Pages

Saturday 19 April 2014

గాజు తలపు.




   గాజు తలపు. 

    స్వప్న పుఠలు  తిరగేస్తున్న 
    ఓ చల్లని సాయంత్రం,
    ఊహల శిఖరాలను కొలుస్తూ....,

    గుర్తొచ్చిన నిన్ను ,
    ఆక్రుతీకరించాలనే  ఆత్రుతతో,
    కలల కుంచెను కదిలిస్తే,

    రక్తాన్నిఉమ్మి ,పచ్చినెత్తుటి గాయాన్ని,
    మరోమారు  కెలుకుతూ.. ,
    నా నరాల్లో లావాలా ఉరకలెత్తుతుంది,

    అంతస్తులూ...,అంతరాలూ వేసిన,
    నిప్పుల పందిటి  సందిట్లో,
    ఒదగలేక పరుగెత్తిన మనల్ని,

    కులపు అదిలింపులూ,మతం మందలింపులూ,
    చెరో చేయి పట్టుకు గుంజినప్పుడు,
    నేనిటూ.... ,నువ్వెటో...???

    వీడలేని తనం,వీగిపోయిన హృదయం,
    నీ చేయి గట్టిగా పట్టుకున్న  నాకు,
    చిట్లి  చిక్కిన  నీ చేతి   గాజు ముక్క...,

    ఇంకా... ,ఇప్పటికీ, .....,
    కొత్త కత్తిలా నా అరచేతిని చీరుస్తూ.....,
    రక్తం గూడుకట్టుకున్న  నా కళ్ళలో,
    అగ్ని కక్కుతూ..,

    ఆ  పచ్చటి  గాజుముక్క,

    నా నెత్తుటిని  వెచ్చబరుస్తూ....,
    ఉక్రోషాన్ని  రెచ్చగొడుతూ,
    బతుకుతాడుకు  బందీని చేసి ఉరితీస్తూ...,   
















12 comments:

  1. మనం కట్టుకున్న కులమతాల ఆర్ధిక గోడలలో మన మనసును సమాధి చేసేసుకుంటున్నాం అనడానికి ఇంతకంటే నిదర్శనమేముంది మీరజ్...............భారంగా ఉంది కవిత.

    ReplyDelete
    Replies
    1. దేవీ్...,ధన్యవాదాలు,
      మీ స్పందన నాకెంతో ఇష్టం.

      Delete

  2. స్వప్నాలను తవ్వుకున్నపుడు ఆస్వాదించిన మధుర క్షణాలే ముందుంటాయనుకుంటాం.
    కాని గుండెను కదిలించే కన్నీటి దారలు జారి పడతాయని మీ కవిత చెప్తుంది.
    భారమైన పదజాలంతో కళ్ళను మసకబార్చారు.

    "కులపు అదిలింపులూ,మతం మందలింపులూ,
    చెరో చేయి పట్టుకు గుంజినప్పుడు,
    నేనిటూ.... ,నువ్వెటో...??? "

    ..... ఎంతో పటుత్వమున్న మాటలివి . నిజం చెప్పాలంటే .. నేనైతే రాయలేనేమో ఇలా .


    "నా నెత్తుటిని వెచ్చబరుస్తూ....,
    ఉక్రోషాన్ని రెచ్చగొడుతూ,
    బతుకుతాడుకు బందీని చేసి ఉరితీస్తూ..., "

    తగిన చిత్రాన్ని జత చేసి రాసిన మీ పై మాటలు ఉత్తేజాన్ని నూరి పోస్తాయంటే అతిశయోక్తి కానే కాదు .
    ఫాతిమా గారి కవితల సారంశాన్ని చదివి అర్ధం చేసుకుంటున్నాను అని అనుకున్నప్పుడు కాస్తా 'గర్వం ' గానే తోస్తుంది నాకు .
    I am proud of you ఫాతిమా గారూ .
    అభినందనలు .
    * శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాద సర్, ఎంత పెద్ద పదాలు వాడారు,
      సాటి కవిగా మీ ఉన్నత సాహిత్యాన్ని నేను తెలుసుకున్నాను,
      మీ అభిమానానికి మరోమారు నా ధన్యవాదాలు.

      Delete
  3. గాజు తలపులు నాజూకువైనా పగిలితే గుచ్చుకుని స్రవించే రక్తపు రుధిరక్షరాలు మీ కవితలో మెండుగా దొర్లాయి.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. పద్మా..,స్పందించిన మీకు నా ధన్యవాదాలు.

      Delete
  4. ఫాతిమాజి ,
    డాక్టొర్ చెకప్ నిన్ననే అయింది . సెట్రిఘ్ట్ అయింది అన్నారు . నార్మల్ గా నడవమన్నారు .
    సహజంగా గాజు ఎంత పారదర్శతతో ఉంటుందో , ఆ గాజు తలపు కూడా అంతకు మించి ఉన్నదని చెప్పటంలో సందేహం లేదు .
    "కులపు అదిలింపులూ,మతం మందలింపులూ,
    చెరో చేయి పట్టుకు గుంజినప్పుడు,"
    అభిమతాల ఆదరింపులు కరువై పోయిన వేళ ఆ మనసు పడే ఆవేదనను బహు చక్కని చిత్రాలతో , చక్కని కవితా సుమహారమే యిది .

    ReplyDelete
    Replies
    1. శర్మాజీ, నమస్తే, మీ ఆరోగ్యం కుదటపడినందుకు సంతోషం.
      మీ స్పందనకు నా హృదయ పూర్వక నమస్సులు.

      Delete
  5. సోదరీ,మీ కవితల్లో ఇది ఎందుకో కొంత డిఫరెంట్ గా ఉంది.
    మనస్సులో మాటని ఇంకా క్లియర్ గా చెప్పలేకపోయారేమో అనిపించింది.
    మీరు రాస్తున్నది కవితే అయినా వాస్తవమేమో అనిపించాలి పాఠకునికి.
    మీకు చెపీంత గొప్పవాడినీ కాదు, ఒకరి చేత చెప్పించుకొనే అవసరమూ మీకు రాదు.
    ఓ మహోన్నత వ్యక్తిగా అనిపిస్తారు మీరు. అతిశయోక్తి కాదు..ప్రభు.

    ReplyDelete
    Replies
    1. బ్రదర్, మీ కామెంట్ నన్ను ఇబ్బందీ..,ఇరకాటమూ పెడుతుంది,
      నాకు కావలసింది నాఅ సాహిత్యం మీద విమర్శ లేదా ప్రశంస అంతే....,
      మీరు అనుకునేంత గొప్ప దాన్ని మాత్రం కాదు.
      మీ స్పందనకు నా ధన్యవాదాలు.

      Delete
  6. స్వప్న పుఠలు తిరగేస్తూ, ఊహల శిఖరాలను కొలుస్తూ.... ఓ చల్లని సాయంత్రం,
    కలల కుంచెను కదిలిస్తే,
    మనోఫలకం మీద సినిమా రీల్ లా
    అంతస్తులూ...,అంతరాలూ వేసిన నిప్పుల పందిట్లో కులం మతం చెరో చేయి పట్టుకు గుంజినప్పుడు నేను.... ,నువ్వు...???
    నీ చేయి గట్టిగా పట్టుకున్న నాకు నీ చేతి గాజు ముక్క...,
    ఇంకా... ,ఇప్పటికీ, ..... కొత్త కత్తిలా నా అరచేతిని చీరుస్తూ..... రక్తం గూడుకట్టుకున్న నా కళ్ళలో అగ్నిని కక్కుతూ..,

    కుల మత అంతరాలను దాటి అడుగు ముందుకు వేసిన అభ్యుదయరాగపు అరచేతులు రక్తపుమరకలతో కళ్ళముందు కనిపిస్తున్నాయి.
    శుభాభినందనలు మెరాజ్ ఫాతిమా గారు
    మీనుంచి మరిన్ని సామాజిక తలుపుల తెరిచిన కవితల్ని ఆకాంక్షిస్తున్నాను..



    ReplyDelete