Pages

Monday 7 April 2014

కలం వెక్కిరిస్తుంటే..,

     





    కలం వెక్కిరిస్తుంటే..,

     రోజూ రాజుకొనే ఆలోచనలను,
     లోకమంతా విస్తరించాలని  చూస్తూ...,

     జ్వాలా కెరటమై పోటెత్తాలనీ..,

     సునామీలా విరుచుకు పడాలనీ..,

     కళ్ళముందు చందమామలు పూయించాలనీ,

     ప్రచండ  తిమిరాన్ని  పారద్రోలాలనీ.., 

     దు:ఖం కక్కే కరువు రక్కసిని తరిమేయాలనీ..,

     రక్తం పీల్చే  పన్నుల పీక నొక్కాలనీ..,

     నిర్విరామ బాదా, నిస్సహాయ క్షోభా,

     నిరసన  సిరాతో నినదించాలనీ..,

     కానీ,


     వాల్లా సంచరించే శరీరాంగాలలో..,

     చైతన్యం నింపటం నాకు సాద్యమా?

     కవులంతా మడుగులో మునిగిన,

     దుర్యోధనుని  వారసుల్లా..,

     ఏమీచేయలేని నిస్సహాయ,నిస్సార,

     అక్షరాల ఆటుపోటులతో..,

     అస్థిత్వాన్ని  పళ్ళకింద బిగబట్టి,

     మరోమారు కలాన్ని క్షవరపు  కత్తిలా..,
     అరచేత రాసి..,తిరిగి రాతకు ఆయత్తమౌతుంటే.....,










,

8 comments:

  1. కవులంతా మడుగులో మునిగిన,
    దుర్యోధనుని వారసుల్లా..,
    ఇలా ఓ కవి బాధను కలం ద్వారా చాలా బాగా వ్యక్తంచేసారు మీరజ్.

    ReplyDelete
    Replies
    1. దేవీ, ధన్యవాదాలు.

      Delete
  2. Replies
    1. సర్, నమస్తే ఎలా ఉన్నారు?
      మీ స్పందంకు ధన్యవాదాలు.

      Delete
  3. రోజూ రాజుకొనే ఆలోచనలు, లోకమంతా విస్తరించి..., కెరటాలై.., సునామీలా విరుచుకు పడి.., చందమామలు పూచి, తిమిరం పారిపోవాలని..,
    దు:ఖం కక్కే కరువు రక్కసిని తరిమేస్తూ.., పన్నుల పీక నొక్కాలనీ.., నిర్విరామ బాధ, నిస్సహాయ క్షోభలను నినదించాలనీ..,
    కానీ,
    శవాల శరీరాంగాలలో.., చైతన్యం నింపలేక, మడుగులో మునిగిన దుర్యోధనుని వారసులు కవులు.., నిస్సహాయ, నిస్సార, అక్షరాల ఆటుపోటులతో..,
    పళ్ళకింద బిగువున, కలాన్ని క్షవరపు కత్తిలా.., అరచేతుల్లో రాసుకుని.., మళ్ళీ తాసేందుకు ఆయత్తమౌతుంటే....., కలం వెక్కిరించింది.

    కవుల కవయిత్రుల పరిమితతత్వాన్ని బాద్యతా రాహిత్యాన్ని వివరిస్తూ మార్గదర్శకం చేస్తూ
    చాలా బాగా వ్రాసారు
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!

    ReplyDelete
    Replies
    1. సర్, కవులమైన మనం మనల్ని అప్పుడప్పుడూ ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉండాలి, అది అవసరం కూడా,
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  4. "నిర్విరామ బాదా, నిస్సహాయ క్షోభా,
    నిరసన సిరాతో నినదించాలనీ..,
    కానీ,
    శవాల్లా సంచరించే శరీరాంగాలలో..,
    చైతన్యం నింపటం నాకు సాద్యమా? "

    బరువైన కవితగా తోచింది ఎందుకో !
    ఎందుకలా ? ...... కాస్తా భిన్నంగా అగుపించినా గంభీరతను ఒంటి నిండా ధరించింది.
    అప్పుడప్పుడు .. ఇలా పరవా లేదు . కాని ఇంత గాంభీర్యాన్ని భరించే శక్తి మాకుండాలిగా.

    " కవులంతా మడుగులో మునిగిన,
    దుర్యోధనుని వారసుల్లా..,
    ఏమీచేయలేని నిస్సహాయ,నిస్సార,
    అక్షరాల ఆటుపోటులతో.., "

    ఎందుకలా .... ఆక్కడే కదా అన్వస్త్రాలు అమ్ముల పొదలో దాగి వున్నాయ్. కలం వెక్కిరిస్తే పరవా లేదు కాని అది ఆగకూడదు, ముగపోకూడదు . గుండెల్లో నుండి వచ్చే ప్రతి భావననూ పదిలపరిచే "కలం" కలకాలం నిరంతరంగా పయనిస్తూనే ఉండాలి. మీ కాలానికి ఓ శక్తిని ఆపాదించు కున్నారు మీరు ఫాతిమా జీ ఈ కవితతో .
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాద గారూ, మీ బలమైన సపోర్ట్ ఉంది నా కలానికి ఇంకేమి కావాలి.
      కవిత కొంచం బరువైనదే కానీ విశ్లేషణ చాలా బాగుంది, ధన్యవాదాలు.

      Delete