Pages

Wednesday 9 April 2014

రుమాలు

    



   రుమాలు 

    మెత్తగా సుతారంగా,
    మధుర జ్ఞాపకాల మయూఖమై,
    మంటలు రేపుతుంది.

    చిన్ని పువ్వుల నేతతో,
    కొన్ని నవ్వులనింకా మూటగట్టుకొని,
    మురిపిస్తుంది.

    చేయిమారిన వైనాన్ని మరచి,
    చెలిమిని తవ్విపోసి,
    నిన్ను గుర్తుచేస్తుంది.

    కన్నీటిని తుడిచే నెపంతో,
    ఆత్మీయ స్పర్శను,
    అక్కున చేరుస్తుంది. 

    అప్పుడప్పుడూ,
    ఆత్మ పగుళ్ళను పూడుస్తూ,
    అమ్మలా హత్తుకుంటుంది.

    నీ తలపుల గాయాలతో,
    నెత్తుటి పూలనెత్తావినైతే,
    నొప్పి తీసే సంజీవనవుతుంది.

    చెక్కిలిపై జారే కన్నీటిని,
    చెలిమితో చెంత చేరి, 
    నెచ్చలిలా తుడుస్తుంది.

    నీ జ్ఞాపకాలు  నన్ను చుట్టుకొని,
    వేదనతో ఉసురు  తీసే వేళ,
    ఊపిరి సంతకమే అవుతుంది.







12 comments:

  1. " అప్పుడప్పుడూ,
    ఆత్మ పగుళ్ళను పూడుస్తూ,
    అమ్మలా హత్తుకుంటుంది. "

    రుమాలు !

    ఎంత అదృష్టం ఆ రుమాలుకు ...
    మరెంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది మా రుమాలు మీ ఈ కవితలో. అపురూపం మీ కవిత.

    కవులందరూ వెన్నెల, ప్రకృతి , పక్షులు , పుష్పాల చుట్టే కవితలనల్లుతారనుకుంటే ..... ఓ చేతి రుమాలుని ఇతివృత్తంగా
    తీసుకుని మనసుకి హత్తుకునేలా మంచి కవితనందించినందుకు అభినందనలు ఫాతిమా జీ .

    (మరో జన్మంటూ ఉంటె ఓ రుమాలు నయి పుడ్తే బాగుండేదని పించింది ... సరదాగా రాశా ఈ చివరి మాటలు : మరోలా అనుకోవద్దు ఫాతిమా గారూ).

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాద గారూ,కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీ.శ్రీ. గారు.
      ఇక్కడ రుమాలు ఆత్మీయ పాత్రను పోషిస్తుంది.మధుర జ్ఞాపకాన్ని మూటకడుతుంది.అమ్మతనాన్ని అందిస్తుంది.
      మీ స్పందనకు నా ధన్యవాదాలు.

      Delete
  2. రెక్కలు వచ్చిన ఆడపిల్లలకు అమ్మ "రుమాలు" రూపంలో వెంట వుంటుందేమో ఓదార్పుగా.మీరజ్ చాలా బాగుంది మీ రుమాలు..........

    ReplyDelete
    Replies
    1. అంతేగా దేవీ..,ధన్యవాదాలు మీకు.

      Delete
  3. మేడం, నమస్తే,
    ఈఎ కవిత ఎన్ని సార్లు చదివానో...,ఎంతబాగుందో చెప్పటం కష్టం.ఓ మధురమైన జ్ఞాపకం రుమాలు కావటం,అది అమ్మలా హత్తుకోవటమూ చదువుతుంటే ఏదో లోకాలకు వెళ్ళినట్లుంది.ఇలాంటి విషయం అందరి విషయములో జరగొచ్చు కానీ అది ఇలా వ్యక్తపరచటం అందరికీ సాద్యం కాదు.
    ఈ కవితకు శ్రీపాద గారు ఇచ్చిన కామెంట్ బాగుంది.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ..., కవిత నచ్చినందుకు థాంక్స్.

      Delete
  4. మేడం గారూ, నమస్కారం. ఈ కవిత చాలా బాగుంది అంతే కాదు ఓ సున్నిత తలపునూ,తపననూ తెలుపుతుంది.
    రుమాలు అంటే ఓ స్వేద తుడుపే కాదూ,స్వాస ముడుపూ అని చెప్పినట్లుంది (చూశారా నేనూ కవిని అయిపోతున్నాను)
    ఇలా ఇంకా ఎన్నో రాయాలి సోదరీ ఇదే నా దీవెన.

    ReplyDelete
    Replies
    1. సోదరా, మీ పేరు చెప్తే బాగుండేది,
      ఇకపోతే మీరు కవిని కానని పదే,పదే చెప్పొద్దు మీరు కవే అని ఓ సోదరిగా మీకు కితాబిస్తున్నాను.:-))

      Delete
  5. కళ్ళల్లో నీళ్ళు
    సుళ్ళు తిరిగాయి.

    ReplyDelete
    Replies
    1. సర్, నమస్తే,
      నా కవితకు ఇంతగా స్పందించిన మీకు నా ధన్యవాదాలు.

      Delete