Pages

Saturday 29 March 2014

ఎలా చెప్పను?

   



   ఎలా చెప్పను?

    అందమైన  భావాలన్నీ మదిని, 
    ఆలింగనం చేసుకున్నాయనీ, 
    ఎంత  దాచినా వదనంపై  విరులలా, 
    విచ్చుకుంటున్నాయనీ....ఎలా చెప్పను?

    చిరు కదలికకే   కాలి అందియ  
    నా ఉనికి  తెలియచేస్తుందనీ, 
    వెనుక ఉన్న వాలుజడ,  
    వీపుపై  దరువు వేస్తుందనీ....ఎలా చెప్పను?


    పొగ మంచులో ఎగసిపడే వలపు వేడిమి 
    ఎద లోపల ఘనీభవిస్తుందని 
    మధుర స్వప్నాల మూట విప్పితే 
    నిదుర చెడకొట్టి  ఎగిరిపోతున్నాయని...ఎలా చెప్పను?  


    వెన్నెల వెండి పాత్రలో నీ చెలిమి, 
    వెన్నముద్దలా మురిపిస్తుందనీ.., 
    పూల రెక్కల స్పర్సలా తేనేచుక్కల రుచిలా, 
    నీ ప్రేమ పులకింతలు పెడుతుందనీ .... ఎలా చెప్పను? 


    లోతుకు పాతుకుపోయే నీ చూపులకు, 
    హృదయ ఫలకంపై  నీచిత్రమే  ఉందనీ,
    నిన్ను కలిసే ఈ క్షణం కోసం, 
    మనసు మయూరమై నర్తిస్తుందనీ.... ఎలా చెప్పను? 


    గాలివాటుని... తేనే  ఊటనీ,  
    ఆస్వాదించే మిళిందానికి,  
    స్నేహ బాటని...వలపు తోటని చేరమని.... ఎలా పిలువను? 

    మదికీ... మస్తిష్కానికీ సామ్యం కుదరక,
    వేదనకు... రోదనకు పొంతన లేదని.... నిన్నెలా మరువను?
     
    

20 comments:

  1. Ela cheppanu? Anukuntune bhalegaa chepparu:):)baagu baagu:):)

    ReplyDelete
    Replies
    1. కార్తిక్ గారూ, మీకు బలేగా నచ్చినందుకు నా ధన్యవాదాలు:-))

      Delete
  2. చెప్పలేనివన్నీ చెప్పలేననీ చెప్తూ
    చెప్పుకొచ్చిన చేరిష్మా
    చెప్పలేనంతగా బాగుంది దీదీ

    ReplyDelete
    Replies
    1. జానీ,నచ్చినందుకు షుక్రియా.

      Delete
  3. మధురమైన భావన. బాగా రాసారు.
    మీకు ఇస్మాయిల్ గారికి, జీబాకు, ఇంకా మీ మిత్రులందరికి
    ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. సర్,నమస్తే,
      మీకూ,మేడంగారికి,పిల్లలకూ మా కుటుంబం తరపున శుభాకాంక్షలు.

      Delete
  4. ఎల్లలు లేని మీ "ఎలా", పరిమళాలు మరు మల్లెలను వెదజల్లాయి
    మీ ఆధారాలను దారాలుగా చేసి అల్లితే దండలుగా చూరగుంటాయి
    అంతరాత్మానుసారంగా ప్రేమానురాగ హృదయానికి చేరువవుతాయి!

    ReplyDelete
    Replies
    1. శివరామకృష్ణ గారూ,
      మీ స్పందనకు నా ధన్యవాదాలు.

      Delete
  5. అందమైన భావన ఆనందం, ఆలింగనం చేసుకుని, వదనంపై సొగసులు పూసిందని ....
    చిరు కదలిక నా ఉనికిని, వాలుజడ, వీపుపై దరువు వేస్తూ ఉనికిని తెలియజేస్తుందని ....
    వలపు వేడి ఎద లోపల ఘనీభవించి మధుర స్వప్నాల మూట చెదిరి నిదుర చెడకొట్టిందని ....
    వెన్నెల నీ చెలిమి, వెన్నముద్ద.., పూల రెక్కల స్పర్స తేనేచుక్క, నీ ప్రేమ పులకింత అని ....

    ఎలా చెప్పను
    నిన్నెలా మరువను అంటూ
    ప్రకృతి స్త్రీని, పురుషుడ్నీ
    సహజ రీతి లో హృద్యమం గా వర్ణించడం

    చాలా చాలా హుందా గా బాగుంది.
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. సర్, ఎప్పటిలా మీ విష్లేషణలో నా కవిత నా దగ్గరికొచ్చింది,
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  6. ఇలా కాక మరెలా చెప్పినా ఇంత అద్బుతంగా ఉండేది కాదేమో! అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. వర్మాజి, ఇలా చెప్తేనే బాగుంది అనే మీ ప్రశంసకు నా ధన్యవాదాలు.

      Delete

  7. వెన్నెల వెండి పాత్రలో నీ చెలిమ వెన్నముద్దలా మురిపిస్తుందనీ.., GOOD POETRY

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శేఖర్ గారు.

      Delete
  8. మదికీ... మస్తిష్కానికీ సామ్యం కుదరక,
    వేదనకు... రోదనకు పొంతన లేదని.... నిన్నెలా మరువను?........ ఈ లైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి దీది :)

    ReplyDelete
    Replies
    1. స్వేతా,మీ స్పందంకు ధన్యవాదాలు.

      Delete
  9. ఎలా,ఎలా,ఎలా,ఎలా ,ఎలా చెప్పను..?
    అంటూనే ఇలా,ఇలా,ఇలా,ఇలా,చెప్పెనా...?
    మీరజ్ ఈ తరహా కవిత మీది చదివి చానాళ్ళయింది.
    చాలా బాగుంది,బొమ్మ కూడా అద్భుతంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. దేవీ...ఎలా తెలుపనూ...:-))

      Delete

  10. "లోతుకు పాతుకుపోయే నీ చూపులకు,
    హృదయ ఫలకంపై నీచిత్రమే ఉందనీ,
    నిన్ను కలిసే ఈ క్షణం కోసం,
    మనసు మయూరమై నర్తిస్తుందనీ.... ఎలా చెప్పను? "

    వహ్ .. క్యా బాత్ హై . ఖూబ్ సూరత్.... ఏ ఆప్కా లఫ్జ్.

    మీ కలం నుండి మరో మంచి కవిత ఇది.
    హృదయం విచ్చుకుని ఏదో పులకరింతను
    మొహం నిండా పులిమింది.
    అద్భుతమైన పదజాలం.
    మీ భావాలలో ఓ విభిన్నమైన పుట ఇది.
    చాలా ఆదరణ అందుకుంటుంది మీ ఈ కవిత.

    అభినందనలు ఫాతీమా గారూ !
    *శ్రీపాద.

    ReplyDelete
  11. సర్, మీ ప్రశంసకు ఉప్పొంగుతుంది మనస్సు,
    ఈ కవిత రెండేళ్ళక్రితం ఆశ అనే పత్రికలో వచ్చింది.
    మీకు నచ్చుతుంది , భావుకతకు ప్రాధాన్యత ఇస్తారు కదా.

    ReplyDelete