ఎంత దాచినా వదనంపై విరులలా,
విచ్చుకుంటున్నాయనీ....ఎలా చెప్పను?
విచ్చుకుంటున్నాయనీ....ఎలా చెప్పను?
చిరు కదలికకే కాలి అందియ
నా ఉనికి తెలియచేస్తుందనీ,
నా ఉనికి తెలియచేస్తుందనీ,
వెనుక ఉన్న వాలుజడ,
వీపుపై దరువు వేస్తుందనీ....ఎలా చెప్పను?
వీపుపై దరువు వేస్తుందనీ....ఎలా చెప్పను?
పొగ మంచులో ఎగసిపడే వలపు వేడిమి
ఎద లోపల ఘనీభవిస్తుందని
మధుర స్వప్నాల మూట విప్పితే
నిదుర చెడకొట్టి ఎగిరిపోతున్నాయని...ఎలా చెప్పను?
నిదుర చెడకొట్టి ఎగిరిపోతున్నాయని...ఎలా చెప్పను?
వెన్నెల వెండి పాత్రలో నీ చెలిమి,
వెన్నముద్దలా మురిపిస్తుందనీ..,
పూల రెక్కల స్పర్సలా తేనేచుక్కల రుచిలా,
నీ ప్రేమ పులకింతలు పెడుతుందనీ .... ఎలా చెప్పను?
నీ ప్రేమ పులకింతలు పెడుతుందనీ .... ఎలా చెప్పను?
లోతుకు పాతుకుపోయే నీ చూపులకు,
హృదయ ఫలకంపై నీచిత్రమే ఉందనీ,
నిన్ను కలిసే ఈ క్షణం కోసం,
మనసు మయూరమై నర్తిస్తుందనీ.... ఎలా చెప్పను?
మనసు మయూరమై నర్తిస్తుందనీ.... ఎలా చెప్పను?
గాలివాటుని... తేనే ఊటనీ,
ఆస్వాదించే మిళిందానికి,
స్నేహ బాటని...వలపు తోటని చేరమని.... ఎలా పిలువను?
మదికీ... మస్తిష్కానికీ సామ్యం కుదరక,
వేదనకు... రోదనకు పొంతన లేదని.... నిన్నెలా మరువను?
Ela cheppanu? Anukuntune bhalegaa chepparu:):)baagu baagu:):)
ReplyDeleteకార్తిక్ గారూ, మీకు బలేగా నచ్చినందుకు నా ధన్యవాదాలు:-))
Deleteచెప్పలేనివన్నీ చెప్పలేననీ చెప్తూ
ReplyDeleteచెప్పుకొచ్చిన చేరిష్మా
చెప్పలేనంతగా బాగుంది దీదీ
జానీ,నచ్చినందుకు షుక్రియా.
Deleteమధురమైన భావన. బాగా రాసారు.
ReplyDeleteమీకు ఇస్మాయిల్ గారికి, జీబాకు, ఇంకా మీ మిత్రులందరికి
ఉగాది శుభాకాంక్షలు
సర్,నమస్తే,
Deleteమీకూ,మేడంగారికి,పిల్లలకూ మా కుటుంబం తరపున శుభాకాంక్షలు.
ఎల్లలు లేని మీ "ఎలా", పరిమళాలు మరు మల్లెలను వెదజల్లాయి
ReplyDeleteమీ ఆధారాలను దారాలుగా చేసి అల్లితే దండలుగా చూరగుంటాయి
అంతరాత్మానుసారంగా ప్రేమానురాగ హృదయానికి చేరువవుతాయి!
శివరామకృష్ణ గారూ,
Deleteమీ స్పందనకు నా ధన్యవాదాలు.
అందమైన భావన ఆనందం, ఆలింగనం చేసుకుని, వదనంపై సొగసులు పూసిందని ....
ReplyDeleteచిరు కదలిక నా ఉనికిని, వాలుజడ, వీపుపై దరువు వేస్తూ ఉనికిని తెలియజేస్తుందని ....
వలపు వేడి ఎద లోపల ఘనీభవించి మధుర స్వప్నాల మూట చెదిరి నిదుర చెడకొట్టిందని ....
వెన్నెల నీ చెలిమి, వెన్నముద్ద.., పూల రెక్కల స్పర్స తేనేచుక్క, నీ ప్రేమ పులకింత అని ....
ఎలా చెప్పను
నిన్నెలా మరువను అంటూ
ప్రకృతి స్త్రీని, పురుషుడ్నీ
సహజ రీతి లో హృద్యమం గా వర్ణించడం
చాలా చాలా హుందా గా బాగుంది.
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!
సర్, ఎప్పటిలా మీ విష్లేషణలో నా కవిత నా దగ్గరికొచ్చింది,
Deleteధన్యవాదాలు మీ స్పందనకు.
ఇలా కాక మరెలా చెప్పినా ఇంత అద్బుతంగా ఉండేది కాదేమో! అభినందనలు.
ReplyDeleteవర్మాజి, ఇలా చెప్తేనే బాగుంది అనే మీ ప్రశంసకు నా ధన్యవాదాలు.
Delete
ReplyDeleteవెన్నెల వెండి పాత్రలో నీ చెలిమ వెన్నముద్దలా మురిపిస్తుందనీ.., GOOD POETRY
ధన్యవాదాలు శేఖర్ గారు.
Deleteమదికీ... మస్తిష్కానికీ సామ్యం కుదరక,
ReplyDeleteవేదనకు... రోదనకు పొంతన లేదని.... నిన్నెలా మరువను?........ ఈ లైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి దీది :)
స్వేతా,మీ స్పందంకు ధన్యవాదాలు.
Deleteఎలా,ఎలా,ఎలా,ఎలా ,ఎలా చెప్పను..?
ReplyDeleteఅంటూనే ఇలా,ఇలా,ఇలా,ఇలా,చెప్పెనా...?
మీరజ్ ఈ తరహా కవిత మీది చదివి చానాళ్ళయింది.
చాలా బాగుంది,బొమ్మ కూడా అద్భుతంగా ఉంది.
దేవీ...ఎలా తెలుపనూ...:-))
Delete
ReplyDelete"లోతుకు పాతుకుపోయే నీ చూపులకు,
హృదయ ఫలకంపై నీచిత్రమే ఉందనీ,
నిన్ను కలిసే ఈ క్షణం కోసం,
మనసు మయూరమై నర్తిస్తుందనీ.... ఎలా చెప్పను? "
వహ్ .. క్యా బాత్ హై . ఖూబ్ సూరత్.... ఏ ఆప్కా లఫ్జ్.
మీ కలం నుండి మరో మంచి కవిత ఇది.
హృదయం విచ్చుకుని ఏదో పులకరింతను
మొహం నిండా పులిమింది.
అద్భుతమైన పదజాలం.
మీ భావాలలో ఓ విభిన్నమైన పుట ఇది.
చాలా ఆదరణ అందుకుంటుంది మీ ఈ కవిత.
అభినందనలు ఫాతీమా గారూ !
*శ్రీపాద.
సర్, మీ ప్రశంసకు ఉప్పొంగుతుంది మనస్సు,
ReplyDeleteఈ కవిత రెండేళ్ళక్రితం ఆశ అనే పత్రికలో వచ్చింది.
మీకు నచ్చుతుంది , భావుకతకు ప్రాధాన్యత ఇస్తారు కదా.