Pages

Monday 14 April 2014

మేలుకో....,(ఏలుకో)










    మేలుకో....,(ఏలుకో)

    మట్టిబిడ్డల కన్నీటిని తుడవలేని,
    మతిమాలిన పాలన మాకొద్దు. 

    కరువు రక్కసి  కాళ్ళు నరికే,

    సత్తాలేని నీ పెత్తనం  మాకొద్దు. 

    అన్నదాతలను అనాథలను చేసే,

    ఎత్తుపోతల  పథకాలసలే  వద్దు. 

    బక్కరైతును  బతికున్న శవాన్నిచేసే,

    బలాదూర్ కాలయాపనలొద్దు. 

    అప్పులకు బయపడే కృషీవలునికి,

    పురుగుమందును విందుగా ఇవ్వొద్దు. 

    వేదికలెక్కి రత్నరాసుల రత్నగర్బనాదనే,

    తాతల నేతులమూతుల మాటలొద్దు. 

    కన్నెర్రజేసిన రైతన్న మండేసూరీడు కాకముందే,
    అన్నం పెట్టిన ఆచేయి ఆయుధం పట్టక ముందే...,

   మేలుకో....,పాలకా....మేలుకో..., 






13 comments:

  1. Avunu akka, prati okkaru prajalu, paalakulu melkovaali.

    ReplyDelete
  2. అయ్యో!వాడు మేలుకోడు మీరజ్ ,పైపెచ్చు వారి బలహీనతను ఆసరాగా తీసుకుని సారా పోసి వారిని నిద్దురపెడతాడు.మొన్న అందరూ తెగ తాగి ఊగిపోతూ వచ్చారు ఓటు వేయడానికి.

    ReplyDelete
    Replies
    1. దేవీ..మనమే మేలుకొలుపుదాం అక్షరాలకు అంతటి పవరుంది.

      Delete
  3. బాగుంది. చాలా బాగుంది.

    ReplyDelete
  4. మేడం గారూ(సొదరీ) మరో మారు మీకలం తన జూలు విదిల్చింది.
    ఈ కవితతో తప్పకుండా మేలుకుంటారు..ప్రభు

    ReplyDelete
    Replies
    1. సోదరా..,ధన్యవాదాలు.

      Delete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. కార్తిక్(తమ్ముడూ) ,ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete

  6. మభ్యపెట్టి ప్రలోభంలో పడవేసే అంశాలు మనకవసరమా .
    ఎంత బాగా చెప్పారు ఫాతిమా గారు .
    ఓ మానవతావాదిగా మీరొద్దన్నవి మరెవరికీ అవసరం ఉండవేమో.
    మళ్ళీ మళ్ళీ చదివేలా ఉంది మీ కవిత .
    పేలవంగా మారిన 'పాలన'లు,
    ప్రభావాన్ని కోల్పోయిన 'పథకాలు',
    చెత్తాగా మారిన 'పెత్తనాలను ' ఎవరూ స్వాగతించలేరు.

    "బక్కరైతును బతికున్న శవాన్నిచేసే,
    బలాదూర్ కాలయాపనలొద్దు.

    అప్పులకు బయపడే కృషీవలునికి,
    పురుగుమందును విందుగా ఇవ్వొద్దు. ''

    మీ ఈ మాటలు కవితకే ప్రాణం పొశాయి.
    మేలుకో....,పాలకా....మేలుకో..., అన్న మీ నినాదంతో వేల గొంతుకలు స్వరం కలుపుతాయి..
    మీ కలం పాళిని మార్చకండి, ఇలాగే పండించనీ.
    అభినందనలు ఫాతిమా గారూ .
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాద గారూ, మీ విశ్లేషణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

      Delete
  7. మట్టిబిడ్డల కన్నీరు తుడవలేక, కరువు రక్కసి కాళ్ళు నరికే సత్తాలేని, అన్నదాతలను అనాథలను చేసే, ఎత్తుపోతల పథకాల పెత్తనం .... బక్కరైతుకు పురుగుమందు విందిచ్చి బతికున్న శవాన్నిచేసి,
    ఓ నాయకపుత్రరత్నమా .... వేదికల మీద, రత్నరాసుల రత్నగర్బనాదనే, నీ తాతల నేతులమూతుల మాటలు చెప్పకు.
    కడుపుకాలిన రైతన్నలో మండేసూరీడు ఉదయించక ముందే, ఆయుధం పట్టక ముందే..., మేలుకో....నాయకా, పాలకా....మేలుకో...,
    బక్క చిక్కిన రైతన్నే కళ్ళెర్రచేసిన్నాడు మసి తప్ప నువ్వుండవు .... మేలుకో .... నాయకా, పాలకా .... మేలుకో..., అంటూ సామాజిక నాడిని వినిపించిన విధానం చాలా బాగుంది.
    హృదయపూర్వక అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
  8. మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

    ReplyDelete