Pages

Tuesday 22 April 2014

కొందరంతే..,

    


   కొందరంతే..,

    కొందరంతే....,
    కల్మష  పాకీ  గిడ్డంగుల్లో,
    గాలి బుడగలు.

    అర్దాంతరంగా పగిలి,
    హుందాగా ఉండేవారి,
    హృదయంపై  పడే
    అసహ్యపు మరకలు.

    తులసి వనములో,
    మొలచిన గంజాయి మొక్కలు,
    మొక్కను నాశనం చేసే,
    వేరుపురుగులు.

    చరిత్ర పుఠల్ల్లో,
    నిలిచే చీడపురుగులు,
    రక్తాన్ని ఇష్టంగా పీల్చే 
    పీడ జలగలు.

    చూపుల్నిండా,
    అసూయ మెక్కి,
    మాటల్నిండా,
    అసభ్యాన్ని దట్టి,
    దెయ్యాలై  దాడిచేసే రాతి గుండెలు.

    సమాజం లోని వెలితి నంతా,
    దుర్గందం లో నింపి,
    కడిగినా పోని,
    అశుద్దాలు.

    కళ్ళకు కనిపించని,
    అమీబాలు,
    జనారణ్యం లోని,
    జంభుకాలు.

    ముద్రించని పుస్తకము లోని,
    అక్షర దోషాలు.
    ఉప్పెనలా ఉరికే,
    మురికి కూపాలు.









12 comments:

  1. అధోగతికి రూపాలు............
    అమాయకుల పాలిట శాపాలు .

    ReplyDelete
    Replies
    1. నిజమే..,ఈ రూపాలను ఎప్పుడూ మరచిపోలేము.

      Delete
  2. " చరిత్ర పుఠల్ల్లో,
    నిలిచే చీడపురుగులు,
    రక్తాన్ని ఇష్టంగా పీల్చే
    పీడ జలగలు " ..........

    మీ ఆవేదనను అర్ధం చేసుకోగలిగా ఫాతిమా గారూ !
    మీ భావాలు గాలిలో ఎగిరి ...........
    ' వేరు పురుగులను '
    ' పీడ జలగలను '
    ' రాతి గుండెలను '
    కొంతైనా కదిలించి, వారిలో రవ్వంతైనా చైతన్యం తీసుకు రాగలిగితే,
    ఓ నూతన శకాన్ని చూడగాలుతాం -
    మరో నవలోకం లోకి పయనిచగలుగుతాం .

    ఉడుతా భక్తిగా జనవాహినికి మీ ఖంటఘోషను,
    మీవంతు ప్రయత్నంగా వినిపించాలనే మీ ఆకాంక్షను అభినందిస్తున్నాను .
    ధన్యులు మీరు ఫాతిమా గారు.

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. మీ వాఖ్య నాకు స్పూర్తినిస్తుంది శ్రీపాద గారు.

      Delete
    2. మీ వాఖ్య నాకు స్పూర్తినిస్తుంది శ్రీపాద గారు.

      Delete
  3. ఫాతిమాజీ ,

    ఇవన్నీ నిప్పులాంటి నిజాలు . బహు చక్కగా చెప్పారు .

    ReplyDelete
    Replies
    1. శర్మాజి నిజమే కదా, మీరైనా ఒప్పుకున్నారు,
      ధన్యవాదాలు.

      Delete
  4. మేడం, కవిత చదువుతుంటే...బయం వేస్తుంది.
    వికృత మనస్తత్వాలను గుర్తుచేసుకోవద్దు.
    మీ సాహిత్యం ఓ మణిపూస దాన్ని అందమైన హారములోనే కూర్చండి.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ, నాకు కూడా అందంగా రాయాలనే ఉంటుంది,
      కానీ నీకు తెలుసుగా..ఒక్కోసారి బాగా దిస్టరబ్ అవుతాను.

      Delete
    2. శ్రీగంగ సర్, ధన్యవాదాలు.

      Delete
    3. శ్రీగంగ సర్, ధన్యవాదాలు.

      Delete