Pages

Tuesday 1 April 2014

కన్నీటి తోడు.

    






   కన్నీటి తోడు. 

    గాలివానకు కుప్పకూలిన పంటను చూసి ,
    పేద రైతు  గుండెపగిలినప్ప్పుడు.

    కన్నకూతురు కాలి బూడిదైన వార్త,
    అమ్మానాన్నలు  విన్నప్పుడు.

    నిస్సహాయురాలైన అంధురాలిని,
    కామందులు కాటువేసినప్పుడు,

    కట్ట్టినవాడే తాళిని ఎగతాళి చేసి,
    ఇల్లాలిని వెళ్ళగొట్టినప్పుడు.

    నచ్చిన వారు పరాయివారిలా ,
    పరామర్శించినప్పుడు.

    దూరతీరాలకెళ్ళిన  ఆత్మీయులు,
    విగతజీవులై ఇల్లు చేరినప్పుడు.

    కలల పంట అనుకున్న బిడ్డడు,
    వికలాంగుడుగా జన్మించినప్పుడు.

    మొర  ఆలకించమని మొండిచేతులతో,
    దేవుని  వేడుకొంటున్నపుడు. 

    నివురుగప్పిన  దిగులు తెరలు,
    కళ్ళను  స్పర్శించినప్పుడు.

    వేదనకు  వీడ్కోలు చెప్పే,
    అమృత కలశాలు  ఈ  కన్నీళ్లు.

    నిన్ను ఓదార్చే ఆత్మీయ హస్తాలు,
    ఈ కన్నీటి నేస్తాలు. 






10 comments:

  1. మేడం నమస్తే, మీరు చెప్పిన కారణాలకు కన్నీళ్ళే తోడు,
    ఎంత అయినవారున్నా కూడా, కన్నీటి ఓదార్పు అవసరమే అనిపిస్తుంది,
    మీ కవితలు బాగుంటాయి.

    ReplyDelete
  2. అవును, కన్నీళ్ళు కూడా అమృత కలశాలనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది,మీరజ్.

    ReplyDelete
    Replies
    1. దేవీ ధన్యవాదాలు మీకు.

      Delete
  3. ప్రకృతి వైపరీత్యాలకు పేద రైతుగుండెపగిలి, కన్నఆశలు కాలి బూడిదై, నిస్సహాయతను దౌర్జన్యం కాటువేసి, తాళి ఎగతాళి గా మారి రోడ్డున పడి, ఆత్మీయులు పరాయివారై దిక్కుతోచని స్థితిలో
    మొండిచేతులతో, ఆ దేవుడిని వేడుకొంటున్నపుడు. దిగులు తెరలు, కళ్ళకు అడ్డుపడి రాలే ఈ కన్నీళ్లు .... ఈ అమృత కలశాలు ....
    మనసుకు తనువుకు ఓదార్పు అందించే ఆత్మీయ హస్తాలు ....
    కన్నీటి నేస్తాలు.

    చక్కని కంక్లూజన్
    ఆర్ద్రతతో మనసు తపించే క్షణాల్లో కన్నీరే నిజమైన నేస్తాలు
    చాలా గొప్ప అనుభూతిని కలిగించిన కవిత
    మరిన్ని కవితల్ని ఆశిస్తూ
    అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. సర్, మీ అభిమానం,ఆశ్శీస్సులు ఉంటాయి కదా చాలు, బోలెడు రాసేస్తాను :-))

      Delete

  4. మీ 'కన్నీటితోడు' కవిత కాస్తా కలవర పరిచింది చివరి వరకూ చదివాక.

    "కన్నకూతురు కాలి బూడిదైన వార్త,
    అమ్మానాన్నలు విన్నప్పుడు."

    నిస్సహాయురాలైన అంధురాలిని,
    కామందులు కాటువేసినప్పుడు,"

    హృదయం ఓ మారు మూల్గింది. చాలా భారమైన కవిత ఇది ఫాతీమా గారూ.
    శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. నిజమే ఒక్కోసారి మనస్సు మూలుగుతుంది,
      అలాంటి సందర్బం లో నుండి వచ్చిన వేదనాక్షరాలే ఇవి.
      ధన్యవాదాలు శ్రీపాద గారూ,

      Delete