కిరణాల అమ్మతనపు కమ్మదనమై
    మది స్వేచ్చను హతమార్చిన మౌనం మూగ వేదననై ఏదైనా సందేశము ఉంటుందేమో అని ఎదురుచూపుల తప్పటడుగై తడబడుతూ ....
    "ఆమె" కవిత మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే ఒక గొప్ప భావ సుమహారం ....
    అభినందనలను మించిన వైశిష్ట్యాన్ని సంతరించుకుని ....
    నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. సర్, మీ ప్రశంసను మించిన సుమహారం ఎక్కడిందీ..?
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete